MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Movie Reviews
  • Ranabaali Sensor Review: ఒక్క కట్ కూడా లేదు.. విజయ్ దేవరకొండ సినిమాపై షాకింగ్ కామెంట్స్, రణబాలి సెన్సార్ రివ్యూ

Ranabaali Sensor Review: ఒక్క కట్ కూడా లేదు.. విజయ్ దేవరకొండ సినిమాపై షాకింగ్ కామెంట్స్, రణబాలి సెన్సార్ రివ్యూ

Ranabaali Sensor Review: రణబాలి రిలీజ్ కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు విజయ్ దేవరకొండ అభిమానులు. ఈమూవీ రిలీజ్ దగ్గర పడుతుండగా.. తాజాగా సెన్సార్ కూడా కంప్లీట్ అయ్యింది. ఇంతకీ ఈమూవీ చూసి సెన్సార్ బోర్డ్ సభ్యులు ఏమన్నారంటే?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Oct 13 2026, 04:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
రణబాలి మూవీ సెన్సార్ కంప్లీట్..
Image Credit : X

రణబాలి మూవీ సెన్సార్ కంప్లీట్..

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందాన జంటగా నటిస్తోన్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'రణబాలి'. టాలెంటెడ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రీ మూవీ మేకర్ తో పాటు టీ-సిరీస్ సంస్థలు సంయుక్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా తాజాగా తన సెన్సార్ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు నుంచి ఈ మూవీకి ఊహించని విధంగా 'జీరో కట్స్'తో క్లియరెన్స్ లభించడం సినిమాపై హైప్‌ను భారిగా పెంచింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఒక్క కట్ కూడా లేదు.. సెన్సార్ బోర్డ్ కామెంట్స్ ఏంటి?
Image Credit : Asianet News

ఒక్క కట్ కూడా లేదు.. సెన్సార్ బోర్డ్ కామెంట్స్ ఏంటి?

సినిమా ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ చిత్రాలు, ముఖ్యంగా పీరియాడిక్ ‌- యాక్షన్ జోనర్‌కి సంబంధించిన సినిమాలకు సెన్సార్ బోర్డు కొన్ని కట్స్‌, మ్యూట్‌ లు ఈ కాలంలో సర్వ సాధారణం అయిపోయాయి. కానీ 'రణబాలి' విషయంలో సెన్సార్ సభ్యులు చాలా సానుకూలంగా స్పందించారు. సినిమాలో భారీ యాక్షన్ సీక్వెన్స్ లు, పోరాట సన్నివేశాలు ఉన్నప్పటికీ, కథకు తగినట్లుగా ఎక్కడా మితిమీరిన హింస లేకుండా చాలా జాగ్రత్తగా తెరకెక్కించారు. దీంతో సెన్సార్ బోర్డు ఈ సినిమాకి ఎలాంటి కోతలు విధించకుండానే క్లీన్ 'U/A' సర్టిఫికెట్ జారీ చేసింది. కుటుంబ సమేతంగా థియేటర్లకు వచ్చి హాయిగా సినిమాను ఆస్వాదించవచ్చని సెన్సార్ వర్గాలు పేర్కొన్నట్లు సమాచారం .

34
చారిత్రక నేపథ్యం ఉన్న కథ
Image Credit : Asianet News

చారిత్రక నేపథ్యం ఉన్న కథ

1854 నుంచి 1878 మధ్య కాలంలో బ్రిటిష్ వలస పాలన నేపథ్యంలో రణబాలి కథ సాగుతుంది. నాటి మద్రాస్ ప్రెసిడెన్సీ పరిధిలోని రాయలసీమ ప్రాంతంలో చెలరేగిన భయంకరమైన కరవు కాటకాలతో పాటు, అప్పట్లో ప్రజలు పడిన అష్టకష్టాలను ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించబోతున్నారు. తిండిగింజలు కూడా దొరకని గడ్డు కాలంలో తెల్లదొరలు విధించిన అన్యాయమైన పన్నులకు వ్యతిరేకంగా, నిరుపేద ప్రజల పక్షాన నిలబడి పోరాడిన ఓ స్థానిక యోధుడి చారిత్రక గాథే రణబాలి.

ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ 'శింగనమల బొబ్బిలి రణబాలి' అనే పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఆయన సరసన భార్య పాత్రలో రష్మిక మందన్న నటించారు. బ్రిటిష్ పాలకుల అణచివేతకు ప్రతీకగా నిలిచే విలన్ 'సర్ థియోడర్ హెక్టర్' పాత్రలో ప్రముఖ హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ ఓస్లో నటించడం విశేషం. వీరితో పాటు ఈశ్వరీ రావు, జేసన్ షా, మైమ్ మధు తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తూ సినిమాకు మరింత బలాన్ని చేకూర్చారు.

44
భారీ అంచనాల నడుమ గ్రాండ్ రిలీజ్
Image Credit : Asianet News

భారీ అంచనాల నడుమ గ్రాండ్ రిలీజ్

ఈ చిత్రానికి సంగీత సంచలనాలు అజయ్-అతుల్ అదిరిపోయే నేపథ్య సంగీతంతో పాటు పాటలను అందించారు. నవీన్ యర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్‌తో రాజసం ఉట్టిపడేలా ఈ విజువల్ వండర్‌ను నిర్మించారు. భూషణ్ కుమార్ సమర్పిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. మరోవైపు, సామాన్య ప్రేక్షకులకు ఊరటనిచ్చేలా ఈ సినిమాకి టికెట్ ధరలను పెంచడం లేదని ఇప్పటికే మేకర్స్ ప్రకటించడం విశేషం. సెన్సార్ బోర్డు నుంచి ఎలాంటి కట్స్ లేకుండా 'U/A' సర్టిఫికెట్ రావడంతో, బాక్సాఫీస్ వద్ద 'రణబాలి' ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందోనని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
విజయ్ దేవరకొండ
రష్మిక మందన్న
ఏషియానెట్ న్యూస్
వినోదం
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Katakatala Rudraiah Review: కృష్ణ మీద కోపంతో కృష్ణంరాజుకు నిర్మాత అవకాశం.. బ్లాక్‌బస్టర్‌ను సూపర్ స్టార్ ఎలా మిస్ అయ్యాడు? కటాకటాల రుద్రయ్య' రివ్యూ..
Recommended image2
Baa Baa Black Sheep Review: బా బా బ్లాక్ షీప్ మూవీ రివ్యూ: క్రైమ్ కామెడీగా వచ్చిన మూవీ ఎలా ఉందంటే?
Recommended image3
Hanuman Ansh Telugu Review: హనుమాన్‌ అంశ్‌ మూవీ రివ్యూ.. నీమ్‌ కరోలి బాబా జీవితం వెండితెరపై ఎలా ఉందంటే?
Related Stories
Recommended image1
సెకనుకు 10 లక్షలు.. 50 సెకన్ల యాడ్ కోసం 5 కోట్లు తీసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?
Recommended image2
Babu Mohan: పాన్‌లో విషం కలిపి బాబు మోహన్‌ను చంపాలనుకున్నది ఎవరు? సంచలన విషయాలు వెల్లడించిన స్టార్ నటుడు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved