- Home
- Entertainment
- కట్టప్ప బాహుబలిని చంపకపోతే ? రూ.1000 కోట్ల కోసం నేనే అలా చేయనిచ్చేవాడిని, రానాకి ప్రభాస్ కౌంటర్
కట్టప్ప బాహుబలిని చంపకపోతే ? రూ.1000 కోట్ల కోసం నేనే అలా చేయనిచ్చేవాడిని, రానాకి ప్రభాస్ కౌంటర్
అమరేంద్ర బాహుబలి, భల్లాల దేవుడు మధ్య ఫన్నీగా మాటల యుద్ధం జరిగింది. బాహుబలిని కట్టప్ప చంపకపోతే నేనే చంపేవాడిని అని రానా చెప్పడం.. దానికి ప్రభాస్ రిప్లై ఇవ్వడం వైరల్ అవుతోంది.
- FB
- TW
- Linkdin
Follow Us

ఇండియాలో అతిపెద్ద బ్లాక్ బస్టర్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం బాహుబలి. ఈ చిత్రం తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వేదికలపై నిలబెట్టింది. బాహుబలి రెండు భాగాలుగా రూపొందింది. బాహుబలి 2 చిత్రం ఇండియన్ సినిమా చరిత్రలో అతిపెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
బాహుబలి ది ఎపిక్ రీ రిలీజ్
బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కంక్లూజన్ రెండు భాగాలని కలిపి బాహుబలి ది ఎపిక్ పేరుతో అక్టోబర్ 31న రీ రిలీజ్ చేస్తున్నారు. బాహుబలి చిత్రం విడుదలై పదేళ్లు పూర్తయిన సందర్భంగా రీ రిలీజ్ కి సన్నాహకాలు చేస్తున్నారు. దీనితో ఆ హంగామా మొదలైంది. ఈ సందర్భంగా ప్రభాస్, రానా మధ్య సోషల్ మీడియాలో ఫన్నీ వార్ జరిగింది.
కట్టప్ప బాహుబలిని చంపకపోతే..
కట్టప్ప బాహుబలిని చంపకపోతే ఏం జరిగేది అని బాహుబలి టీమ్ ప్రశ్న సంధించింది. దీనికి రానా బదులిస్తూ నేనే చంపేవాడిని అని కామెంట్ పెట్టాడు. రానాకి ప్రభాస్ ఇచ్చిన ఫన్నీ కౌంటర్ నవ్వులు పూయిస్తోంది. బాహుబలి 2 చిత్రం 1000 కోట్ల వసూళ్లు సాధించిన పోస్టర్ షేర్ చేస్తూ.. దీని కోసం నేనే అలా చేయనిచ్చేవాడినిలే భల్లా అని ప్రభాస్ కామెంట్ పెట్టారు.
బాహుబలి 3 కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
ఈ పోస్ట్ కి నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. బాహుబలి ది ఎపిక్ రీ రిలీజ్ లో బాహుబలి 3కి సంబంధించిన అనౌన్స్మెంట్ ఉండాలి అని కామెంట్స్ చేస్తున్నారు. బాహుబలి 1 చిత్రం 2015 జూలై 10న రిలీజ్ అయింది. బాహుబలి 2 మూవీ 2017 ఏప్రిల్ 28న రిలీజ్ అయింది. బాహుబలి చిత్రంలో కట్టప్ప అమరేంద్ర బాహుబలిని ఎందుకు చంపాలి అనే సన్నివేశాలపై పెద్ద కసరత్తు జరిగిందట.
బాహుబలిని చంపే సీన్స్ కోసం రాజమౌళి కష్టం
అమరేంద్ర బాహుబలిని చంపాలని శివగామి నిర్ణయించుకునే సన్నివేశాలు ముందుగా వేరుగా ఉండేవట. రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్ ఆ సన్నివేశాలని చిత్రీకరించాలని డిసైడ్ అయ్యారు. కానీ అమరేంద్ర బాహుబలిని చంపాలి అని శివగామి డిసైడ్ అయ్యే సన్నివేశాలలో సరైన కారణం, బలం లేదని కీరవాణి, రమా రాజమౌళి, ఇతర చిత్ర యూనిట్ వ్యతిరేకించారట. దీనితో విజయేంద్ర ప్రసాద్ ఆ సన్నివేశాలని మళ్ళీ మార్చి రాశారు. రెండవసారి రాసిన వెర్షన్ ని రాజమౌళి చిత్రీకరించారు.