MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • Ankit Mehta: భ‌విష్య‌త్ వ్యాపార‌వేత్త‌ల‌కు 10 ముఖ్య‌మైన పాఠాలు.. అంకిత్ మెహ‌త‌తో ఏషియానెట్ ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ.

Ankit Mehta: భ‌విష్య‌త్ వ్యాపార‌వేత్త‌ల‌కు 10 ముఖ్య‌మైన పాఠాలు.. అంకిత్ మెహ‌త‌తో ఏషియానెట్ ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ.

Ankit Mehta: భార‌త సాయుధ ద‌ళాల‌కు కీల‌క‌డ‌మైన డ్రోన్ల‌ను త‌యారు చేస్తున్న ఐడియాఫోర్జ్ స‌హ వ్య‌వస్థాప‌కులు, సీఈఓ అంకిత్ మోహ‌త ఏషియా నెట్‌కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు పంచుకున్నారు. ఆ వివ‌రాలు ఇప్పుడు చూద్దాం. 

2 Min read
Narender Vaitla
Published : Sep 26 2025, 12:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఎవ‌రీ అంకిత్ మెహ‌తా.?
Image Credit : Asianet News

ఎవ‌రీ అంకిత్ మెహ‌తా.?

భారతదేశంలో టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న సమయంలో, కొంతమంది వ్యాపారవేత్తలు కేవలం తమ ఆవిష్కరణలతోనే కాకుండా, వారి ఆలోచన, నాయకత్వం, స్ఫూర్తిదాయకమైన ప్రయాణంతో ప్రత్యేకంగా నిలుస్తారు. అలాంటి వారిలో ఒకరు Ankit Mehta, ideaForge సహ వ్యవస్థాప‌కులు, CEO. ఐఐటీ బాంబేలో విద్యార్థిగా ప్రారంభమైన అంకిత్ ప్రయాణం, నేడు భారత సాయుధ దళాలకు కీలకమైన డ్రోన్లను తయారు చేసే స్థాయికి చేరింది. ఈ అనుభవాలను ఆయన ‘Mic’d Up With India’s Defencepreneurs’ మొదటి ఎపిసోడ్‌లో పంచుకున్నారు. అదిత్ చార్లీ (Asianet News Digital కంటెంట్ హెడ్) హోస్ట్ చేసిన ఈ సంభాషణలో అంకిత్ పంచుకున్న ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం.

25
వెనుకడుగులు అవకాశాలుగా మారాలి
Image Credit : Asianet News

వెనుకడుగులు అవకాశాలుగా మారాలి

26/11 ఘటన తర్వాతే డ్రోన్‌లను తయారు చేయాలనే ఆలోచన వచ్చిందన్న అంకిత్ మొహ‌తా.. ఆ టెక్నాలజీ అప్పట్లో అందుబాటులో ఉంటే మరింత సహాయం అయ్యేదేమో అని అభిప్రాయ‌ప‌డ్డారు. ఏదైనా సంక్షోభం కొత్త అవకాశాలకు దారి తీస్తుంది. నిజమైన వ్యాపారవేత్తలు మార్కెట్లోని లోటుపాట్లను అవకాశాలుగా మార్చుకుంటారని సందేశాన్ని ఇచ్చారు అంకిత్‌.

చిన్నదిగా మొదలుపెట్టి, పెద్ద కలలు కనేలా చూడాలి

మొదట హ్యాండ్ క్రాంక్ ఛార్జర్లు తయారు చేశామ‌ని, ఆఫ్-గ్రిడ్‌లో మొబైల్ ఫోన్లు వాడుకునేందుకు రూపొందించిన‌ట్లు చెప్పుకొచ్చారు. ప్రతి ప్రయాణం చిన్నదిగా మొదలవుతుందని, నేర్చుకోవడం, ప్రయోగాలు చేయడం, బలమైన పునాది నిర్మించడం ముఖ్యమ‌నే సందేశాన్ని ఇచ్చారు.

Related Articles

Related image1
Amazon: వంద రూపాయ‌లుంటే చాలు.. అమెజాన్‌లో ఇంట్లోకి ప‌నికొచ్చే వ‌స్తువులు కొనొచ్చు
Related image2
Legal Advice: భర్త శారీరకంగా దూరంగా ఉంటే.. భార్య ప‌రిహారం డిమాండ్ చేయొచ్చా? చ‌ట్టం ఏం చెబుతోంది
35
ప్రతికూల పరిస్థితుల్లోనూ నిలబడగలగాలి
Image Credit : ideaforge technology

ప్రతికూల పరిస్థితుల్లోనూ నిలబడగలగాలి

“మా టెక్నాలజీ -30°లో, ధూళి, వర్షం, ఉప్పు వాతావరణంలో కూడా పనిచేయగలగాలి.” అని అంకిత్ చెప్పుకొచ్చారు. మ‌నం త‌యారు చేసే ఉత్పత్తులు అన్ని పరిస్థితుల్లోనూ పనిచేసేలా ఉండాలి. దీర్ఘకాలిక విజయానికి దృఢత అవసరమ‌ని ఆయ‌న అన్నారు.

టీమ్ వర్క్‌కి ప్రాధాన్యం ఇవ్వాలి

త‌మ వాద‌న‌లు ఎవ‌రి అభిప్రాయం గెలుస్తుంద‌ని చెప్ప‌డానికి కాద‌ని, వ్యాపారానికి సరైనదే చేయాలనే దానిపై ఉంటాయని అంకిత్ అన్నారు. అంటే వ్యక్తిగత అహంకారం కంటే సంస్థ విజయమే ముఖ్యం. విభేదాలు సరైన నిర్ణయాలకు దారి తీస్తాయనేది ఆయ‌న అభిప్రాయం.

45
మిషన్ ముందే ఉండాలి
Image Credit : ideaforge technology

మిషన్ ముందే ఉండాలి

“టీమ్ ఎప్పుడూ బిజినెస్ ఫలితాన్ని ముందు ఉంచితే, తేడా అభిప్రాయాలు ఉన్నా సరైన నిర్ణయానికి చేరతారు.” అని అంకిత్ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చారు. అంటే విజన్ పట్ల ఐక్యతే విజయానికి మూలం. వ్యక్తిగత గెలుపు కంటే సంస్థ మిషన్ ప్రధానమైంద‌నేది ఆయన అభిప్రాయం.

వ్యూహాత్మకంగా ఆలోచించాలి

“సూపీరియారిటీ అంటే కేవలం పోటీ కాదు, కొత్త టెక్నాలజీ సృష్టించడమే.” అనేది అంకిత్ భావ‌న‌. అంటే కేవలం పోటీ చేయడం కాదు, పరిశ్రమనే కొత్త దిశలో నడిపించాలని చెప్పుకొచ్చారు.

నిజమైన ప్రభావమే గొప్ప ఫలితం

“జీవితాలను రక్షించగలగడం లేదా కష్టసమయంలో సహాయం చేయగలగడం… అదే పెద్ద ఆనందం.” అని అంకిత్ అభిప్రాయ‌ప‌డ్డారు. అర్థవంతమైన ఫలితాలు తాత్కాలిక లాభాల కంటే విలువైనవి. నిజమైన సమస్యలను పరిష్కరించడం గొప్ప విజయమ‌నేది ఆయన భావ‌న‌.

ప్రపంచ దృష్టి స్థానిక అనుభవాల నుంచే వస్తుంది

“భారతదేశం లాంటి క్లిష్ట పరిస్థితులకు తయారు చేసే టెక్నాలజీని ప్రపంచానికి ఉపయోగించవచ్చు.” అనేది అంకిత్ మెహ‌తా అభిప్రాయం. స్థానిక సవాళ్లు ప్రపంచ మార్కెట్లో మీ బలం అవుతాయనే బిజినెస్ పాఠాన్ని చెప్పారు అంకిత్‌.

55
వేర్వేరు అభిప్రాయాలను అంగీకరించాలి
Image Credit : ideaforge technology

వేర్వేరు అభిప్రాయాలను అంగీకరించాలి

“నా సహ వ్యవస్థాపకులందరూ తమతమ రంగంలో సూపర్‌స్టార్స్. విభిన్న దృక్కోణాలు మమ్మల్ని మెరుగైన పరిష్కారాలకు నడిపించాయి.” అని అంకిత్ తెలిపారు. అంటే విభిన్న ప్రతిభలు, దృక్కోణాలు కలిసి వస్తేనే నిజమైన ఆవిష్కరణలు జరుగుతాయనేది ఆయ‌న అభిప్రాయం.

ప్రత్యేకతే విజయానికి మార్గం

“మేము నిర్మించేది ప్రపంచంలో మొదటిది కావాలి లేదా ప్రపంచంలో అత్యుత్తమం కావాలి. లేకపోతే మార్కెట్లో మిగతావారితో కలిసిపోతాం.” అని చెప్పుకొచ్చారు. ఈ లెక్క‌న వ్యాపారంలో విజ‌యం సాధించాలంటే.. గుంపును అనుసరించడం కాదు, ప్రత్యేకతను సృష్టించడం ముఖ్యం. స్థిరమైన వ్యాపారం కొత్త కేటగిరీని సృష్టించడం లేదా గ్లోబల్ బెంచ్‌మార్క్‌గా నిలవడం ద్వారానే సాధ్యమ‌వుతుంద‌నే సందేశాన్ని ఇచ్చారు.

అంకిత్ అనుభ‌వాలు మార్గ‌ద‌ర్శ‌కం

అంకిత్ మెహ‌తా పంచుకున్న అనుభవాలు ఔత్సాహిక వ్యాపార‌వేత్త‌ల‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డ‌తాయన‌డంలో సందేహం లేదు. విజయం సాధించడానికి విజన్, పట్టుదల, టీమ్‌వర్క్, ప్రభావం సృష్టించే ఆవిష్కరణలు అవసరం. ఆయన చెప్పిన ఈ పాఠాలు ప్రతి స్టార్టప్‌ వ్యవస్థాపకుడికి ప్రేరణ మాత్రమే కాదు, ఆచరణలో పెట్టదగిన మార్గదర్శకం అని చెప్పాలి.

About the Author

NV
Narender Vaitla
నరేందర్ వైట్లకు ప్రింట్‌, డిజిటల్ మీడియాలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియా నెట్ న్యూస్ తెలుగులో సీనియర్ సబ్ ఎడిటర్‌గా సేవందిస్తున్నారు. 2015లో సాక్షి దినపత్రిక ద్వారా జర్నలిజంలోకి అడుగుపెట్టారు. అనంతరం 2019లో ఈనాడు డిజిటల్‌ విభాగంలో సబ్‌ ఎడిటర్‌గా, 2020లో టీవీ9 తెలుగులో (డిజిటల్‌) సీనియర్‌ సబ్‌ ఎడిటర్‌గా పని చేశారు. లైఫ్‌స్టైల్‌, టెక్నాలజీ, హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వంటి తదితర విభాగాలకు చెందిన వార్తలు రాస్తుంటారు.
భారత దేశం
రక్షణ (Rakshana)

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved