MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Movie Reviews
  • Oh Sukumari Review: ఓ సుకుమారి మూవీ రివ్యూ.. తిరువీర్‌, ఐశ్వర్యా రాజేష్‌ నవ్వించడంలో సక్సెస్ అయ్యారా

Oh Sukumari Review: ఓ సుకుమారి మూవీ రివ్యూ.. తిరువీర్‌, ఐశ్వర్యా రాజేష్‌ నవ్వించడంలో సక్సెస్ అయ్యారా

ఐశ్వర్యా రాజేష్‌, తిరువీర్‌ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ `ఓ సుకుమారి`. ట్రైలర్‌తో ఆకట్టుకున్న ఈ చిత్రం నేడు విడుదలైంది. మరి నవ్వులు పంచడంలో సక్సెస్‌ అయ్యిందా?

3 Min read
Author : Aithagoni Raju
Published : Jul 17 2026, 04:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఓ సుకుమారి మూవీ రివ్యూ
Image Credit : Asianet News

ఓ సుకుమారి మూవీ రివ్యూ

యంగ్‌ హీరో తిరువీర్‌, ఐశ్వర్యా రాజేష్‌ జంటగా నటించిన మూవీ `ఓ సుకుమారి`. దీనికి భరత్‌ దర్శన్‌ దర్శకత్వం వహించారు. గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మహేశ్వర్ రెడ్డి మౌళి నిర్మాణంలో రూపొందిన చిత్రమిది. ఐశ్వర్యా రాజేష్‌ నటించిన సినిమా కావడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మంచి బజ్‌ ఏర్పడింది. ఈ చిత్రం నేడు శుక్రవారం(జులై 17న) విడుదలైంది. మరి సినిమా ఎలా ఉంది? నవ్వించిందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఓ సుకుమారి మూవీ కథ
Image Credit : Asianet News

ఓ సుకుమారి మూవీ కథ

యాదగిరి(తిరువీర్‌)ది కరీంనగర్‌ లోని భూంపల్లి గ్రామం. సర్పంచ్‌ కావాలని కలలు కంటుంటాడు. వీరిది పెద్ద కుటుంబం. కానీ వీరి నాన్న, చిన్నాకి పడదు. ఓ రోజు లాయర్‌ వచ్చి మీ తాత మీ పేర్లతో 80 ఎకరాలు రాసిచ్చాడు. కానీ మనవళ్లలో ముందుగా ఎవరికైతే వారసుడు జన్మిస్తాడో వాళ్లకే ఆ ఆస్తి చెందుతుందని వీలునామా రాశాడని చెబుతాడు. దీంతో ముందుగా తనే కొడుకుని కనాలని యాదగిరి తమ్ముడు తాను ప్రేమించానని చెప్పి ప్రెగ్నెంట్‌ అమ్మాయిని తీసుకొస్తాడు. దీంతో యాదగిరి కూడా అర్జెంట్‌గా పెళ్లి చేసుకోవాలని అమ్మాయిల కోసం చూస్తుంటాడు. ఇంతలో దామిని(ఐశ్వర్యా రాజేష్‌) ని చూసి ఇష్టపడతాడు. ఆమెని ఊర్లో జనం తరిమేస్తుంటారు. ఆమెకి చిన్నప్పట్నుంచి ఒక సమస్య ఉంటుంది. ఆమెని ఎవరైనా ముట్టుకుంటే షాక్‌ కొడుతుంది. దీంతో దామినిని వదిలించుకోవాలని చూస్తుంటారు. కరెక్ట్ గా యాదగిరి తగులుతాడు. ఆయనకు దామిని గురించి తెలియక పెళ్లికి సిద్ధమవుతాడు. దామిని తండ్రి చెప్పే ప్రయత్నం చేసినా వినడు. దీంతో ఎట్టకేలకు పెళ్లి చేసుకుంటాడు. మధ్యలో ఒకటి రెండు సార్లు షాక్‌ కొట్టినా, `మగధీర` సినిమాలా జరుగుతుందనుకుంటాడు. కానీ ఫస్ట్ నైట్‌ రోజు యాదగిరికి అర్థమవుతుంది. మరి ఆమె అసలు సమస్య తెలిశాక యాదగిరి ఏం చేశారు? వీరిద్దరు కలిసి ఉన్నారా? విడిపోయారా? దామిని వల్ల వాళ్ల ఇంట్లో వచ్చిన మార్పేంటి? ఆ తర్వాత యాదగిరి, దామిని లైఫ్‌లో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయనేది మిగిలిన సినిమా.

Related Articles

Related image1
Chiranjeevi: అట్టర్ ఫ్లాప్ అనుకున్న మూవీని ఛాలెంజ్ చేసి మరీ సంవత్సరం ఆడించిన చిరంజీవి.. తొలి రోజే అపశకునం
Related image2
Rajamouli Lovestory: రాజమౌళి అంత అమాయకుడేం కాదు.. జక్కన్నతో లవ్‌ స్టోరీ బయటపెట్టిన రమా రాజమౌళి
36
ఓ సుకుమారి విశ్లేషణ
Image Credit : Asianet News

ఓ సుకుమారి విశ్లేషణ

హీరోకిగానీ, హీరోయిన్‌కి గానీ ఒక సమస్య నేపథ్యంలో మంచి కాన్సెప్ట్ తో రూపొందించిన చిత్రాలకు ఇటీవల కాలంలో మంచి ఆదరణే ఉంటుంది. అయితే ఆ కాన్సెప్ట్ ని ఎంత బాగా తెరపై ఆవిష్కరిస్తారు, ఎంత గ్రిప్పింగ్‌గా కథనాన్ని తీసుకెళ్తారు, ఎంతగా నవ్వించారనే దాన్ని బట్టి సినిమా ఫలితం ఆధారపడి ఉంటుంది. `ఓ సుకుమారి` సినిమా ఆ విషయంలో చాలా వరకు రీచ్‌ అయ్యిందని చెప్పొచ్చు. ఇందులో హీరోకి ఒక సమస్య, హీరోయిన్‌కి ఒక సమస్యని పెట్టి, ఆ రెండింటిని కలిపిన తీరు, ఈ క్రమంలో చోటు చేసుకునే కామెడీని ప్రధానంగా చేసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించిన తీరు బాగుంది. ఆద్యంతం కామెడీ ఎంటర్‌టైనర్‌గా అలరించింది. సందర్బానుసారంగా కామెడీ వర్కౌట్‌ అయ్యేలా సినిమాని రూపొందించడంలో దర్శకుడు చాలా వరకు సక్సెస్‌ అయ్యాడు. ఫస్టాఫ్‌లో తిరువీర్‌ సర్పంచ్‌ కావాలనే ప్రయత్నాల్లో ఉంటారు. మరోవైపు ఫ్యామిలీలో పడకపోవడం, అంతలోనే 80ఎకరాల తాత భూమి ఆఫర్‌ రావడం, దానికోసం హీరో పెళ్లి ప్రయత్నాలు చేయడం, ఇద్దరు రంగు తక్కువ ఉన్న అమ్మాయిలతో మంచి కామెడీ పెట్టి నవ్వించే ప్రయత్నం చేశారు. ఇంకోవైపు ఐశ్వర్యా రాజేష్‌కి కరెంట్‌ షాక్‌ కొట్టడం, దీంతో ఊరంతా ఆమెని సమస్యగా ఫీలవడం వంటివి కామెడీగా చూపించారు. ఇలా చాలా వరకు నవ్వులు పూయించింది. అయితే ఫ్యామిలీ డ్రామా ఓవర్‌గా అయ్యింది. చాలా వరకు లాజిక్‌ లెస్‌ సీన్లు ఉన్నాయి. సెకండాఫ్‌లో అది మరింత ఎక్కువగా అయ్యింది. హీరో తిరువీర్‌ ఇంట్లో ఫ్యామిలీ విషయాలు ఓవర్‌గా ఉన్నాయి. ఝాన్సీ సీన్లు కూడా  ఇరిటేట్‌ తెస్తాయి. ఐశ్వర్యా రాజేష్‌ సమస్యకి సంబంధించిన సీన్లు కూడా బలవంతంగా అనిపిస్తాయి. వాటిలో ఫన్‌ వర్కౌట్‌ కాలేదు. కామెడీ సీన్లు డైలాగులు ఇరికించినట్టుగా ఉంటాయి. దీంతో నవ్వులు రావడం కాదు కదా, గోల గోలగా మారిపోయింది. దీనికితోడు చాలా వరకు సన్నివేశాలు సాగదీసినట్టుగా, లాగ్‌ అనేలా ఉంటాయి. తిరువీర్‌ ఫ్యామిలీలో హీరోయిన్‌ ఏమార్పు తెచ్చిందనేది స్పష్టత లేదు. చాలా సీన్లు ఊహించినట్టుగానే ఉంటాయి. ఇలాంటి కొన్ని సినిమాకి మైనస్ గా చెప్పొచ్చు. కానీ చాలా వరకు సినిమా నవ్వులు పంచడంలో సక్సెస్‌ అయ్యిందని చెప్పొచ్చు.

46
ఓ సుకుమారిలో ఎవరు ఎలా నటించారంటే?
Image Credit : Asianet News

ఓ సుకుమారిలో ఎవరు ఎలా నటించారంటే?

యాదగిరి పాత్రలో తిరువీర్‌ బాగా చేశాడు. పాత్రలో జీవించాడు. అంతే నేచురల్‌గా నటించి మెప్పించాడు. అమాయకంగా కనిపిస్తూ నవ్వించాడు. తన సమస్యతో అలరించాడు. అదే సమయంలో యాక్షన్‌తోనూ మెప్పించాడు. ఇక దామిని పాత్రలో ఐశ్వర్యా రాజేష్‌ ఇరగదీసింది. హీరో రేంజ్‌లో ఆమె పాత్ర ఉంటుంది. చాలా వరకు తిరువీర్‌ని డామినేట్‌ చేసింది. ఆమెపై ఒక యాక్షన్‌ ఎపిసోడ్‌ కూడా ఉంది. ఆమె పాత్ర బలంగా ఉంది. ఊరు సర్పంచ్‌గా మురళీధర్‌ గౌడ్‌ తనకు సెట్‌ అయ్యే పాత్రలో అలరించారు. తిరువీర్‌ తమ్ముడిగా శ్రీనివాస్‌ గవిరెడ్డి ఫర్వాలేదనిపించారు. మిగిలిన పాత్రలు ఓకే అనిపించాయి.

56
ఓ సుకుమారి మూవీ టెక్నీకల్‌గా ఎలా ఉందంటే?
Image Credit : Asianet News

ఓ సుకుమారి మూవీ టెక్నీకల్‌గా ఎలా ఉందంటే?

భరత్‌ మాంచి రాజు మ్యూజిక్‌ బాగుంది. ఉన్నంతలో ఆకట్టుకుంది. పాటలు ఫర్వాలేదు. ఆర్‌ఆర్‌ కూడా ఆకట్టుకునేలా ఉంది. కుషేందర్‌ రెడ్డి కెమెరా వర్క్ బాగుంది. విజువల్స్ గా సినిమా కనువిందుగా ఉంది. శ్రీ వర ఎడిటింగ్‌ ఫర్వాలేదు. మహేశ్వర్‌ రెడ్డి మౌళి నిర్మాణ విలువలకు కొదవలేదు. దర్శకుడు భరత్‌ దర్శన్‌ ఎంచుకున్న కథ బాగుంది. కాకపోతే ఇంకా బాగా రాసుకోవాల్సింది. కామెడీ విషయంలో మరింత ఫోకస్‌ పెట్టాల్సింది. కామెడీ నేచురల్‌గా పండించే ప్రయత్నం చేస్తే ఇంకా బాగుండేది. మాటల విషయంలో ఇంకా బెటర్‌మెంట్‌ అవసరం.

66
ఫైనల్‌గా
Image Credit : Asianet News

ఫైనల్‌గా

లాజిక్కులు వెతక్కుండా చూస్తే టైమ్‌ పాస్‌కి సరదాగా నవ్వుకునే మూవీ ఓ సుకుమారి.

రేటింగ్‌: 2.5

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
సినిమా సమీక్షలు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Lenin Movie Review: లెనిన్‌ మూవీ రివ్యూ.. అఖిల్‌కి ఈ సారైనా హిట్‌ పడిందా?
Recommended image2
I Nobody Movie Review: ఐ నోబడీ మూవీ రివ్యూ, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ నటించిన మూవీ ఎలా ఉందంటే?
Recommended image3
Krishna: ఎన్టీఆర్ మాటను ఎదిరించి, పోటీగా కృష్ణ తెరకెక్కించిన భారీ బడ్జెట్ సినిమా, కురుక్షేత్రం రివ్యూ...
Related Stories
Recommended image1
Chiranjeevi: అట్టర్ ఫ్లాప్ అనుకున్న మూవీని ఛాలెంజ్ చేసి మరీ సంవత్సరం ఆడించిన చిరంజీవి.. తొలి రోజే అపశకునం
Recommended image2
Rajamouli Lovestory: రాజమౌళి అంత అమాయకుడేం కాదు.. జక్కన్నతో లవ్‌ స్టోరీ బయటపెట్టిన రమా రాజమౌళి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved