MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Movie Reviews
  • Operation Aruna Reddy Review: ఆపరేషన్‌ అరుణారెడ్డి మూవీ రివ్యూ.. పోసాని ఎట్టకేలకు హిట్‌ కొట్టాడా?

Operation Aruna Reddy Review: ఆపరేషన్‌ అరుణారెడ్డి మూవీ రివ్యూ.. పోసాని ఎట్టకేలకు హిట్‌ కొట్టాడా?

స్టార్‌ యాక్టర్‌ పోసాని కృష్ణమురళీ దర్శకుడిగా, నిర్మాతగా, రైటర్‌గా, నటుడిగా ఇలా అన్నీ తానై చేసిన మూవీ `ఆపరేషన్‌ అరుణారెడ్డి`. నేడు విడుదలైన ఈ మూవీ ఎలా ఉందంటే?

4 Min read
Author : Aithagoni Raju
Published : Jul 17 2026, 06:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఆపరేషన్‌ అరుణారెడ్డి మూవీ రివ్యూ
Image Credit : Asianet News

ఆపరేషన్‌ అరుణారెడ్డి మూవీ రివ్యూ

పోసాని కృష్ణమురళీ నటుడిగా మనకు తెలుసు. ఆయన తనదైన కామెడీతో నవ్వులు పూయిస్తుంటారు. స్టార్‌ యాక్టర్‌గా రాణించారు. అంతకు ముందు స్టార్‌ రైటర్‌గా రాణించారు. ఎన్నో బ్లాక్‌ బస్టర్‌ మూవీస్‌ని అందించారు. దర్శకుడిగానూ ఒకటి రెండు సినిమాలతో విజయాలు అందుకున్నారు. కానీ చాలా వరకు సినిమాలు ఆడలేదు. అయితే రాజకీయాల్లోకి వెళ్లిన పోసాని ఇటీవల సినిమాలకు బ్రేక్‌ ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ కమ్‌ బ్యాక్‌ ఇచ్చారు. `ఆపరేషన్‌ అరుణారెడ్డి` అనే సినిమాని రూపొందించారు. దీనికి తనే దర్శకుడు, నిర్మాత, రైటర్‌, ఎడిటర్‌ కావడం విశేషం. అంతేకాదు ప్రధాన పాత్రలో కూడా నటించారు. ఆయనతోపాటు హిందోళ చక్రవర్తి, కాజల్‌ శర్మ, ఆయేషా ఖాన్‌ వంటి వారు ఇతరపాత్రలు పోషించారు. ఈ చిత్రం నేడు శుక్రవారం(జులై 17) విడుదలైంది. మరి సినిమా ఎలా ఉంది? పోసాని కమ్‌ బ్యాక్‌ ఇచ్చారా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఆపరేషన్‌ అరుణారెడ్డి మూవీ కథ
Image Credit : Asianet News

ఆపరేషన్‌ అరుణారెడ్డి మూవీ కథ

గోపాలం(పోసాని కృష్ణమురళీ) మంత్రి కొడుకు. మంచి జల్సా రాయుడు. అరుణారెడ్డి(హిందోళ చక్రవర్తి) జర్నలిస్ట్. స్టింగ్‌ ఆపరేషన్‌ చేసి మంత్రి తప్పులు, అవినీతిని బయటపెడుతుంది. దీంతో ఆయన మంత్రిపదవి పోతుంది. ఆ తర్వాత అదే మంత్రి పదవి గోపాలం మదర్‌కి వరిస్తుంది. ప్రభుత్వానికి ఆమె సపోర్ట్ గా మాట్లాడటంతో తన భర్త పదవి తనకు దక్కుతుంది. అయితే తన మంత్రి పదవి పోగొట్టిన అరుణారెడ్డి అంతు చూడాలని నిర్ణయించుకుంటారు మంత్రి కుటుంబం. అలా నెమ్మదిగా ట్రాప్‌ చేసి గోపాలంతో అరుణారెడ్డికి పెళ్లి చేస్తారు. కొంత కాలం వీరిద్దరు అన్యోన్యంగా ఉంటారు. మంచి రొమాంటిక్‌ లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తారు. కానీ ఊహించని విధంగా అరుణారెడ్డికి షాక్‌ ఇస్తాడు గోపాలం. ఆమె వేరే వ్యక్తులతో గడిపిందని, తనని మోసం చేసిందని ఆరోపిస్తాడు. విడాకులకు సిద్ధమవుతాడు. అంతేకాదు ఆమెపై హత్యాయత్నం కూడా చేస్తాడు. కానీ ఆమె ఎట్టకేలకు బతుకుతుంది.  అప్పుడే తను ప్రెగ్నెంట్‌ అని తెలుస్తుంది. ఈ కేసు కాస్త కోర్ట్ కి వెళ్లగా, అక్కడ గోపాలం షాక్‌ ఇస్తాడు. తాను అసలు మగాడినే కాదని కోర్టుకి చెబుతాడు. అంతేకాదు మెడికల్‌ టెస్ట్ ల్లోనూ అదే తేలుతుంది. ఇంతలో గోపాలం తండ్రి మరో షాక్‌ ఇస్తారు. అరుణారెడ్డిలో పెరిగే బిడ్డకి తనే తండ్రిని అని చెబుతాడు. వాళ్ల అమ్మ కూడా అదే చెబుతుంది. అరుణారెడ్డినే ట్రాప్‌ చేసిందనేలా కోర్ట్ కి వివరిస్తారు. మరి అసలు గోపాలం మగాడా కాదా? వాళ్ల పేరెంట్స్ ఎందుకు అలా చెప్పారు? ఇందులో వాళ్లు చేసిన కుట్ర ఏంటి? అరుణారెడ్డి చేసిన తప్పేంటి? వాళ్ల జర్నలిస్ట్ టీమ్‌ కలిసి చేసిన స్టింగ్‌ ఆపరేషన్‌ ఏంటి? ఈ సినిమా ద్వారా పోసాని ఇచ్చిన సందేశం ఏంటనేది మిగిలిన సినిమా.

Related Articles

Related image1
Oh Sukumari Review: ఓ సుకుమారి మూవీ రివ్యూ.. తిరువీర్‌, ఐశ్వర్యా రాజేష్‌ నవ్వించడంలో సక్సెస్ అయ్యారా
Related image2
Rajamouli Lovestory: రాజమౌళి అంత అమాయకుడేం కాదు.. జక్కన్నతో లవ్‌ స్టోరీ బయటపెట్టిన రమా రాజమౌళి
34
ఆపరేషన్‌ అరుణారెడ్డి మూవీ విశ్లేషణ
Image Credit : Asianet News

ఆపరేషన్‌ అరుణారెడ్డి మూవీ విశ్లేషణ

ఇక నిజాయితీ గల లేడీ జర్నలిస్ట్ కథని ఇందులో చూపించారు పోసాని. అదే సమయంలో ప్రస్తుతం రాజకీయ నాయకులు ఎలా ఉన్నారనేది ఇందులో చూపించే ప్రయత్నం చేశాడు. జర్నలిస్ట్ లు రాజకీయ నాయకుల తప్పులను ఎత్తిచూపే క్రమంలో ఎదురయ్యే ఆటుపోట్లని, దీనికితోడు, తమ పదవుల కోసం రాజకీయ నాయకులు ఎలాంటి దారుణాలను దిగజారుతారనే విషయాన్ని `ఆపరేషన్‌ అరుణారెడ్డి` సినిమాలో చెప్పారు పోసాని కృష్ణమురళీ. చెప్పాలనుకున్న సందేశం ఫర్వాలేదు. కానీ చెప్పిన తీరు, చూపించిన తీరునే ఆకట్టుకునేలా లేదు. ఈ మూవీ చూస్తుంటే ఏమాత్రం సినిమా చూసిన ఫీలింగ్‌ ఉండదు, సీరియల్‌ కంటే దారుణంగా ఉంది. చాలా స్లోగా సాగుతుంది. సీరియల్‌ మాదిరిగా వేసిన షాట్సే వేస్తుంటారు. సన్నివేశాల్లో ఏమాత్రం సహజత్వం లేదు. అంతా ఆర్టిఫీషియల్‌ గా ఉంటాయి. ఫస్టాఫ్‌లో కోర్ట్ లో విడాకులకు వెళ్లడం, ఈ క్రమంలో పోసాని తన ఫ్లాష్‌ బ్యాక్‌ గురించి చెప్పడం,  అరుణారెడ్డితో పెళ్లి, ఆమెతో రొమాన్స్ ని చూపించారు. ఆయా సన్నివేశాల్లో సహజత్వం మిస్ అయ్యింది. దీంతో సీన్లు పండలేదు. ఇక కోర్ట్ లో ట్విస్ట్ లపై ట్విస్ట్ లు ఇచ్చిన తీరు బాగుంది. ట్విస్ట్ లు బాగున్నాయి, కానీ వాటి మేకింగ్‌ మాత్రం ఆకట్టుకునేలా లేవు. సెకండాఫ్‌లోనూ చాలా ట్విస్ట్ లు పెట్టారు.  అవి కూడా ఆశించిన స్థాయిలో థ్రిల్‌ ఇవ్వలేదు. కొన్ని మంచి సీన్లు ఉన్నాయి. అయితే జర్నలిస్ట్ పై పగతీర్చుకునేందుకు ఆమెని తన కొడుక్కి ఇచ్చి పెళ్లి చేయడం, ఆ తర్వాత ఆమె మంచిది కాదు, ఇతరులతో పడుకుందనే ఆరోపణలు చేయడం, దీనికితోడు సొంత తండ్రినే తన భార్యలో పెరుగుతున్న బిడ్డకి తండ్రి అని చెప్పడం వంటి సీన్లు వినడానికి చూడ్డానికి ఇబ్బందిగా ఉంటాయి. జుగుప్సాకరంగా అనిపిస్తాయి. ఇందులో ఆర్టిస్ట్ లు కూడా ఎవరికీ అనుభవం లేదనే విషయం స్పష్టంగా కనిపిస్తుంది. కనీసం యాక్టింగ్‌ స్కిల్క్ కూడా కనిపించలేదు. చాలా దారుణంగా యాక్ట్ చేశారు. దీంతో పోసాని చెప్పాలనుకున్న విషయం, చూపించాలనుకున్న విషయం కూడా కిల్‌ అయిపోయింది. ప్రతి సీన్ ఏమాత్రం క్వాలిటీగా లేదు. ప్రొడక్షన్‌ పరంగా క్వాలిటీ లేదు, మేకింగ్‌ క్వాలిటీ లేదు. రైటింగ్‌ కూడా వీక్‌గా ఉంది. ఏదో సీన్లు తీసుకుంటూ వెళ్లారు గానీ, ఎమోషనల్‌గా అవి ఎంత వరకు కనెక్ట్ అవుతాయనేది చూసుకోలేదనిపిస్తుంది. ఫైనల్‌గా క్లైమాక్స్ లో ఇచ్చిన ట్విస్ట్ బాగుంది. ఆకట్టుకునేలా, ఎమోషనల్‌గా ఉంది. కన్‌క్లూజన్‌ ఫర్వాలేదని చెప్పొచ్చు. సినిమా మొత్తంలో అదొక్కటే హైలైట్‌గా నిలుస్తుందని చెప్పొచ్చు.

44
ఆర్టిస్ట్ లు, టెక్నీషియన్లు ఎలా చేశారంటే?
Image Credit : Asianet News

ఆర్టిస్ట్ లు, టెక్నీషియన్లు ఎలా చేశారంటే?

సినిమాలో గోపాలం పాత్రలో పోసాని బాగా చేశారు. విభిన్న షేడ్స్ చూపించారు. లేడీగానూ మారి ఆకట్టుకున్నారు. రొమాంటిక్‌ సీన్లలోనూ రెచ్చిపోయారు. మరోవైపు అరుణారెడ్డిగా హిందోళ చక్రవర్తి బాగా చేసింది. సినిమాకి మరో అసెట్‌గా నిలిచింది. కాకపోతే నటిగా ఆమె కూడా అంతగా మెప్పించలేకపోయింది. మిగిలిన పాత్రదారులు  కూడా నటన విషయంలో తేలిపోయాయి. దర్శకుడు వారి నుంచి నటన రాబట్టుకోలేకపోయాడా? లేక వాళ్లు చేయలేకపోయారా? ఏమో గానీ యాక్టింగ్‌ అనేది సినిమాకి పెద్ద మైనస్‌. ఇక టెక్నీకల్‌గా మూవీ మ్యూజిక్‌ ఫర్వాలేదు. ఆర్‌ఆర్‌ కూడా ఫర్వాలేదు. ఎడిటింగ్‌ వీక్‌గా ఉంది. రైటింగ్‌ వీక్‌గా ఉంది. డైరెక్షన్‌ అంతకంటే వీక్‌గా ఉంది. ఇప్పుడు సీరియల్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా అలా కూడా అనిపించలేదు. పోసాని నుంచి ఇలాంటి సినిమాని అస్సలు ఊహించరు. ఆయన దర్శకత్వ ప్రతిభ, రైటింగ్‌ కెపాసిటీ ఇందులో మిస్‌ అయ్యాయి. ఏదో మొక్కుబడిగా మూవీని తీసినట్టుగా ఉంది.

ఫైనల్‌గా : `ఆపరేషన్‌ అరుణారెడ్డి` ఆపరేషన్‌ ఫెయిల్‌ అయ్యిందని చెప్పొచ్చు. ఈ సినిమా చూశాక సీరియల్స్ చాలా బెటర్‌ అనే ఫీలింగ్ కలుగుతుంది.

రేటింగ్‌: 1.5

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
సినిమా సమీక్షలు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Pandanti Kapuram Review: ఏఎన్నార్ దసరాబుల్లోడికి షాక్ ఇచ్చిన కృష్ణ, సూపర్ స్టార్ ఫస్ట్ గోల్డెన్ జూబ్లీ మూవీ, పండంటి కాపురం రివ్యూ..
Recommended image2
Ramba Oorvasi Menaka Movie Review: రంభ ఊర్వశి మేనక మూవీ రివ్యూ.. అల్లరి నరేష్‌ కామెడీ వర్కౌట్‌ అయ్యిందా?
Recommended image3
Sahaa Movie Review: సహ మూవీ రివ్యూ.. హీరోయిన్‌ గుండు కొట్టించుకోవాలా? వద్దా?
Related Stories
Recommended image1
Oh Sukumari Review: ఓ సుకుమారి మూవీ రివ్యూ.. తిరువీర్‌, ఐశ్వర్యా రాజేష్‌ నవ్వించడంలో సక్సెస్ అయ్యారా
Recommended image2
Rajamouli Lovestory: రాజమౌళి అంత అమాయకుడేం కాదు.. జక్కన్నతో లవ్‌ స్టోరీ బయటపెట్టిన రమా రాజమౌళి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved