8th Pay Commission : భారీగా పెరగనున్న ఉద్యోగుల జీతాలు ... రూ.18 వేలు కాస్త రూ.50వేలు?
మోదీ కేబినెట్ 8వ వేతన సంఘం ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. దీంతో ఉద్యోగుల జీతాల పెంపుపై చర్చ మొదలయ్యింది. ఈసారం సాాలరీస్ ఏ స్థాయిలో పెరగనున్నాయో తెలుసా?

8th Pay Commission
8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది. వచ్చే ఏడాది జీతాల పెంపుపై సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు గంపెడాశలు పెట్టుకున్నారు... ఎందుకంటే 2026 లో నూతన వేతన సంఘం సిపార్సులు అమలులోకి వస్తాయి. ప్రస్తుతం 7వ వేతన సంఘం సిపార్సులు అమలులో వున్నాయి... ఇవి 2026తో ముగియనున్నారు. అందుకే మారిన పరిస్థితులు, పెరిగిన ఖర్చులకు తగ్గట్లు ఉద్యోగుల జీతాలు పెంచేందుకు 8వ వేతన సంఘం ఏర్పాటుచేయాల్సి వుంది.
అయితే 8వ వేతన సంఘం ఏర్పాటుకు తాజాగా మోదీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు నిన్న (గురువారం) జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. త్వరలోనే ఈ వేతన సంఘం ఛైర్మన్, సభ్యులను కేంద్ర నియమించనుంది. వీరు ఉద్యోగుల జీతాలు, ఫించన్లు, ఇతర అలవెన్సులపై స్టడీ చేసి కేంద్రానికి నివేదిక ఇవ్వనున్నారు. దీని ప్రకారమే కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది.
8th Pay Commission
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఏ స్థాయిలో పెరుగుతాయి...
2014 ఫిబ్రవరి 7వ వేతన సంఘాన్ని ఏర్పాటుచేసారు... ఇది దాదాపు రెండేళ్లపాటు ఉద్యోగాల జీతాలు, పెన్షన్ పై స్టడీ చేసింది. దీని సిపారసులు 2016 ను ఆధారంగానే 2016 జనవరి 1 నుండి అమలులోకి వచ్చాయి. ఈ వేతన సంఘం సిపార్సులతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు భారీగా పెరిగాయి.
2016 కు ముందు కనీస వేతనం రూ.7000 వున్న ఉద్యోగులకు 8వ వేతనసంఘం సిపార్సుల ప్రకారం రూ.18,000 కు చేరింది. ఇప్పుడు కూడా ఇదేస్థాయిలో జీతాలు పెరుగుతాయని సెంట్రల్ ఉద్యోగులు ఆశిస్తున్నారు. ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నట్లే తాజా పే కమీషన్ 2.86 పిట్ మెంట్ ఇస్తే జీతం అమాతం పెరిగిపోతుంది. ఇప్పుడు కనీస వేతనం రూ.18,000 కాస్త రూ.51,480 అవుతుంది.
ఇక వేతన సంఘం ఏర్పాటుతో పించను కూడా భారీగా పెరిగే అవకాశాలుంటాయి. ఇప్పుడు కనీస పెన్షన్ రూ.9000 వుంటే నూతన పే కమీషన్ సిపార్సులతో అదికాస్త రూ.25,740 కి చేరే అవకాశం వుంది.
ఈ 8వ వేతన సంఘం సిపార్సులు తమకు ఆర్థికంగా బాగా లబ్ది చేకూరుస్తాయని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఆశిస్తున్నారు. సాలరీతో పాటు అలవెన్సులు కూడా భారీగా పెరుగుతాయని భావిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక అవసరాలు బాగా పెరుగుతున్నాయి... కాబట్టి భవిష్యత్ 10 ఏళ్లను దృష్టిలో వుంచుకుని వేతన సంఘం సిపార్సులు వుండాలని ఉద్యోగులు కోరుతున్నారు.
8th Pay Commission
వేతన సంఘం (పే కమీషన్) అంటే ఏమిటి?
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు, ఫించన్లను ఇప్పటి పరిస్థితులకు తగ్గట్లుగా సవరించడానికి ప్రభుత్వం ఓ కమీషన్ ను నియమిస్తుంది. ఈ కమీషన్ రాబోయే పదేళ్ల అవసరాలను అంచనా వేసి ఉద్యోగుల జీతాలను ఏ స్థాయిలో పెంచాలో ప్రభుత్వానికి సిపారసు చేస్తుంది. ఈ పే కమీషన్ నివేదిక ప్రకారమే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్లను పెంచుతుంది సెంట్రల్ గవర్నమెంట్.
ఇలా ఇప్పటివరకు ఏడు వేతన సంఘాలను ఏర్పాటుచేసారు. 2016లో చివరిసారిగా 8వ వేతనసంఘం సిపార్సులు అమల్లోకి వచ్చాయి. గత పదేళ్లు ఈ కమీషన్ సిపార్సుల ప్రకారమే జీతభత్యాలు ఇచ్చారు. అయితే వచ్చే ఏడాది 2026 తో పదేళ్లు పూర్తవుతోంది. కాబట్టి నూతన వేతన సంఘం సిపార్సులను అమలుచేయాల్సి వుంటుంది... అందుకోసమే ఓ ఏడాది ముందే 8వ పే కమీషన్ ను ఏర్పాటుచేసారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను, ఉద్యోగ సంఘాలతో 8వ పే కమీషన్ చర్చలు జరుపుతుంది. అలాగే ఆర్థిక శాఖతో పాటు ఇతర కీలకమైన ప్రభుత్వ విభాగాలతో సంప్రదింపులు జరుపుతుంది. ఇలా ఏడాదిపాటు ఈ పే కమీషన్ సుదీర్ఘ చర్చలు జరిపి ఓ నివేదికను రూపొందిస్తుంది. ఇందులో చేసే సిపార్సులే మరో పదేళ్లు అమలు కానున్నాయి... వీటి ప్రకారమే ఉద్యోగులకు జీతాలు దక్కనున్నాయి.