Akhanda: 'అఖండ' ట్విట్టర్ రివ్యూ.. థియేటర్స్ లో బాలయ్య శివతాండవం
నందమూరి బాలకృష్ణ నటించిన 'Akhanda' చిత్రం కనీవినీ ఎరుగని అంచనాలు, పాజిటివ్ బజ్ తో నేడు గురువారం థియేటర్స్ లో విడుదలవుతోంది. ఇప్పటికే యూఎస్ ప్రీమియర్ షోలు, లోకల్ గా కొన్ని ప్రాంతాల్లో బెనిఫిట్ షోలు ప్రారంభం అయ్యాయి.
నందమూరి బాలకృష్ణ నటించిన 'Akhanda' చిత్రం కనీవినీ ఎరుగని అంచనాలు, పాజిటివ్ బజ్ తో నేడు గురువారం థియేటర్స్ లో విడుదలవుతోంది. ఇప్పటికే యూఎస్ ప్రీమియర్ షోలు, లోకల్ గా కొన్ని ప్రాంతాల్లో బెనిఫిట్ షోలు ప్రారంభం అయ్యాయి. దీనితో థియేటర్స్ వద్ద అభిమానులు బాలయ్య మానియాతో ఊగిపోతున్నారు. ఇక ట్విట్టర్ లో 'అఖండ' చిత్రాన్ని అద్భుతమైన స్పందన లభిస్తోంది. ట్విట్టర్ జనాలు అఖండ చిత్రం గురించి ఏం మాట్లాడుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం.
ఫస్ట్ హాఫ్ లో Boyapati Sreenu ప్రజెంటేషన్ అందిరింది. Balakrishna ఎంట్రీ, యాక్షన్ సన్నివేశాలు, ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ అయితే మైండ్ బ్లోయింగ్ అంటున్నారు. స్టోరీ రొటీన్ గా ఉండడం ఒక్కటే మైనస్. కానీ ఆ లోపం ఎక్కడా కనిపించకుండా బోయపాటి టేకింగ్, బాలయ్య స్క్రీన్ ప్రజెన్స్ థ్రిల్లింగ్ గా సాగింది. యాక్షన్ ఎపిసోడ్స్ లో బాలయ్య నెవర్ బిఫోర్ అనే విధంగా కనిపిస్తున్నాడు. ప్రతి యాక్షన్ సన్నివేశం గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉంది అని ట్విట్టర్ లో రెస్పాన్స్ వస్తోంది.
ఈ చిత్రం రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ప్రారంభం అవుతుంది. బాలయ్య తన కవల పిల్లలిద్దరి విషయంలో కీలక నిర్ణయం తీసుకునే సన్నివేశంతో సినిమా సార్ట్ అవుతుంది. ఇక ప్రగ్యా జైస్వాల్ జిల్లా కలెక్టర్ గా ఐఏఎస్ అధికారిగా కనిపిస్తోంది.
ఇంటర్వెల్ ఊరమాస్. బాలయ్య , బోయపాటి, తమన్ ఉతికి ఆరేశారు అంటూ ట్విట్టర్ లో కామెంట్స్ పడుతున్నాయి. బాలయ్య అభిమానులకు ఫీస్ట్ ఈ చిత్రం. ఇంటర్వెల్ బ్యాంగ్ ఎక్స్టార్డినరీగా ఉంది. కాకపోతే హీరోయిన్ సన్నివేశాలు లెంగ్తీగా అనిపిస్తున్నాయి. సాంగ్స్ చిత్రీకరణ బావుంది . బాలయ్యతో, ప్రగ్యా జైస్వాల్ రొమాంటిక్ సీన్స్ ఆశిస్తున్నాం. ఇంటర్వెల్ వరకు సినిమా అదిరిపోయింది అంటూ ట్విట్టర్లో మరికొందరు అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.
అఖండ అదిరింది. తమన్ రీసెంట్ టైమ్స్ లో అద్భుతమైన బ్యాగ్రౌండ్ స్క్రోర్ అందించాడు. ఇక సెకండ్ హాఫ్ లో బాలయ్య అఖండ పాత్రకి, మహాశివుడికి సంబందించిన డైలాగులు ఎక్కువగా ఉంటాయి అని అంటున్నారు. సెకండ్ హాఫ్ లో అక్కడక్కడా బోరింగ్ సీన్స్ పడ్డట్లు తెలుస్తోంది.
ఇక థియేటర్స్ బాలయ్య శివతాండవం చేస్తున్నాడు అంటూ మరికొందరు ట్విట్టర్ లో చెప్పుకొస్తున్నారు. ఇక అఖండ చిత్రం మల్టిఫ్లెక్స్ సినిమా కాదని, కేవలం బి, సి సెంటర్స్ వరకే పరిమితమయ్యే మూవీని మరికొందరు పేర్కొంటున్నారు.
అడిగా అడిగా సాంగ్ లో విజువల్ అద్భుతంగా ఉన్నాయి. సాంగ్ పిక్చరైజేషన్ ఆకట్టుకుంటోంది. ఇక మైనింగ్మాఫియా నడిపించే విలన్ రోల్ లో శ్రీకాంత్ బాగా నటించినట్లు ట్విట్టర్ జనాలు పేర్కొంటున్నారు. తమన్ కెరీర్ లో బెస్ట్ ఫామ్ లో కొనసాగుతున్నాడు అని అఖండ చిత్రంతో మారారు రుజువైనట్లు ప్రేక్షకులు పేర్కొంటున్నారు. మొత్తంగా అఖండ చిత్రంలో బాలయ్య అభిమానులని ఆకట్టుకునే మాస్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తోంది. Also Read: Akhanda reveiw:అఖండ ప్రీమియర్ రివ్యూ.. బాలయ్య ఊర మాస్ జాతర.. ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్