MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • Akhanda reveiw:అఖండ ప్రీమియర్ రివ్యూ.. బాలయ్య ఊర మాస్ జాతర.. ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్

Akhanda reveiw:అఖండ ప్రీమియర్ రివ్యూ.. బాలయ్య ఊర మాస్ జాతర.. ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్

బాలకృష్ణ (Balakrishna)కెరీర్ లో అతిపెద్ద రిలీజ్ గా అఖండ నిలిచింది. బాలయ్య-బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ కావడంతో విపరీతమైన హైప్ ఏర్పడింది. ఈ మధ్య కాలంలో బాలయ్య మూవీకి ఈ స్థాయి ప్రచారం దక్కలేదు. అడ్వాన్స్ బుకింగ్స్ సైతం రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఓవర్సీస్ లో బొమ్మపడిపోగా రెస్పాన్స్ ఎలా ఉందో చూద్దాం... 

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Dec 02 2021, 07:40 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

కథ:
పేదవారికి అండగా, ఊరికి పెద్దగా ఉండే మురళి కృష్ణ (బాలకృష్ణ) ఎవరికి అన్యాయం జరిగినా సహించడు. ఈ క్రమంలో అదే ఊరికి కలెక్టర్ గా శరణ్య (ప్రగ్యా జైస్వాల్)వస్తుంది. బాలయ్య మంచితనం, ఊరి కోసం, ప్రజల కోసం ఆయన పడే తాపత్రయం, నిస్వార్థమైన మనసు చూసి ఆకర్షితురాలు అవుతుంది. అలా మురళి కృష్ణ, శరణ్య  మధ్య ప్రేమ చిగురిస్తుంది. అనంతరం ఇద్దరూ వివాహం చేసుకొని వైవాహిక జీవితం మొదలుపెడతారు. అదే ఊరిలో వరదరాజులు(శ్రీకాంత్) అక్రమ మైనింగ్ జరుపుతూ ఉంటాడు. కాపర్ మైనింగ్స్ లో అకృత్యాలు సాగిస్తూ ఉంటాడు. ఆ మైనింగ్స్ వలన చుట్టు ప్రక్కల ఉన్న గ్రామ ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇది తెలుసుకున్న మురళి కృష్ణ రంగంలోకి దిగుతాడు. వరదరాజులును ఎదిరిస్తాడు. దీనితో మురళి కృష్ణను తప్పుడు కేసులో ఇరికించి జైలుకు పంపించి తనకు అడ్డులేకుండా చేసుకుంటాడు. మురళి కృష్ణ జైలుపాలు కావడంతో వరదరాజులు అరాచకాలు మితిమీరిపోతాయి. చివరికి శరణ్యకు ఆమె కుటుంబానికి వరదరాజులు నుండి ప్రమాదం ఏర్పడుతుంది. ఈ నిస్సహాయ స్థితిలో బాలయ్య అఖండ గా ఎంట్రీ ఇస్తాడు. ఈ అఖండ ఎవరు? అతడు క్రూరుడైన వరదరాజులుకు ఎలా చెక్ పెట్టాడు? మురళి కృష్ణ కుటుంబంతో అతనికి సంబంధం ఏమిటీ? అనేది మిగతా కథ 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28


అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన అఖండ (Akhanda)బాలయ్య ఫ్యాన్స్ కి పూనకాలే అన్నమాట వినిపిస్తుంది. భారీ యాక్షన్ సన్నివేశాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ అయిన బోయపాటి తెరకెక్కించిన ఫైట్ సీక్వెన్సులు అభిమానులతో పాటు ఫ్యాన్స్ కి ట్రీట్ అంటున్నారు. బాలయ్య ఆటం బాంబ్ అయితే దాన్ని సరిగా పేల్చడం తెలిసినవాడు ఒక్క బోయపాటే అనేది అక్షర సత్యమని బల్లగుద్ది చెబుతున్నారు. 

