MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Rajamouli Lovestory: రాజమౌళి అంత అమాయకుడేం కాదు.. జక్కన్నతో లవ్‌ స్టోరీ బయటపెట్టిన రమా రాజమౌళి

Rajamouli Lovestory: రాజమౌళి అంత అమాయకుడేం కాదు.. జక్కన్నతో లవ్‌ స్టోరీ బయటపెట్టిన రమా రాజమౌళి

Rama Rajamouli Lovestory: రాజమౌళి అనుకున్నంత అమాయకుడేం కాదని, ఆయనకు సిగ్గేం లేదని చెప్పింది రమా రాజమౌళి. ఆయనతో ప్రేమ పెళ్లికి సంబంధించి ఆమె ఓపెన్‌ అయ్యింది.

2 Min read
Author : Aithagoni Raju
Published : Jul 16 2026, 03:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
రాజమౌలి, రమా మధ్య ప్రేమకథ
Image Credit : our own

రాజమౌలి, రమా మధ్య ప్రేమకథ

దర్శకధీరుడు రాజమౌళి ఇప్పుడు ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్‌ డైరెక్టర్‌ అని చెప్పొచ్చు. ఆయన తెలుగు సినిమానే కాదు, భారతీయ సినిమా దశ దిశని మార్చేశాడు. ప్రస్తుతం ఆయన మహేష్‌బాబుతో గ్లోబల్‌ ఫిల్మ్ చేస్తున్నాడు. `వారణాసి` చిత్రాన్ని గ్లోబల్‌ ఫిల్మ్ గా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇది వచ్చే ఏడాది సమ్మర్‌ లో విడుదల కాబోతుంది. ఈ చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్న రాజమౌళి కి సంబంధించిన లవ్‌ స్టోరీ బయటకు వచ్చింది. ఆయన భార్య రమా రాజమౌళి వీరి ప్రేమ కథని వెల్లడించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఏళ్లపాటు కలిసి ట్రావెల్‌ చేశాం
Image Credit : Asianet News

ఏళ్లపాటు కలిసి ట్రావెల్‌ చేశాం

రమా రాజమౌళి.. జక్కన్నతో తన ప్రేమ కథని వెల్లడించింది. తన అక్క వల్లి.. కీరవాణి భార్య. దీంతో రాజమౌళి ఫ్యామిలీ అంతా పరిచయం. తరచూ కలుస్తుంటారు. ఫంక్షన్లు, ఏదైనా ఈవెంట్లలోనూ కలిసేవాళ్లు. `మొదట రాజమౌళిని చూసినప్పుడు ఎలాంటి ఫీలింగ్‌ లేదు. చాలా రోజులు ట్రావెల్‌ అయ్యాం. చాలా సంవత్సరాలకు బాగా కలిసిపోయాం. ఫ్రెండ్లీగా మారిపోయాం. ఒకరిగురించి ఒకరికి బాగా తెలిసింది. అలా మేం దగ్గరయ్యాం. అలాగని ఇదేదో పెద్ద ప్రేమ కథ కాదు. అలా కలిసి ట్రావెల్‌ అవుతున్న సమయంలో రాజమౌళి ఈ ప్రపోజల్‌ తీసుకొచ్చాడట. అప్పుడు ఆయన `శాంతి నివాసం` సీరియల్‌కి వర్క్‌ చేస్తున్నాడు. నేను `అమృతం` సీరియల్‌కి ప్రొడక్షన్‌లో వర్క్ చేస్తున్నాను. స్టూడెంట్‌ నెం 1 ఆఫర్‌ వచ్చిన తర్వాత తామ మధ్య పెళ్లి ప్రస్తావన వచ్చిందని తెలిపింది రమా రాజమౌళి. జక్కన్ననే ఈ ప్రస్తావన తీసుకొచ్చినట్టు తెలిపింది రమా.

34
మా మధ్య గొడవలు లేవు
Image Credit : instagram

మా మధ్య గొడవలు లేవు

రాజమౌళి చాలా షై పర్సన్‌ అని విన్నాం, ఎలా కలిసిపోయారని యాంకర్‌ ప్రశ్నించగా, ఆయనకు సిగ్గేం లేదు. అంత అమాయకుడేం కాదు. అయితే వర్క్ పట్ల ఫోకస్‌గా ఉంటాడు, ఆ విషయంలో రాజీ లేదు. అయితే అదే సమయంలో మంచి పార్టనర్‌ కావాలని, మంచి భార్య కావాలని ఉంటుంది. అలా తనని ఎంచుకున్నాడని చెప్పింది రమా. మరి మీ మధ్య ఏవైనా మనస్పర్థాలు వస్తుంటాయా? ఎలా ఉంటారనే ప్రశ్నకి రమా రాజమౌళి స్పందిస్తూ, తమ అభిప్రాయాలు కలిసిపోతాయని, 99శాతం తేడా ఉండదని, ఒక్క శాతం కూడా ఏంచెప్పాలని ఆలోచిస్తున్నట్టు తెలిసింది. వ్యక్తిగతంగా, ఫ్యామిలీలో డిఫరెన్సెస్‌ ఉండవని, ఏదైనా వర్క్ విషయంలోనే ఉంటుందన్నారు. ఇద్దరం ఒకే ఒపీనియన్‌తో వెళ్లిపోతామని తెలిపారు.

44
ట్రావెలింగ్‌ గురించే ఎక్కువ చర్చ
Image Credit : Asianet News

ట్రావెలింగ్‌ గురించే ఎక్కువ చర్చ

ఇక సినిమా గురించే మాట్లాడుకుంటా? ఇంకా వేరే టాపిక్‌ ఉంటుందా? అని అడగ్గా, ఎక్కువగా సినిమా గురించే అని, అది కాకుండా హాలీడేస్‌(ట్రావెలింగ్‌) గురించి మాట్లాడుకుంటామని, ప్రాజెక్ట్‌ అయిపోయాక ఎక్కవ వెళ్దామనే చర్చ ఉంటుందని, ఇద్దరికీ ట్రావెలింగ్‌ అంటే ఇష్టమని చెప్పింది. తాము చాలా కంట్రీస్‌ తిరిగాం, ఇంకా ఏది కవర్ చేయాలని అని మాట్లాడుకుంటామని చెప్పారు. అదే సమయంలో ఇతర దేశాల కాయిన్స్ ని కలెక్ట్ చేస్తుంటామని చెప్పింది రమా రాజమౌళి. ప్రతి సినిమా తర్వాత అందరం కలిసి ఒక ట్రిప్‌కి వెళ్తామని, కేవలం మా ఫ్యామిలీ వరకే మరో ట్రిప్‌కి వెళ్తుంటామని చెప్పింది రమా. ఆమె కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా రాణిస్తోంది. రాజమౌళి సినిమాలకు ఆమెనే కాస్ట్యూమ్‌ డిజైనర్‌ కావడం విశేషం.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: ఝాన్సీ వల్ల బాటమ్ లోకి షాలిని, రోహిత్.. ఇరగదీసిన నరేష్, రామ్ ప్రసాద్
Recommended image2
Ranabaali Trailer: రణబాలి ట్రైలర్ రివ్యూ.. బ్రిటిష్‌పై వీర పోరాటం, విజయ్ దేవరకొండ ఊచకోత చూశారా
Recommended image3
Bollywood Controversies: సల్మాన్-షారుఖ్ నుంచి కంగనా-హృతిక్ వరకు.. స్టార్లను కుదిపేసిన 7 వివాదాలు
Related Stories
Recommended image1
Indra 2 Update: ఈసారి దేశం గర్వపడేలా మూవీ.. చిరంజీవికి క్షమాపణలు చెప్పిన స్టార్‌ రైటర్‌
Recommended image2
Fauzi Release Date: పూనకాలు తెప్పించేలా ప్రభాస్‌ లుక్‌, ఫౌజీ రిలీజ్‌ డేట్‌.. ఏడాది గ్యాప్‌తో 3 సినిమాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved