Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • Movie Reviews
  • `భైరవం` మూవీ రివ్యూ, రేటింగ్‌.. మంచు మనోజ్‌, నారా రోహిత్‌, బెల్లంకొండ శ్రీనివాస్‌ హిట్‌ కొట్టారా?

`భైరవం` మూవీ రివ్యూ, రేటింగ్‌.. మంచు మనోజ్‌, నారా రోహిత్‌, బెల్లంకొండ శ్రీనివాస్‌ హిట్‌ కొట్టారా?

మంచు మనోజ్‌, నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ కలిసి నటించిన లేటెస్ట్ మూవీ `భైరవం`. ఈ చిత్రం నేడు శుక్రవారం(మే 30)న విడుదలైంది. సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.

Aithagoni Raju | Published : May 30 2025, 12:53 PM
5 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
`భైరవం` మూవీ రివ్యూ
Image Credit : x/movie production

`భైరవం` మూవీ రివ్యూ

మంచు మనోజ్‌ చాలా ఏళ్ల గ్యాప్‌ తర్వాత `భైరవం` మూవీతో కమ్‌ బాక్‌ అవుతున్నారు. ఇటీవల `ప్రతినిధి 2`తో ఆడియెన్స్ ముందుకు వచ్చిన నారా రోహిత్‌ హిట్‌ కోసం `భైరవం` మూవీలో నటించారు. ఇక వరుస ఫెయిల్యూర్స్ లో ఉన్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ ఈ చిత్రంతో హిట్ కొట్టాలనే కసితో ఉన్నారు. 

ఈ ముగ్గురు కలిసి చేసిన `భైరవం` మూవీ నేడు శుక్రవారం(మే 30న) విడుదలైంది. విజయ్‌ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కెకె రాధామోహన్‌ నిర్మించారు. పెన్‌ స్టూడియోస్‌ పతాకంపై డాక్టర్‌ జయంతిలాల్‌ గడా సమర్పిస్తున్నారు. 

అదితి శంకర్‌, ఆనంది, దివ్య పిళ్లై హీరోయిన్లుగా నటించారు. మరి నేడు విడుదలైన ఈ చిత్రం ఆడియెన్స్ ని ఆకట్టుకుందా?, ముగ్గురు హీరోలకు హిట్‌ ఇచ్చిందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.

26
`భైరవం` మూవీ కథ ఏంటంటే?
Image Credit : x/movie production

`భైరవం` మూవీ కథ ఏంటంటే?

దేవిపురం అనే విలేజ్‌లో వరధ(నారా రోహిత్‌), గజపతి(మంచు మనోజ్‌) మంచి స్నేహితులు. వీరిద్దరు ఊరి పెద్దలుగానూ ఉంటారు. వీరికి నమ్మిన బంటు శీను(బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌). గజపతి నానమ్మ నాగరత్నమ్మ(జయసుధ) ఊరి అమ్మవారి టెంపుల్‌కి ధర్మకర్తగా వ్యవహరిస్తుంది. 

అయితే దేవాదాయశాఖ మంత్రి(శరత్‌) కన్ను ఈ టెంపుల్‌ భూములపై పడుతుంది. దేవాలయ భూములు కొట్టేయడానికి ఎస్పీ(సంపత్‌రాజ్‌) సాయం కోరతాడు. అదే సమయంలో ఆ టెంపుల్‌ భూములకు సంబంధించిన పత్రాలు బ్యాంక్‌ లాకర్‌లో ఉంటాయి. అవి తెరవడం ధర్మకర్తకే సాధ్యం. 

నాగ రత్నమ్మ ఒప్పుకోదు అని చెప్పి ఆమెని చంపేస్తారు. దీంతో మంత్రి తన బావమరిది నాగరాజు(అజయ్‌) ధర్మకర్తగా పోటీకి దించుతాడు. ఆయనకు పోటీగా శ్రీనుని నిలబెట్టి గెలిపిస్తారు వరధ, గజపతి. దీంతో మంత్రి ప్లాన్‌ బెడిసికొడుతుంది. ఇలా కాదు అని గజపతితో డీల్‌ సెట్‌ చేస్తాడు మంత్రి. 

మొదట నో చెప్పిన గజపతి ఆ తర్వాత ఇంట్లో భార్య నీలిమ(ఆనంది) ఒత్తిడి మేరకు ఓకే చెబుతాడు. దేవాలయ భూమి పత్రాలను కొట్టేయాలని ప్లాన్‌ చేస్తారు. కానీ వరధకి ఈ విషయం తెలుస్తుంది. దీంతో ప్లాన్‌ ఆపేస్తారు. కానీ అమ్మవారి పండుగ రోజు వరధాని చంపేయాలని మంత్రి కుట్ర పన్నుతాడు. 

ఈ విషయం తెలియడంతో గజపతి ఆ కుట్రని అడ్డుకుంటారు. ఆ తర్వాత మంత్రి పుట్టిన రోజున.. అటు వరధ, ఇటు గజపతి మంత్రి వద్దకు వెళ్లి విషెస్‌ చెబుతారు. ఆ సమయంలో వీరిద్దరితో డీల్‌ మాట్లాడతాడు మంత్రి. కానీ వరధ తిరస్కరిస్తాడు` దీంతో గజపతి కూడా మంత్రికి వార్నింగ్‌ ఇచ్చి వస్తాడు.

ఆ తర్వాత గజపతిలో వచ్చిన మార్పేంటి? చిన్నప్పట్నుంచి స్నేహంగా ఉన్న వరధ, గజపతి ఎందుకు విడిపోయారు? గజపతి చేసిన కుట్ర ఏంటి? ఇందులో శీను పాత్ర ఏంటి? ఇంతకి మంత్రికి దేవుడి భూములు దక్కాయా? గజపతి కోరిక నెరవేరిందా? చివర్లో శీను ఇచ్చిన ట్విస్ట్ ఏంటి? ఇందులో అదితి శంకర్‌, దివ్మ పిళ్లైల పాత్ర ఏంటి? అనేది మిగిలిన కథ.

Related Articles

ఫ్యామిలీ మెంబర్సే పతనాన్ని కోరుకుంటున్నారు.. అయినా మనోజ్‌ `భైరవం` సినిమా ఆడాలని కోరుకున్న మంచు విష్ణు
ఫ్యామిలీ మెంబర్సే పతనాన్ని కోరుకుంటున్నారు.. అయినా మనోజ్‌ `భైరవం` సినిమా ఆడాలని కోరుకున్న మంచు విష్ణు
గద్దర్ అవార్డు పై స్పందించిన అల్లు అర్జున్, వారికి అంకితం చేసిన ఐకాన్ స్టార్
గద్దర్ అవార్డు పై స్పందించిన అల్లు అర్జున్, వారికి అంకితం చేసిన ఐకాన్ స్టార్
36
`భైరవం` మూవీ విశ్లేషణ
Image Credit : x/movie production

`భైరవం` మూవీ విశ్లేషణ

`భైరవం` మూవీ తమిళంలో వచ్చిన `గరుడన్‌` చిత్రానికి రీమేక్‌. ఆ చిత్రం అక్కడి నేపథ్యానికి తగ్గట్టుగా రా అండ్‌ రస్టిక్‌గా తెరకెక్కించారు. కానీ తెలుగులో దీనికి కాస్త కమర్షియల్‌ హంగులు జోడించారు. తెలుగులో మాస్‌ ఎలిమెంట్లు, హీరోల ఎలివేషన్లకి ప్రయారిటీ ఇచ్చారు. 

అయితే ఇటీవల కాలంలో మాస్‌, యాక్షన్‌ చిత్రాలు బాగా ఆదరణ పొందుతున్నాయి. దీంతో ఈ మూవీకి కూడా ఆయా అంశాలను బాగా దట్టించారు. ఆ విషయంలో దర్శకుడు మన తెలుగు ఆడియెన్స్ టేస్ట్ ని ఫాలో అయ్యాడని చెప్పొచ్చు. ఇక సినిమాగా చూసినప్పుడు మొదటి భాగంలో నారా రోహిత్‌, మంచు మనోజ్‌, బెల్లంకొండ ఎంత మంచి స్నేహితులో చూపించారు. 

ఒకరి కోసం ఒకరు ప్రాణం ఇవ్వడానికైనా రెడీ. ఇలా స్నేహం విలువని, ఆ బాండింగ్‌ని చూపించి సినిమాపై ఆసక్తిని క్రియేట్‌ చేశారు. అదే సమయంలో ఆ దేవుడి భూములపై మంత్రి కన్ను, ఆయన వర్గం చేసే కుట్రలను ఓ వైపు ఆవిష్కరించారు. 

