- Home
- Entertainment
- స్టార్ హీరోల తొలి చిత్రాల హీరోయిన్లు ఎవరు, ఇప్పుడేం చేస్తున్నారు.. విషాదంగా ముగిసిన బాలయ్య హీరోయిన్ లైఫ్
స్టార్ హీరోల తొలి చిత్రాల హీరోయిన్లు ఎవరు, ఇప్పుడేం చేస్తున్నారు.. విషాదంగా ముగిసిన బాలయ్య హీరోయిన్ లైఫ్
చిరంజీవి,బాలకృష్ణ, నాగార్జున లాంటి అగ్ర హీరోలు నటించిన తొలి చిత్రాలు, అందులో నటించిన హీరోయిన్ల వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి. బాలయ్య తొలి చిత్ర హీరోయిన్ జీవితం విషాదంగా ముగిసింది అని తెలుసా ?
- FB
- TW
- Linkdin
Follow Us

స్టార్ హీరోల తొలి చిత్రాలు
స్టార్ హీరోల తొలి చిత్రాలు వాళ్ళకి ఒక తీపి జ్ఞాపకంలా మిగిలిపోతాయి. తమ తొలి చిత్రాల్లో నటించిన హీరోయిన్లని హీరోలు జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు. చిరంజీవి, వెంకటేష్, బాలయ్య లాంటి అగ్ర హీరోలు నటించిన తొలి చిత్రాలు, అందులో నటించిన హీరోయిన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
చిరంజీవి - ప్రాణం ఖరీదు
చిరంజీవి నటించిన తొలి చిత్రం ప్రాణం ఖరీదు. ఈ మూవీలో హీరోయిన్ గా రేష్మ రాయ్ నటించారు. అయితే రేష్మ రాయ్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్, ఇతర విషయాలు బయటకి రాలేదు.
బాలకృష్ణ - సాహసమే జీవితం
బాలకృష్ణ సోలో హీరోగా నటించిన తొలి చిత్రం సాహసమే జీవితం. ఈ మూవీలో విజ్జి హీరోయిన్ గా నటించారు. ఆమె తమిళ చిత్రాల్లో ఎక్కువగా నటించారు. ఆమె జీవితం విషాదాంతంగా ముగిసింది. 34 ఏళ్ళ చిన్న వయసులోనే విజ్జి మరణించారు. ఆమె మరణానికి కారణం ప్రేమ వైఫల్యమే అని అప్పట్లో ప్రచారం జరిగింది.
వెంకటేష్ - కలియుగ పాండవులు
వెంకటేష్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన తొలి చిత్రం కలియుగ పాండవులు. ఈ చిత్రంలో ఖుష్బూ హీరోయిన్ గా నటించారు. ఖుష్బూకి కూడా ఇదే తొలి చిత్రం. ఆ తర్వాత ఖుష్బూ సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. ఆమె డైరెక్టర్ సుందర్ సి ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అవకాశం వచ్చినప్పుడు నటిస్తూ ఆమె రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు.
నాగార్జున - విక్రమ్
అక్కినేని నాగార్జున హీరోగా నటించిన తొలి చిత్రం విక్రమ్. 1986లో విడుదలైన ఈ చిత్రంలో నాగార్జున సరసన నటి శోభన నటించారు. ఆమె అద్భుతమైన క్లాసికల్ డ్యాన్సర్. కానీ 55 ఏళ్ళ వయసు వచ్చినప్పటికీ ఆమె వివాహం చేసుకోలేదు.
మహేష్ బాబు - రాజకుమారుడు
మహేష్ బాబు హీరోగా నటించిన తొలి చిత్రం రాజకుమారుడు. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఈ మూవీలో ప్రీతి జింతా హీరోయిన్. ప్రీతీ జింతా వెంకటేష్ సరసన ప్రేమంటే ఇదేరా చిత్రంలో కూడా నటించింది. ప్రస్తుతం ఆమె ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ జట్టుకి కో ఓనర్ గా ఉన్నారు.
పవన్ కళ్యాణ్ - అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి
పవన్ కళ్యాణ్ హీరోగాఅక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీలో హీరోయిన్ గా అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు సుప్రియ యార్లగడ్డ నటించారు. ఆ తర్వాత మళ్ళీ సుప్రియ హీరోయిన్ గా నటించలేదు. గూఢచారి చిత్రంలో కీలక పాత్రలో నటించారు. నిర్మాతగా కూడా రాణించారు.
ప్రభాస్ - ఈశ్వర్
ప్రభాస్ తొలి చిత్రం ఈశ్వర్. ఈ చిత్రంలో సీనియర్ నటుడు విజయ్ కుమార్ కుమార్తె శ్రీదేవి విజయ్ కుమార్ హీరోయిన్ గా నటించారు. తరుణ్ తో ఆమె నిన్నే ఇష్టపడ్డాను చిత్రంలో కూడా నటించారు. వివాహం తర్వాత ఆమె సినిమాలు తగ్గించారు.
జూ.ఎన్టీఆర్ - నిన్ను చూడాలని
జూనియర్ ఎన్టీఆర్ నటించిన తొలి చిత్రం నిన్ను చూడాలని. ఈ చిత్రంలో రవీనా రాజ్ పుత్ హీరోయిన్ గా నటించారు. ఈ చిత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. దీనితో రవీనాకి అవకాశాలు రాలేదు. ఈ మూవీ తర్వాత రవీనా చిత్ర పరిశ్రమకి దూరమయ్యారు.
రాంచరణ్ - చిరుత
రాంచరణ్ తొలి చిత్రం చిరుత. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది. నేహా శెట్టి కూడా ఎక్కువ కాలం నటిగా రాణించలేకపోయింది. ప్రస్తుతం ఆమె సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంది.
అల్లు అర్జున్ - గంగోత్రి
అల్లు అర్జున్ గంగోత్రి చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ఆర్తి అగర్వాల్ సోదరి అదితి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో నటించిన ఆమె చిత్ర పరిశ్రమకి దూరమయ్యారు.