- Home
- Entertainment
- Movie Reviews
- `కొత్తపల్లిలో ఒకప్పుడు` మూవీ రివ్యూ, రేటింగ్.. విలేజ్ డ్రామా ఎలా ఉందంటే?
`కొత్తపల్లిలో ఒకప్పుడు` మూవీ రివ్యూ, రేటింగ్.. విలేజ్ డ్రామా ఎలా ఉందంటే?
నూతన నటీనటులతో `కేరాఫ్ కంచరపాలెం` నటి ప్రవీణ పరుచూరి రూపొందించిన చిత్రం `కొత్తపల్లిలో ఒకప్పుడు`. ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.

`కొత్తపల్లిలో ఒకప్పుడు` మూవీ రివ్యూ, రేటింగ్
రవీంద్ర విజయ్, మనోజ్ చంద్ర, మోనికా, బెనర్జీ, ఉషా బోనేలా ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం `కొత్తపల్లిలో ఒకప్పుడు`. `కేరాఫ్ కంచరపాలం` నటి, నిర్మాత అయిన ప్రవీణ పరుచూరి దర్శకురాలిగా మారి రూపొందించిన చిత్రమిది.
రానా దగ్గుబాటి కి చెందిన స్పిరిట్ మీడియా సమర్పణలో పరుచూరి విజయ ప్రవీణ ఆర్ట్స్ పతాకంపై గోపాలకృష్ణ పరుచూరి, ప్రవీణ పరుచూరి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం శుక్రవారం(జులై 18న) విడుదలవుతుంది. ముందుగా ప్రీమియర్స్ ప్రదర్శించారు. సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
`కొత్తపల్లిలో ఒకప్పుడు` మూవీ కథః
కొత్తపల్లి అనే గ్రామంలో 1997లో జరిగే కథ ఇది. ఈ గ్రామంలో అప్పన్న(రవీంద్ర విజయ్) ఊరి జనాలకు అప్పులిచ్చి వడ్డీల మీద వడ్డీలు కట్టించుకుంటాడు. జనాలను పీక్కుతుంటాడు. ఆయనకు రామకృష్ణ(మనోజ్ చంద్ర) సపోర్టింగ్‌గా ఉంటాడు. ఊరూర రికార్డింగ్ డాన్సులు వేయిస్తుంటాడు.
ఆ ఊరు జమీదారు రెడ్డిగారి(బెనర్జీ) మనవరారు సావిత్రి(మౌనిక)ని ఇష్టపడుతుంటాడు రామకృష్ణ. వీరిద్దరు చిన్నప్పట్నుంచి కలిసి చదువుకున్నారు. అప్పట్నుంచి ఆమె అంటే రామకృష్ణకి ఇష్టం. ఓసారి సావిత్రి చేత డాన్స్ చేయించాలని ప్లాన్ చేస్తారు.
అందుకు అందం లక్ష్మి(ఉషా) సహకారం తీసుకుంటారు. వీరిద్దరికి అందం మధ్యవర్తిగా వ్యవహరిస్తుంది. అందుకు బదులుగా తమకు అప్పన్నతో ఉన్న బాకీ మాఫి చేయిస్తానని ఒప్పుకుంటాడు రామకృష్ణ.
ఈ మధ్యవర్తిత్వం చేసే క్రమంలో అందం, రామకృష్ణలను గడ్డీవాము వద్ద అందం తండ్రి చూస్తాడు. ఉదయాన్నే రెడ్డిగారి వద్ద పంచాయితీ పెట్టిస్తాడు. ఆయన ఈ ఇద్దరికి పెళ్లి చేయాలని తీర్మాణం చెబుతాడు.
దానికి రామకృష్ణ ఒప్పుకోడు, కానీ అందం ప్లేట్ ఫిరాయించి రామకృష్ణని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతుంది. పెళ్లి జరుగుతుండగానే అప్పన్న వచ్చి పెళ్లి పీఠల మీద నుంచి రామకృష్ణని తీసుకెళ్లిపోతాడు. రామకృష్ణకి నేనున్నా అని, సావిత్రితోనే నీ పెళ్లి చేయిస్తా అని మాటిస్తాడు. కానీ ఆ క్షణంలోనే చనిపోతాడు.
రామకృష్ణ ఆశలన్నీ తలక్రిందులవుతాయి. దీంతో రామకృష్ణ వేసిన ప్లానేంటి? అప్పన్న మరణంతో ఊర్లో చోటు చేసుకున్న పరిణామాలేంటి? ఊర్లో అప్పన్న పేరుతో దేవాలయం వెలవడానికి కారణమేంటి?
సావిత్రితో రామకృష్ణ పెళ్లి జరిగిందా? అందాన్ని ఎలా వదిలించుకున్నాడు? సావిత్రి కోసం జమీందారు రామకృష్ణకి పెట్టిన కండీషన్ ఏంటి? చనిపోయిన అప్పన్న ఊరి తలరాతని ఎలా మార్చాడు? అనేది మిగిలిన కథ.
`కొత్తపల్లిలో ఒకప్పుడు` మూవీ విశ్లేషణః
విలేజ్ డ్రామా నేపథ్యంలో సాగే చిత్రమిది. `కేరాఫ్ కంచరపాలెం`, `బలగం`, `పరేషాన్` తరహాలో ఈ చిత్రం రన్ అవుతుంది. సినిమాని చాలా రియాలిటీకి దగ్గరగా, చాలా సహజంగా తెరకెక్కించారు. పాత్రలు, ఆ విలేజ్, ఆ మనుషుల ప్రవర్తన ఇలా ప్రతిదీ చాలా నేచురల్‌గా ఉంది.
అదే సినిమాకి పెద్ద ప్లస్‌గా చెప్పొచ్చు. దీంతో ప్రారంభం సీన్ నుంచి ఆడియెన్స్ ని కథలోకి తీసుకెళ్లారు. ప్రారంభంలో సరదాగా సాగుతుంది. హీరో, అతని ఫ్రెండ్స్ చేసే అల్లరి, అదే సమయంలో అప్పన్న పాత్ర అప్పులివ్వడం, వడ్డీలు, అసలు పేరుతో పీక్కుతినడం వంటివి కాస్త నేచురల్‌గా ఉన్నాయి.
ఆయా సీన్లు ఒకప్పటి రోజులను గుర్తు చేస్తాయి. అదే సమయంలో రామకృష్ణ పాత్రని మలిచిన తీరు కూడా అంతే బాగుంది. ఆయన చేసే అల్లరి పనులు, కొంటె చేష్టలు, కోతి వేషాలు నవ్విస్తాయి. అలరించేలా ఉంటాయి.
సావిత్రిని రికార్డింగ్ డాన్స్ లకు తీసుకెళ్లాలని చేసే ప్రయత్నాలు, అందుకు అందాన్ని మధ్యవర్తిగా ఉపయోగించుకోవడం, ఈ క్రమంలో చోటు చేసుకున్న సన్నివేశాలు కామెడీగా ఉంటాయి. వీరి కామెడీ ట్రాక్ హైలైట్‌గా నిలుస్తుంది.
ఫస్టాఫ్ వరకు సినిమా ఇలా సరదా సన్నివేశాలు, కొంత విలేజ్ డ్రామాతో రన్ అవుతుంది. మరోవైపు అప్పన్న ఓవరాక్షన్, రెడ్డిగారు తట్టుకోలేకపోవడం వీరిద్దరి మధ్య ఈగో క్లాష్‌లు ఆకట్టుకునేలా ఉంటాయి. అప్పన్న పాత్ర చనిపోయిన తర్వాత అసలు డ్రామా మొదలవుతుంది.
ఊర్లో అనేక విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. అవి కొన్ని ఫన్నీగా ఉంటే, మరికొన్ని సస్పెన్స్ తో ఉంటాయి. కొంత థ్రిల్లింగ్ అంశాలు, మరికొంత సస్పెన్స్ తో కూడిన హర్రర్ అంశాలు వస్తుంటాయి. ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది.
`కొత్తపల్లిలో ఒకప్పుడు` మూవీ విశ్లేషణః
సెకండాఫ్‌లో అప్పన్న పాత్ర చుట్టూ చోటు చేసుకున్న డ్రామా హైలైట్‌గా సాగుతుంది. అప్పన్న పేరుతో గుడి కట్టడం, జనాలు మొక్కు కోవడం, మొక్కులు తీరడం, అనుకున్నవి జరగడం అంతా వింతగా అనిపిస్తుంటుంది. ఎందుకు అలా జరుగుతున్నాయనేది అందరికి సస్పెన్స్.
అది రామకృష్ణకి పెద్ద మిస్టరీ. సావిత్రితో పెళ్లి కోసం తాను ఊరిని రిస్క్ లో పెట్టడం, అప్పన్న దేవుడితో చెలగాటం ఆడటం ఈ క్రమంలోని డ్రామా ఆద్యంతం రక్తికట్టేలా ఉంటుంది. క్లైమాక్స్ సీన్ మరింత రక్తికట్టింది. డ్రామా, దైవత్వం పీక్‌లోకి వెళ్తుంది.
ఇక చివరికి ఒక మిస్టరీతో కథని ముగించిన తీరు బాగానే ఉన్నా, ఏదో ఒక సస్పెన్స్ మాత్రం అలానే ఉండిపోయింది. అయితే సినిమా ఫస్టాఫ్ లో పెద్దగా కథ లేదు. అలాగే కొన్ని సీన్లు కూడా చాలా సిల్లీగా ఉంటాయి.
డ్రామా అంతగా వర్కౌట్ కాలేదు. అప్పన్న పాత్ర చనిపోయిన తర్వాత క్రియేట్ అయిన డ్రామాలో కూడా లాజిక్ లేదు. ఇక్కడ దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడనేది క్లారిటీ లేదు.
మరోవైపు ప్రేమలో డెప్త్ లేదు, అదే సమయంలో ప్రేమ కోసం ఆయన చేసే పనుల్లోనూ డెప్త్ లేదు. చివరికి ఊరి జనం, అప్పన్న దేవుడికి సంబంధించిన సీన్లలోనూ ఎమోషన్స్ ఆశించిన స్థాయిలో క్యారీ కాలేదు. కథపరంగా మరింత క్లారిటీ మెయింటేన్ చేయాల్సింది. ఎమోషన్స్ కి పెద్ద పీఠ వేస్తే ఇంకా బాగుండేది.
`కొత్తపల్లిలో ఒకప్పుడు` మూవీ నటీనటుల ప్రతిభ
రామకృష్ణ పాత్రలో మనోజ్ చంద్ర చాలా సహజంగా చేశాడు. అతని క్యారెక్టరైజేషన్, నటనే సినిమాకి పెద్ద అసెట్. తను అంతే సహజంగా చేసి మెప్పించాడు. అలరించాడు. హీరోయిజం అనేది కాకుండా ఆయన పాత్ర నడవడిక, సింప్లిసిటీ ఈ కథకి బాగా సూట్ అయ్యింది.
కథ రక్తికట్టేలా చేసింది. మనోజ్‌కి నటుడిగా మంచి భవిష్యత్ ఉందని చెప్పొచ్చు. సావిత్రి పాత్రలో మోనిక కూడా అంతే సహజంగా చేసింది.
కానీ చివర్లో ఆమె పాత్రని మరింత బాగా చూపించాల్సింది. ఇక అందం పాత్రలో ఉషా అదరగొట్టింది. కామెడీతో నవ్వులు పూయించింది. ఆమె పాత్ర సినిమాకి హైలైట్‌గా చెప్పొచ్చు. హీరోయిన్ పాత్రని డామినేట్ చేస్తుంది.
అప్పన్నగా రవీంద్ర విజయ్ కాసేపు అదరగొట్టాడు. ఆయన పాత్రని ఇంకా బాగా వాడుకోవాల్సింది. కానీ ఆయన పేరుని మాత్రం బాగా వాడుకున్నారు. రెడ్డి పాత్రలో బెనర్జీ బాగా సూట్ అయ్యాడు. అంతే బాగా చేశాడు. మిగిలిన పాత్రలు కూడా సహజంగా ఉన్నాయి.
`కొత్తపల్లిలో ఒకప్పుడు` మూవీ సాంకేతిక నిపుణుల పనితీరు
ఈ సినిమాకి మణిశర్మ అందించిన పాటలు బాగున్నాయి. హంట్ చేసేలా లేకపోయినా సినిమాలో ఆకట్టుకున్నాయి. మ్యూజిక్ అంతే నేచురల్‌గా ఉంది. వరుణ్ ఉన్ని బీజీఎం బాగుంది. సినిమాకి ప్లస్‌గా నిలిచింది.
పెట్రోస్ ఆంటోనియాడిస్ కెమెరా వర్క్ చాలా బాగుంది. విలేజ్ టోన్ నేచురల్‌గా ఉంది. విజువల్స్ బాగున్నాయి. ఎడిటర్ ఆర్ కిరణ్ బాగానే ఎడిటింగ్ చేశారు. ఇంకా క్లారిటీ మెయింటేన్ చేయాల్సింది.
దర్శకురాలు ప్రవీణ పరుచూరి ఎంచుకున్న విలేజ్ బ్యాక్ డ్రాప్ బాగుంది. కథ కూడా బాగుంది. దాన్ని తీర్చిదిద్దిన తీరు కూడా బాగుంది. కానీ స్క్రీన్ ప్లే లో క్లారిటీ మెయింటేన్ చేయాల్సింది. ఎమోషన్స్ పరంగా ఇంకా ఫోకస్ చేయాల్సింది.
అదే సమయంలో డ్రామా విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సింది. కానీ దర్శకురాలిగా తన తొలి ప్రయత్నం ఇంత బాగా ఉండటం అభినందనీయం. పాత్రలు, కథ ఎంపికతోనే ఆమె సక్సెస్ అయ్యిందని చెప్పొచ్చు.
ఫైనల్‌గా ః `కొత్తపల్లిలో ఒకప్పుడు` సరదాగా టైమ్‌పాస్‌కి చూడగలితే విలేజ్ డ్రామా.
రేటింగ్‌ః 2.75