మంత్రి చేసిన ప్లాన్‌ ఆ ఊరులో, స్నేహితుల మధ్య పెట్టిన చిచ్చుని ఎస్టాబ్లిస్‌ చేస్తూ వచ్చారు. దీంతో సినిమా ఆద్యంతం రక్తికట్టేలా సాగింది. మధ్యలో బెల్లంకొండ, అదితిల మధ్య లవ్‌ ట్రాక్‌, అలాగే వెన్నెల కిశోర్‌ కామెడీ కాస్త సీరియస్‌ యాంగిల్‌ నుంచి రిలీఫ్‌నిస్తుంది. 

అయితే మొదటి భాగం చాలా వరకు హీరోల ఎలివేషన్లకే ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చారు. అనవసరమైన చోట్ల కూడా అవి పెట్టడం అంతగా నప్పలేదు. మరోవైపు స్నేహం, ఎమోషనల్‌ సీన్లు, సెంటిమెంట్లకు సంబంధించిన సీన్లు కూడా డోస్‌ తగ్గినట్టుగా అనిపిస్తుంది.

46
`భైరవం` మూవీ హైలెట్స్, మైనస్‌లు
Image Credit : x/movie production

`భైరవం` మూవీ హైలెట్స్, మైనస్‌లు

ఇంటర్వెట్‌లో వచ్చే ట్విస్ట్ ఉత్కంఠకి గురిచేస్తుంది. ముఖ్యంగా అమ్మవారి పండుగలో వచ్చే యాక్షన్‌ సీన్‌లోని ట్విస్ట్ అదిరిపోయింది. ఆ సమయంలో బెల్లంకొండలోని మరో కోణం కనిపిస్తుంది. ప్రారంభం నుంచి నారా రోహిత్‌, మంచు మనోజ్‌ పాత్రలను ఎక్కడా తగ్గకుండా చూపించిన తీరు బాగుంది. 

ఇక సెకండాఫ్‌లో అసలు కథ స్టార్ట్ అవుతుంది. మంచు మనోజ్‌ పాత్రలో వచ్చిన మార్పు అసలైన కురుక్షేత్రాన్ని తలపిస్తుంది. స్నేహం కంటే డబ్బు, పరువు, మర్యాదలే ఎక్కువ అనేది రక్తికట్టిస్తుంది. సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. మనోజ్‌ పాత్రలోని మార్పు సినిమా కథనే మార్చేస్తుంది. 

ఆయా సన్నివేశాలను ఆద్యంతం ఉత్కంఠభరితంగా, ఆద్యంతం నాటకీయంగా తెరకెక్కించారు దర్శకుడు. ఇక క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ లు సైతం అదిరిపోయాయి. బెల్లంకొండ శ్రీనివాస్‌ యాక్షన్‌ సీన్స్ ఒక `కాంతార`, `పుష్ప 2` క్లైమాక్స్‌ లను తలపిస్తాయి. అయితే సినిమాలో డ్రామా ఆశించినస్థాయిలో పండలేదు. 

దీనికితోడు హీరోల మధ్య స్నేహాన్ని బలంగా ఎస్టాబ్లిష్‌ చేయలేదు. ఎమోషనల్‌ సీన్లని లైటర్‌వేలోనే చూపించినట్టుగా ఉంటుంది. కథ కూడా రొటీన్‌గానే అనిపిస్తుంది.

 దీంతో ఇది రెగ్యూలర్‌ కమర్షియల్‌ మూవీని తలపిస్తుంది. ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సినిమా ఇంకా బాగుండేది. ఆడదాని వల్ల యుద్ధాలే జరిగాయి, రాజ్యాలే కూలిపోయాయంటారు. ఈ సినిమా కథ అదే ప్రతిబింబిస్తుంది.

56
`భైరవం` మూవీ  నటీనటుల ప్రదర్శన ఎలా ఉందంటే?
Image Credit : x/movie production

`భైరవం` మూవీ నటీనటుల ప్రదర్శన ఎలా ఉందంటే?

గజపతి పాత్రలో మంచు మనోజ్‌ అదరగొట్టారు. ముగ్గురు స్నేహితుల్లో ఒకరిగా పవర్‌ ఫుల్‌ రోల్‌లో మెప్పించారు. చాలా రోజుల తర్వాత ఆయనకు మంచి రోల్‌ పడింది. ఇలాంటి పాత్రని మనోజ్‌ ఎప్పుడూ చేయలేదు. డిఫరెంట్‌ షేడ్స్ చూపించిన తీరు బాగుంది. తనని తాను కొత్తగా ఆవిష్కరించుకున్నారని చెప్పొచ్చు. 

ఇక వరధ పాత్రలో నారా రోహిత్ సైతం మెప్పించారు. ఆయన ఇప్పటి వరకు కూల్‌, క్లాస్‌ రోల్స్ చేశారు. ఇందులో పూర్తి మాస్‌ రోల్‌లో రచ్చ చేశాడు. తనలోని మరో కోణాన్ని బయటపెట్టాడు. ఆయన పాత్ర కన్నీళ్లు పెట్టిస్తుంది. 

శీను పాత్రలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ సైతం హీరోగా మెప్పించారు. బెల్లంకొండ రెచ్చిపోయి నటించాడు. ఇప్పటి వరకు ఆయన చేసిన పాత్రలు ఒక ఎత్తు, ఇందులోని పాత్ర మరో ఎత్తు అని చెప్పొచ్చు. మొదట ఈ మూడు పాత్రలు స్నేహంగా ఉండటం, ఆ తర్వాత శత్రువులుగా మారడం, పాత్రల్లోని వేరియేషన్స్ బాగా చూపించారు. 

ఎస్పీగా సంపత్‌ రాజ్‌, నెగటివ్‌రోల్‌లో అజయ్‌, నాగరత్నమ్మగా జయసుధ ఆకట్టుకున్నారు. వెన్నెల కిశోర్‌ మధ్య మధ్యలో నవ్వించే ప్రయత్నం చేశారు. మంత్రిగా శరత్‌ తనదైన స్టయిల్‌లో ఆకట్టుకున్నారు. మనోజ్‌ భార్యగా ఆనంది పాత్రలోని షేడ్స్ అదిరిపోయాయి. 

ఈ సినిమాని మలుపు తిప్పడంలో ఆమె పాత్రనే కీలకం. ఇక నారా రోహిత్‌ భార్యగా దివ్య పిళ్లై నటనకు స్కోప్‌ ఉన్న పాత్ర చేసి మెప్పించారు. బెల్లంకొండ లవర్‌గా అదితి శంకర్‌ తనదైన స్టయిల్‌లో అలరించింది. మిగిలిన పాత్రలు ఓకే అనిపించాయి.

66
`భైరవం` మూవీలో టెక్నీషియన్ల పనితీరు
Image Credit : x/movie production

`భైరవం` మూవీలో టెక్నీషియన్ల పనితీరు

దర్శకుడు విజయ్‌ కనకమేడల ఎంచుకున్న కథ బాగానే ఉంది. అయితే దీన్ని తెలుగుకి తగ్గట్టుగా మార్పులు చేసిన తీరుకూడా బాగానే ఉంది. కానీ ఎమోషనల్‌ సీన్లు, డ్రామాని రక్తికట్టించే విషయంలో ఇంకా కేర్‌ తీసుకోవాల్సింది.  స్క్రీన్‌ ప్లే బాగా రాసుకోవాల్సింది. ఇప్పుడు ట్విస్ట్ లు, టర్న్‌ లు ఉంటేనే జనం ఆదరిస్తున్నాయి. ఆ విషయంలో దర్శకుడు మరింత కేర్‌ తీసుకోవాల్సింది.

చాలా సీన్లు కట్‌ చేసినట్టుగా ఉన్నాయి. వాటి నేపథ్యం చూపించాల్సింది. హరి కె వేదాంతం కెమెరా వర్క్ బాగుంది. విజువల్స్ రిచ్‌గా ఉన్నాయి. ఛోటా కె ప్రసాద్‌ ఎడిటింగ్‌ ఫర్వాలేదు. 

శ్రీ చరణ్‌ పాకాల సంగీతం సినిమాకి మరో ప్లస్‌. బీజీఎం కూడా అదిరిపోయింది. ఇక కెకె రాధామోహన్‌ నిర్మాణ విలువల బాగున్నాయి. రాజీపడకుండా నిర్మించారు.

ఫైనల్‌గాః మాస్‌ కమర్షియల్‌ సినిమాలను ఇష్టపడేవారికి నచ్చే మూవీ. మంచు మనోజ్‌, నారా రోహిత్‌, బెల్లంకొండలను కొత్తగా చూడొచ్చు.

రేటింగ్‌ః 2.75

Aithagoni Raju
About the Author
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు. Read More...
మంచు మనోజ్
సినిమా సమీక్షలు
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 
Recommended Stories
Top Stories