38


ముఖ్యంగా బాలయ్య ఇంట్రో సీన్ గూస్ బంప్స్ కలిగించేది ఉందని, ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అంటున్నారు. ఈ మధ్య కాలం ఈ రేంజ్ మాస్ ఇంటర్వెల్ బ్యాంగ్ రాలేదని తెలియజేస్తున్నారు. రాయలసీమ యాసలో బాలయ్య డైలాగ్స్ మరో ఆకర్షణ. ఫస్ట్ హాఫ్ లో సాంగ్స్ కూడా ఆకట్టుకున్నాయి. రెండు పాటలు మెప్పించగా... జై బాలయ్య సాంగ్ ఫుల్ కిక్ పంచుతుంది. 


 

48

డిఫరెంట్ రోల్స్ లో బాలకృష్ణ తన నటవిశ్వరూపం చూపించారు. విలన్ గా శ్రీకాంత్ (Srikanth) నటనకు మంచి మార్కులు పడుతున్నాయి. ఆయనకు ఈ మూవీతో బ్రేక్ వచ్చే ఆస్కారం కలదు. సినిమాలో ప్రధాన పాత్రలు చేసిన నటులు మెప్పించారు. హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్(Pragya jaiswal) కెరీర్ లో మొదటిసారి మంచి పాత్ర దక్కించుకున్నారు. కథలో కీలమైన కలెక్టర్ పాత్రలో ఆమె నటన ఆకట్టుకుంది. సాంగ్స్ లో బాలయ్యతో ఆమె కెమిస్ట్రీ కూడా అద్భుతం. 
 

58


థమన్ బీజీఎం సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ. యాక్షన్, ఎమోషనల్ సన్నివేశాలు ఓ రేంజ్ లో ఎలివేట్ అవ్వడంలో థమన్ బీజీఎమ్ ప్రధానంగా నిలిచింది. ఇక సెకండ్ హాఫ్ దర్శకుడు బోయపాటి ఎమోషనల్ గా నడిపారు. బోయపాటి సినిమాలో ఎమోషన్స్, యాక్షన్ పీక్స్ లో ఉంటాయి. గత సినిమాలకు మించి అఖండ మూవీలో చూడవచ్చు. 

68


అఖండ సినిమా ఆద్యంతం సీరియస్ నోట్ లో సాగుతుంది. సినిమాలో  కామెడీకి ఆస్కారం లేదు. ఇక అఖండ గురించి వినిపిస్తున్న నెగిటివ్ కామెంట్స్ నిడివి ఎక్కువైందని అంటున్నారు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ సాగదీతకు గురైందన్న మాట వినిపిస్తుంది. 

78

బోయపాటి సినిమాల్లో పవర్ ఫుల్ పాత్రలు ఉంటాయి. కథ కూడా చాలా బలంగా ఉంటుంది. అఖండ విషయానికి వస్తే కథాబలం లేదన్న మాట వినిపిస్తుంది. అలాగే ఇది బాలయ్య వన్ మ్యాన్ షో అంటున్నారు. మితిమీరిన యాక్షన్ సన్నివేశాలు కూడా ఒకింత ఇబ్బంది కలిగించే అంశం అంటున్నారు.

88


 
ప్రీమియర్ షోల ద్వారా అఖండకు దాదాపు పాజిటివ్ టాక్ అందుతుంది. కాసేపట్లో తెలుగు రాష్ట్రాల్లో సైతం అఖండ విడుదల కానుంది. చాలా కాలం తరువాత అఖండ రూపంలో వచ్చిన మాస్ జాతరను థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయండి.  

Also read 'అఖండ': ఆ రెండు థియేటర్లలో బెనిఫిట్ షోలు

Alsi read Allu Arjun: `మెగా` కాదు, `అల్లు`నే ఫస్ట్.. ఎన్టీఆర్‌తో పోల్చడం వెనకాల బన్నీ ఉద్దేశ్యం అదేనా?

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: అల్లు అర్జున్ కు చిరంజీవి చెప్పిన టాప్ సీక్రెట్.. మెగాస్టార్ నుంచి బన్ని నేర్చుకున్నది ఇదేనా?
Recommended image2
Suma: యాంకర్ గా సుమ లైఫ్ లో మర్చిపోలేని ప్రోగ్రామ్ ఏదో తెలుసా? ఆ ఒక్క షో ఎందుకంత స్పెషల్?
Recommended image3
Hanuman Ansh Records: ధురంధర్‌ 2, బార్డర్ రికార్డులను బద్దలుకొట్టిన 'హనుమాన్ అంశ్'.. సరికొత్త సంచలనం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved