వార్నీ... జైలుకు వెడతానన్న భయంతో ఏకంగా బల్లినే మింగేశాడు..!
జైలు అతడిని ఎంతంగా వణికించిందంటే.. భయంతో ఏకంగా బతికున్న బల్లిని పట్టుకుని మింగేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగు చూసింది.

ఉత్తర ప్రదేశ్ : ఉత్తర ప్రదేశ్ లోని కాన్పూర్లో ఓ విచిత్ర ఘటన వెలుగు చూసింది. అత్యాచారం కేసులో నిందితుడుగా ఉన్న ఓ వ్యక్తి ఏకంగా బల్లిని మింగేసాడు. ఆశ్చర్యకరంగా ఉన్న ఈ ఘటనలో అతనిని బల్లిని మింగడానికి కారణం కూడా విచిత్రంగా ఉంది. ఓ వ్యక్తి అత్యాచారం కేసులో అరెస్టయి పోలీసుల రిమాండ్ లో ఉన్నాడు.
అయితే సదరు నిందితుడు తనను పోలీసులు జైల్లో ఉంచుతారనే భయానికి లోనయ్యాడు. ఈ భయంతోనే బల్లిని మింగేసాడు. మహేష్ అనే యువకుడు ఓ బాలిక మీద అత్యాచారానికి పాల్పడ్డాడు అంటూ కేసు నమోదు అయింది.
ఈ మేరకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని.. కోర్టులో హాజరపరిచారు. ఆ తర్వాత నిందితుడిని జైలుకు తరలించాల్సి ఉంది. అయితే, నిందితుడికి జైలు అంటే విపరీతమైన భయంతో… ఏం చేయాలో తోచక పోలీస్ స్టేషన్లోనే బల్లిని మింగేసాడు.
ఇది గమనించిన పోలీసులు వెంటనే అవతరిని స్థానికంగా ఉన్న ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.
ఈ వార్త ఆ నోటా, ఈ నోటా అందరికీ తెలియడంతో.. ఇప్పుడు ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. కొంతమంది నవ్వుకుంటుండగా.. మరికొందరు అతని సాహసాహానికి ఆశ్చర్యపోతున్నారు.