MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • Movie Reviews
  • `ఘటికాచలం` మూవీ రివ్యూ, రేటింగ్‌.. ఈ హర్రర్‌ థ్రిల్లర్‌ భయపెట్టిందా?

`ఘటికాచలం` మూవీ రివ్యూ, రేటింగ్‌.. ఈ హర్రర్‌ థ్రిల్లర్‌ భయపెట్టిందా?

బాలనటుడిగా పలు చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్‌ దేవాదుల ఇప్పుడు హీరోగా `ఘటికాచలం` అనే చిత్రంలో నటించాడు. హర్రర్‌ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ మూవీ ఆడియెన్స్ ని ఆకట్టుకుందా అనేది రివ్యూలో తెలుసుకుందాం.

4 Min read
Author : Aithagoni Raju
Published : May 31 2025, 08:57 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
`ఘటికాచలం` మూవీ రివ్యూ
Image Credit : Asianet News

`ఘటికాచలం` మూవీ రివ్యూ

చైల్డ్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చకున్న నిఖిల్ దేవాదుల హీరోగా మారి నటించిన మూవీ `ఘటికాచలం`. ఈ సినిమాకి కథని అందిస్తూ, ఒయాసిస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై ఎం సి రాజు నిర్మించారు. అమర్‌ కామెపల్లి దర్శకత్వం వహించారు.

 ఇందులో ప్రభాకర్‌, ఆర్వికా గుప్తా, దుర్గాదేవి ముఖ్య పాత్రల్లో నటించగా, సంయుక్త రెడ్డి హీరోయిన్‌గా నటించింది. మాస్‌ మూవీ మేకర్స్ పై ఈ మూవీని నిర్మాత ఎస్‌కేఎన్‌ విడుదల చేయడం విశేషం. ఈచిత్రం నేడు శనివారం(మే 31న)న విడుదలైంది. హర్రర్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీ ఆకట్టుకునేలా ఉందా? ఆడియెన్స్ ని భయపెట్టిందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
`ఘటికాచలం` సినిమా కథేంటంటే ?
Image Credit : X/movie production

`ఘటికాచలం` సినిమా కథేంటంటే ?

బాలా(నిఖిల్‌ దేవాదుల) మెడిసిన్‌ చదువుతుంటాడు. తను భయస్తుడు, పిరికివాడు. తన ఫీలింగ్స్ ని బయటికి చెప్పలేడు. తనకు ఈ ఫుడ్‌ కావాలి, తాను ఈ కోర్స్ చేస్తాను, తాను ఈ బట్టలు వేసుకుంటానని కూడా చెప్పలేని స్థితిలో ఉంటాడు. తనకు తానే లోలోపల కుమిలిపోతుంటాడు. మదనపడుతుంటాడు

ఈ క్రమంలో ఇంట్లోనూ స్వేచ్ఛగా ఉండలేడు, మరోవైపు కాలేజీలో ఫ్రెండ్స్ కూడా ఎగతాళి చేస్తుంటారు. దీని కారణంగా మానసికంగా డిస్టర్బ్ అవుతుంటాడు. కాలేజీలో తనతో ఫ్రీగా ఉండే తన క్లాస్‌మేట్‌ (సంయుక్త రెడ్డి)ని ప్రేమిస్తాడు. కానీ ఆమె వేరే అబ్బాయితో లవ్‌లో ఉంటుంది. ఇది చూసి బాలా తట్టుకోలేకపోతాడు. 

రాను రాను బాలాలో మానసికమైన మార్పులు చాలా వస్తాయి. ఏవేవో బయట నుంచి శబ్దాలు వినిపిస్తుంటాయి. ఒక దెయ్యం ఆయన్ని వెంటాడుతుంది. చదువుకోనివ్వదు, రెబల్‌గా మారమంటుంది, తనకు నచ్చిన విషయాలు బయటకు చెప్పాలని ఫోర్స్ చేస్తుంటుంది. పేరెంట్స్ ని కూడా ఎదురించమని చెబుతుంది. కొన్ని సార్లు ఏదో ట్రాన్స్ లోకి తీసుకెళ్లిపోతుంది. 

కొడుకులోని ఈ పరిస్థితిని చూసి పరశురామ్‌(ప్రభాకర్‌) డాక్టర్‌కి చూపిస్తాడు. ఆయన ఒక సైకలాజికల్‌ సమస్యతో బాధపడుతున్నాడని డాక్టర్‌ చెబుతుంది. కానీ బాలాకి గాలి సోకిందని బాబాలు, మంత్రాలు చేసేవారి వద్దకు తీసుకెళ్తారు పేరెంట్స్. ఆ సమయంలోనే బాలాని ఆవహించింది కుందనబాగ్‌ ఘటికాచలం అని తెలుస్తుంది. 

బాలానీ తనతో తీసుకెళ్తానని, ఈ ప్రపంచంలో మనం ఉండలేమని చెబుతుంది? మరి ఆ ఘటికాచలం ఎవరు? బాలాని ఎందుకు ఆవహించాడు? బాలా ఇలా మారిపోవడానికి కారణాలేంటి? దాన్నుంచి ఎలా బయటపడ్డాడు? అనేది మిగిలిన కథ.

36
`ఘటికాచలం` మూవీ విశ్లేషణ
Image Credit : X/movie production

`ఘటికాచలం` మూవీ విశ్లేషణ

హర్రర్‌ సినిమాలకు ఇటీవల కొంత గ్యాప్‌ వచ్చింది. చాలా రోజుల తర్వాత ఇప్పుడు `ఘటికాచలం` అనే మూవీ ఆడియెన్స్ ముందుకు వచ్చింది. హర్రర్‌ చిత్రాల్లో ఇదొక డిఫరెంట్‌ కాన్సెప్ట్ తో రూపొందించిన మూవీ. అంతేకాదు యదార్థ సంఘటనలను ఆధారంగా చేసుకుని ఈ సినిమాని రూపొందించారు. 

నిర్మాతనే స్వయంగా తాను చూసిన సంఘటనని ఈ కథగా రాసుకున్నారు. అయితే ఈ సినిమా ద్వారా వినోదం అందించడం, భయపెట్టించడం మాత్రమే కాదు, మంచి సందేశాన్ని కూడా అందించే ప్రయత్నం చేశారు. ఆ విషయంలో అభినందించాల్సిందే. 

ప్రస్తుతం పోటీ ప్రపంచంలో పేరెంట్స్ జాబ్‌లతో బిజీగా ఉంటున్నారు, పిల్లలను స్కూల్స్, ట్యూషన్ల పేరుతో ఒత్తిడికి గురి చేస్తున్నారు. పిల్లలతో పేరెంట్స్ ఫ్రీగా మాట్లాడలేని పరిస్థితి. అదే సమయంలో చాలా మంది పేరెంట్స్ తమ పిల్లలకు ఏది కావాలో, వాళ్లు ఏది ఇష్టపడుతున్నారో తెలుసుకోలేకపోతున్నారు. 

ఆ విషయాలు చెప్పలేక పిల్లలు మానసికంగా కుంగిపోతున్నారు. ఆ తర్వాత పరిణామాలకు ప్రతిబింబమే ఈ `ఘటికాచలం`. దాన్ని అంతే ఎంటర్‌టైనింగ్‌గా, అంతే హర్రర్‌ ఎలిమెంట్లతో చూపించారు. దాని ఫలితాలు ఎలా ఉంటాయో కళ్లకి కట్టినట్టు ఈ మూవీలో చూపించే ప్రయత్నం చేశారు మేకర్స్.

46
`ఘటికాచలం` సినిమాలోని ప్లస్‌లు, మైనస్‌లు
Image Credit : X/movie production

`ఘటికాచలం` సినిమాలోని ప్లస్‌లు, మైనస్‌లు

సినిమాగా చూసినప్పుడు ప్రారంభంలో చాలా వరకు హీరో పాత్రని ఎస్టాబ్లిష్‌ చేయడానికి టైమ్‌ తీసుకున్నారు. ఎలాంటి పరిస్థితుల్లో తాను మానసికమైన సమస్యకు గురవుతున్నాడనేది డిటెయిలింగ్‌గా చెప్పారు.  

హీరోకి పలు విచిత్రమైన సౌండ్స్ వినిపించడం, ఆ తర్వాత ఘటికాచలం తనని ఆవహించడం వంటి సన్నివేశాలు ఆద్యంతం భయపెట్టేలా ఉన్నాయి. అదే సమయంలో నవ్వుకునేలా ఉన్నాయి. 

ఘటికాచలం అనే ఆత్మ బాలాని చేరుతున్నప్పుడు వచ్చే సన్నివేశాలు ఆద్యంతం ఉత్కంఠకి గురి చేస్తాయి. మరింతగా భయపెడుతుంటాయి. ఆ సౌండ్‌ వినిపించే తీరుని ఆడియెన్స్ బాగా ఎంజాయ్‌ చేస్తారు. సెకండాఫ్‌లో ఘటికాచలం దెయ్యం ఎంట్రీతో సినిమా మరింతగా రక్తికడుతుంది. నెక్ట్స్ ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంటుంది. 

హర్రర్‌ ఎలిమెంట్లు అంటే కేవలం భయపెట్టడమే కాదు, దాన్ని కూడా కామెడీగా చూపించిన తీరు బాగుంది. క్లైమాక్స్ మరింత ఉత్కంఠభరితంగా మారుతుంది. బాలా పాత్రలోని సస్పెన్స్, ఘటికాచలం దెయ్యానికి సంబంధించిన గతం బయటపడిన సన్నివేశాలు ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. 

అయితే సినిమా పాయింట్‌ చాలా చిన్నది. దాన్ని బాగా లాగినట్టుగా అనిపిస్తుంది. ఎంతసేపు కథ అక్కడక్కడే తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. అదే సమయంలో క్లైమాక్స్ లో చాలా లాజిక్స్ మిస్‌ అయ్యాయి. ఘటికాచలం, బాలాని ఆవహించడం వెనుక లాజిక్ కన్విన్సింగ్‌గా అనిపించలేదు. కామెడీ ఎలిమెంట్లు, హర్రర్‌ ఎలిమెంట్లు ఇంకా బాగా చూపించాల్సింది. కొన్ని మైనస్‌లు పక్కన పెడితే పేరెంట్స్ కి ఇదొక మంచి సందేశాన్ని అందించే మూవీ అవుతుందని చెప్పొచ్చు.

56
`ఘటికాచలం` మూవీలో నటీనటులు ఎలా చేశారంటే?
Image Credit : X/movie production

`ఘటికాచలం` మూవీలో నటీనటులు ఎలా చేశారంటే?

బాలా పాత్రలో నిఖిల్‌ దేవాదుల బాగా చేశాడు. ఇంకా చెప్పాలంటే అదరగొట్టాడు. ఇంత చిన్న వయసులోనే ఇలాంటి సంఘర్షణతో కూడిన పాత్రలో నటించడం, ఇంటెన్సిటీ ఉన్న పాత్ర చేయడం మామూలు విషయం కాదు. అందులోనూ అనేక వేరియేషన్స్ ఉన్న పాత్ర. నిఖిల్‌ మాత్రం ఈ పాత్రలో రెచ్చిపోయి చేశాడు.

 పాజిటివ్‌తోపాటు నెగటివ్‌ షేడ్స్ లోనూ అదరగొట్టాడు. నటుడిగా అతనికి మంచి ఫ్యూచర్‌ ఉంటుంది. బాలా తండ్రిగా ప్రభాకర్‌ సైతం బాగా చేశాడు. తనకు బాగా సూట్‌ అయ్యే పాత్ర, ఆయన కూడా పాత్రలో లీనమై చేశారు. 

హీరో తల్లిగా దుర్గాదేవి ఉన్నంతలో బాగా చేసింది. డాక్టర్‌గా ఆర్వికా గుప్తా కనిపించేది తక్కువ సమయమే అయినా మంచి బలమైన పాత్ర దక్కింది. ఇక హీరోయిన్‌గా సంయుక్త రెడ్డి ఓకే అనిపించింది. జోగినాయుడు ఉన్నంత సేపు అదరగొట్టాడు. మిగిలిన పాత్రలు ఓకే అనిపించాయి.

66
`ఘటికాచలం` మూవీ టెక్నిషియన్ల పనితీరు
Image Credit : X/movie production

`ఘటికాచలం` మూవీ టెక్నిషియన్ల పనితీరు

టెక్నీకల్‌గా సినిమా బాగుంది. ఎస్‌ ఎస్‌ మనోజ్‌ కెమెరా వర్క్ చాలా బాగుంది. విజువల్స్ ఆకట్టుకుంటాయి. శ్రీనివాస్‌ బైనబోయిన ఎడిటింగ్‌ ఫర్వాలేదు. ప్లేవియో కుకురోలో మ్యూజిక్‌ సినిమాకి స్పెషల్‌ ఎట్రాక్షన్‌. బీజీఎం చాలా బాగుంది. హర్రర్‌ ఎలిమెంట్లకి సౌండ్ అదిరిపోయింది. 

దర్శకుడు అమర్ కామెపల్లి ఎంచుకున్న కథ బాగుంది. దాన్ని అంతే సహజంగా, సందేశాత్మకంగా తెరకెక్కించిన తీరు ఆకట్టుకుంది. అయితే స్క్రీన్‌ప్లేలో మరికొంత మ్యాజిక్ చేయాల్సింది. హర్రర్‌ ఎలిమెంట్లు, అందులోనే ఫన్నీ ఎలిమెంట్లని మరింత బాగా డిజైన్‌ చేయాల్సింది. 

దీనికితోడు ముందు నుంచే కథ ఊహించేలా ఉంది. ఆ విషయంలో కాస్త జాగ్రత్త తీసుకుంటే బాగుండేది. నిర్మాణ విలువలకు కొదవ లేదు. రైటరే నిర్మాత కావడంతో, తన కథకు ఏం కావాలో అది అందించారు.

ఫైనల్‌గాః నేటి పోటీ ప్రపంచంలో పేరెంట్స్, పిల్లలు చూడాల్సిన మూవీ. పిల్లలను నిర్లక్ష్యం చేస్తే ఎంత ప్రమాదకరమో కళ్లకి కట్టినట్టు ఆవిష్కరించిన మూవీ `ఘటికాచలం`.

రేటింగ్‌ః 2.75

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
సినిమా సమీక్షలు
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
The Paradise Review: నాని జాతకం మారబోతోందా? స్టార్ హీరోల లిస్ట్ లో చేరినట్టేనా? ది పారడైజ్ మూవీ ఫస్ట్ రివ్యూ..
Recommended image2
Hitler Movie Review: మోహన్ బాబు వల్ల డిజాస్టర్స్ నుంచి బయటపడ్డ చిరంజీవి, డైరెక్టర్ ను భయపెట్టిన మెగా ఫ్యాన్స్.. హిట్లర్ మూవీ రివ్యూ
Recommended image3
Pithapuramlo Ala Modalaindi Review: పిఠాపురంలో అలా మొదలైంది మూవీ రివ్యూ.. కూతురిని ఎలా పెంచాలంటే?
Related Stories
Recommended image1
`షష్టిపూర్తి` మూవీ రివ్యూ, రేటింగ్‌.. రాజేంద్రప్రసాద్‌, ఇళయరాజా పని చేసిన మూవీ సక్సెస్‌ అయ్యిందా?
Recommended image2
`భైరవం` మూవీ రివ్యూ, రేటింగ్‌.. మంచు మనోజ్‌, నారా రోహిత్‌, బెల్లంకొండ శ్రీనివాస్‌ హిట్‌ కొట్టారా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved