బాలయ్య ‘అఖండ’రివ్యూ
బాలకృష్ణ.. తాజాగా ‘అఖండ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ‘సింహ’, ‘లెజెండ్’ తర్వాత బోయపాటి, బాలయ్య కాంబోలో వస్తోన్న చిత్రం కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.
Akhanda Review
ఒక సారి ఓ కాంబో లో సూపర్ హిట్ వస్తే రిపీట్ అవుతుంది. అయితే అప్పుడే అంతకు ముందు చూపిన దాన్ని దాటాల్సిన అవసరం ఏర్పడుతుంది. అదే పెద్ద సమస్య. దాన్ని దాటడమే ఛాలెంజ్. ‘సింహ’, ‘లెజెండ్’ తర్వాత బోయపాటి, బాలయ్య కాంబోలో వస్తోన్న చిత్రం కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అఘోరా గెటప్ లో బాలయ్య ట్రైలర్స్ లోనే మాస్ కు మ్యాజిక్ చేయబోతున్నాననే నమ్మించారు. ఆ నమ్మకాలను ఈ సినిమా ఎంత వరకూ క్యారీ ఫార్వర్డ్ చేసింది, అంచనాలను అందుకుందా..అసలు ఈ ‘అఖండ’కథేంటి? బాలయ్య గర్జన థియోటర్స్ ని షేక్ చేస్తుందా, విలన్ గా శ్రీకాంత్ సెట్ అయ్యాడా,తెరపై బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్ కాంబినేషన్ పండిందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
Akhanda Review
కథేంటి
మురళి కృష్ణ (బాలయ్య) ఓ ఊరికి పెద్ద. రైతులుకు,పేదలకు అన్యాయం జరిగినా అడ్డుకుంటూంటాడు. రాయలసీమలో ఫ్యాక్షన్ వ్యవహారాలకు ముగింపు పలికి, శాంతి స్దాపన చెయ్యాలనేది అతని లక్ష్యం,లక్షణం. వాటిని చూసి ముచ్చటపడిన కలెక్టర్ శరణ్య (ప్రగ్యా జైస్వాల్) అతనిలో ప్రేమలో పడి, పాటలు పాడుకుంటూంటుంది. ఆ తర్వాత ఇద్దరూ పెళ్ళాడి వైవాహిక జీవితం మొదలు పెడతారు. కొద్ది కాలానికి వారికో పాట, హ్యాపీ లైఫ్. ఈ లోగా ఆ ప్రాంతంలో అక్రమంగా గనుల తవ్వకాలతో మాఫియాగా ఎదిగిన వరదరాజన్ (శ్రీకాంత్) కు అడ్డెళ్లతాడు మురళి కృష్ణ. ఎదిరిస్తాడు.
Akhanda Review
దాంతో మురళి కృష్ణను ఎలాగైనా పక్కకు తప్పించాలని ప్లాన్ వేసిన వరదరాజులు. తనకున్న రాజకీయ పలుకుబడితో మురళికృష్ణను ఓ తప్పుడు కేసులో ఇరికించి జైలుకు పంపిస్తాడు.దాంతో వరదరాజులకు అడ్డే లేకుండా పోతుంది. వరదలా ఆ ప్రాంతాన్ని ముంచెత్తేస్తూంటాడు. పనిలో పనిగా మురళి కృష్ణ భార్య శరణ్యను సస్పెండ్ అయ్యేలా చేస్తాడు . వాళ్ల కూతురుని చంపటానికి ప్రయత్నిస్తాడు. ఇలా వరదరాజులు వల్ల మురళి కృష్ణ కుటుంబానికి పెద్ద ప్రమాదం ఏర్పడుతుంది. అప్పుడు వీరిని రక్షించటానికి, ధర్మాన్ని ప్రతిష్టించటానికి,నీచులకు బుద్ది చెప్పటానికి అఖండ(బాలయ్య) ఎంట్రీ ఇస్తాడు. అప్పుడేం జరిగింది. అఖండ కు మురళికృష్ణకు సంభందం ఏమిటి..ఎవరీ అఖండ, చివరకు ఏమైంది వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Akhanda Review
ఎనాలసిస్....
బాలయ్య,బోయపాటి కాంబోలో వచ్చిన గత చిత్రాల స్క్రీన్ ప్లేనే ఈ సినిమా మొహమాటం లేకుండా ఫాలో చేసింది. ద్విపాత్రాభినయం నుంచి దమ్మున్న డైలాగులతో, మాస్ కు నచ్చే ఇంటర్వెల్ బ్లాక్ లో చెలరేగటం దాకా ఈ సినిమా వాటిని ఆశించే వారికి ప్యాకేజిగా అందించేసింది. ఆ విషయంలో సినిమా సక్సెసే. అయితే అభిమాని కానివాడు ఈ సినిమా సీన్స్ గురించి చెప్పాలంటే కాస్త మొహమాటపడాల్సి వస్తుంది. ఇంటర్వెల్ దాకా ఫస్టాఫ్ యావరేజ్ సీన్స్ తో నడుస్తుంది. అఖండ క్యారక్టర్ కోసం జనం ఎదురుచూసేలా చేయటం కోసం బోయపాటి వాడిన ట్రిక్ ఏమో. ఈ సినిమాని రక్షించే వాడు ఏడీ అనుకున్నప్పుడు అఖండ ఎంట్రీ....భారీ ఫైట్, ఇంటర్వెల్ బ్లాక్.
Akhanda Review
ఇక ఆ పాత్ర చుట్టూ అల్లిన సీన్స్ తో సెకండాఫ్ కొన్ని సీన్స్ లో శివ తాండవం చేయిస్తాడు. తమన్ కూడా నేను తక్కువ వాడ్నేమీ కాదన్నట్లు ఆ సీన్స్ కు అదిరిపోయే బీజీఎం ఇచ్చాడు. అలాగే కొంత బోర్ ఉంటే కానీ బొమ్మ పండదు అనుకున్నాడేమో ...హీరోయిన్ తో వచ్చే సీన్స్ లో బోర్ నింపేసాడు. మినిమం ఓ పదిహేను నిముషాలు ఈ స్కీమ్ రన్ అవుతుంది. అప్పుడు జనాల స్క్రీమింగ్. ఏదైమైనా సరైన గెటప్ మామూలు సినిమా లుక్ ని మార్చేయటం అంటే ఇదే. ఇక ఈ మాస్ మేనియా మధ్యలో కథ వెతకటం అంటే అఖండ లో అఖండ దీపం గురించి వెతికినట్లే. కొన్ని మాస్ సీన్స్ అనుకుని వాటిని తన రెగ్యులర్ ఫార్మెట్ స్క్రీన్ ప్లేలో సెట్ చేసేసారు బోయపాటి. దాంతో బాలయ్య గెటప్ తప్పిస్తే... ఇదో లెంగ్తీ, రొటీన్ బోయపాటి యాక్షన్ డ్రామా . క్లైమాక్స్ అయితే అందరూ ఊహించగలిగేలా మాములుగా ఉంది. తమ సినిమా కోసం ఎదురుచూసే అభిమానుల కోసం రాసుకున్న యాక్షన్ డ్రామా.
Akhanda Review
బాలయ్య ,శ్రీకాంత్ ఎలా చేసారు?
నందమూరి నటసింహం బాలయ్య ఈ మధ్యకాలంలో ఫుల్ ఎనర్జీతో దూసుకుపోతున్నారు. ‘ఆహా’ ఓటీటీలో అన్‌స్టాపబుల్ అంటూ దూసుకుపోతున్న బాలకృష్ణ.. తాజాగా ‘అఖండ’ సినిమాలో కొత్త గెటప్ లో అదరకొట్టాడు. అఖండ అనేది బాలయ్య తప్ప ఎవరికి ఈ గెటప్ వేసినా సెట్ కాదేమో అన్నట్లు ఉన్నారు. ఇక బాలయ్య డైలాగులు గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. అయితే ఆ ఫైట్స్ మధ్య కాస్తంత కథ కూడా ఉంటే బాగుండును అనిపిస్తుంది. ఇక మాస్ పాత్రలు చేయడం బాలకృష్ణకు కొత్తేమీ కాదు. కానీ ఈ సారి మాత్రం తనలోని విశ్వరూపాన్ని చూపించారు. అఘోరగా బాలకృష్ణ మాస్ ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ ఇచ్చారు. ద్వితీయార్థంలో బాలయ్య ఉగ్రరూపం కనిపిస్తుంది. ముఖ్యంగా జై బాలయ్య సాంగ్ లో అయితే.. బాలయ్య వేసిన స్టెప్పులు మామూలుగా లేవు.
Akhanda Review
ఇక కెరీర్ ప్రారంభంలో విలన్ గా కనిపించిన శ్రీకాంత్ చాలా రోజుల తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లాగ మైనింగ్ కింగ్ వరదరాజులుగా ఎంట్రీ ఇచ్చారు. అయితే విలనిజం తన అనుభవంతో పండించాడు కానీ జగపతిబాబు నెగిటివ్ రోల్ లో సెట్ అయిన స్దాయిలో మాత్రం లేడు. మెల్లిమెల్లిగా పదునెక్కుతాడేమో చూడాలి.
జిల్లా కలెక్టర్ గా ప్రగ్యా జైస్వాల్. కలెక్టర్ సబ్ ఆర్డినేట్ గా పూర్ణ ఇద్దరు ఓకే ఓకే అన్నట్లున్నారు. జగపతి బాబు పాత్ర కూడా ప్రేక్షకులని మెప్పించనుంది.
Akhanda Review
దర్శకత్వం మిగతా విభాగాలు
బాలయ్య పూర్తి స్దాయిలో తన ఫార్మెట్ లోకి తెచ్చుకోవటమే బోయపాటి ఇందులో చేసింది. గెటప్ తప్ప కొత్తదనం ఏమీ లేదు. స్క్రిప్టు, యాక్షన్ ఎపిసోడ్స్ గతంలో బోయపాటి సినిమాలు గుర్తు చేసినవే. చేసినవే అనిపిస్తాయి. కాకపోతే డబుల్ డోస్. అదే కొన్ని సార్లు ఓవర్ డోస్ అనిపించింది కూడా. అయితే గ్రాండ్ విజువల్స్ తో బోయపాటి తనకు తాను అనిపించుకున్నారు.సెకండాఫ్‌లో బాలకృష్ణను అఘోరగా ఇంటెన్స్, యాక్షన్ అవతారంలో ఓ రేంజిలో చూపించారు బోయపాటి శ్రీను.
Akhanda Review
రన్ టైమ్ బాగా ఎక్కువ అనిపించింది. వరస పెట్టి యాక్షన్ సీక్వెన్స్ , డైలాగులతో హోరెత్తిపోయింది. కాస్త డోస్,లెంగ్త్ తగ్గిస్తే బాగుండేది. ధమన్ ఈ సినిమాకు తన బిజీఎంతో ప్రాణం పోసాడు. పాటల్లో జై బాలయ్య సాంగ్ కు,, అఖండ టైటిల్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. యాక్షన్ డైరక్టర్స్ కు మంచి మార్కులు పడతాయి. కష్టం అంతా వాళ్లదే. అలాగే బాలయ్య ని అఖండగా చూపించటానికి కష్టపడ్డ మేకప్ డిపార్టమెంట్ కష్టం కూడా బాగా కనపడుతుంది. ద్వారక క్రియేషన్స్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఈ సినిమాకు మేజర్ అసెట్స్.
Akhanda Review
ప్లస్ లు :
+ అఖండగా బాలయ్య గెటప్, డైలాగులు
+ కొత్తగా కనిపించే శ్రీకాంత్
+ యాక్షన్ ఎపిసోడ్స్
+ డైలాగ్స్
+ తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్
మైనస్ పాయింట్స్ :
-ఫస్ట్ ఆఫ్ అసలు ఏమీ లేకుండా సోసో గా నడవటం
– హింస విపరీతంగా ఉండటం
– హీరోయిన్ ట్రాక్
– లెంగ్త్
Akhanda Review
ఫైనల్ థాట్
బోయపాటి మార్క్, బాలయ్య స్పార్క్ కాసేపు ఓవర్,మరికాసేపు స్టేబుల్
---సూర్య ప్రకాష్ జోశ్యుల
రేటింగ్ : 2.75/5
Akhanda Review
ఎవరెవరు...
నిర్మాణ సంస్థ : ద్వారకా క్రియేషన్స్
నటీనటులు: నందమూరి బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్, జగపతి బాబు‚ అవినాష్, శ్రీకాంత్ తదితరులు
కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం : బోయపాటి శ్రీను
సంగీతం : థమన్
సినిమాటోగ్రఫీ : సీ రాం ప్రసాద్
ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వర రావు
రచన : బోయపాటి శ్రీను, ఎం. రత్నం (డైలాగ్స్)
విడుదల తేదీ : 02 ,డిసెంబర్ 2021
రన్ టైమ్ :2 hr 48 Mins
Also read Akhanda: 'అఖండ' ట్విట్టర్ రివ్యూ.. థియేటర్స్ లో బాలయ్య శివతాండవం