- Home
- Entertainment
- Babu Mohan: పాన్‌లో విషం కలిపి బాబు మోహన్‌ను చంపాలనుకున్నది ఎవరు? సంచలన విషయాలు వెల్లడించిన స్టార్ నటుడు
Babu Mohan: పాన్‌లో విషం కలిపి బాబు మోహన్‌ను చంపాలనుకున్నది ఎవరు? సంచలన విషయాలు వెల్లడించిన స్టార్ నటుడు
Babu Mohan: సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా సత్తా చాటిన అరుదైన నటులలో బాబు మోహన్ కూడా ఒకరు. కోట్లాది మందిని నవ్వించిన బాబు మోహన్ జీవితంలో ఎన్నో విషాదాలు కూడా ఉన్నాయి. స్టార్ కమెడియన్ జీవితంలో జరిగిన అతి పెద్ద ప్రమాదం గురించి మీకు తెలుసా?

తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన నటుడు..
దాదాపు రెండు దశాబ్దాల పాటు తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన హాస్య నటుడు బాబు మోహన్. తన మార్క్ డైలాగ్స్, యాస, స్వచ్ఛమైన కామెడీ టైమింగ్‌తో కోట్లాది మంది ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు బాబు మోహన్. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కేవలం సినిమాల ద్వారానే కాకుండా రాజకీయ రంగంలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన, ఎమ్మెల్యేగా, మంత్రిగా కూడా పనిచేసి రెండు రంగాల్లో సత్తా చాటారు. ప్రస్తుతం సినిమాలు వదిలేసి.. రాజకీయాలకే పరిమితమయ్యారు బాబుమోహన్. అప్పుడప్పుడు ఇంటర్వ్యూలలో తళుక్కున మెరుస్తుంటారు.
పాన్ వ్యసనం తెచ్చిన తంట
తన జీవితంలో ఎదురైన ఓ భయానక సంఘటన గురించి ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు బాబు మోహన్. ఈ విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చకు దారి తీశాయి. ఒకానొక టైమ్‌లో బాబు మోహన్‌కు పాన్ తినే అలవాటు విపరీతంగా ఉండేది. క్రమంగా అది రోజుకు ముప్పైకి పైగా పాన్‌లు తినే స్థాయికి చేరుకుంది. ఆయన ఎంతలా దానికి బానిస అయ్యారంటే, ఏ సమయంలోనైనా, ఎవరి సమక్షంలోనైనా పాన్ నమలడం ఆయన డైలీ రొటిన్‌లో భాగమైపోయింది. అయితే, ఈ సాధారణమైన అలవాటు ఆయన జీవితాన్ని ఒక రోజు పూర్తిగా తలకిందులు చేసే ప్రమాదం అంచుకు తీసుకెళ్లింది.
ప్రాణాలను తీయడానికి పన్నాగం
తన రాజకీయ, సినీ ప్రయాణంలో ఎదుగుతున్న సమయంలో కొందరు ప్రత్యర్థులు తనను ఓర్వలేక తనపై కక్ష పెంచుకున్నారని బాబు మోహన్ తెలిపారు. తన ఎదుగుదలను సహించలేక కొందరు ఏకంగా తన ప్రాణాలు తీయడానికి కుట్ర పన్నారని వెల్లడించారు. తాను ఎంతో ఇష్టంగా తినే పాన్‌లో విషం పెట్టి చంపబోయారని ఆయన అన్నారు. ఆ పాన్ తినాలనుకుంటున్న టైమ్‌లోనే పోలీసులు తనకు ఫోన్ చేసి.. "పాన్‌లో విషం ఉంది, తినొద్దు" అని అన్నారట. దాంతో ఆ రోజు ప్రాణాలతో బయటపడ్డానని బాబు మోహన్ వెల్లడించారు.
ఊహించని విధంగా తప్పించుకున్న బాబు మోహన్..
తాను తినే పాన్‌లో విషం కలిపారనే విషయం కొద్ది క్షణాల్లో తనకు తెలియడంతో ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకున్నట్లు బాబు మోహన్ షాకింగ్ విషయాలను గుర్తుచేసుకున్నారు. ఒక్క క్షణం ఆలస్యమైపోయినా తన ప్రాణాలకే ప్రమాదం వాటిల్లేదని, ఆ ఘటన తనను ఎంతగానో కలచివేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే అలా చేసింది ఎవరు అనే విషయం మాత్రం ఆయన వెల్లడించలేదు. కేవలం గ్లామర్ రంగమే కాకుండా, తెర వెనుక ఎన్నో ప్రమాదాలు, శత్రుత్వాలు ఉంటాయని ఈ సంఘటన తనకు గుణపాఠం నేర్పించిందని తెలిపారు. ఈ కుట్రల గురించి తెలిసిన తర్వాతే తాను ఆ పాన్ అలవాటును పూర్తిగా మానేశానని బాబు మోహన్ స్పష్టం చేశారు.

