MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Kamakshi Bhaskarla: ఇప్పటికీ కారు లేదు, బైక్‌ మీదనే తిరుగుతున్న హీరోయిన్‌.. క్రేజీ ఫిలాసఫీ

Kamakshi Bhaskarla: ఇప్పటికీ కారు లేదు, బైక్‌ మీదనే తిరుగుతున్న హీరోయిన్‌.. క్రేజీ ఫిలాసఫీ

హీరోయిన్‌ కామాక్షి భాస్కర్లకి ఇప్పటికీ కారు లేదట. అంతేకాదు బైక్‌ పైనే తిరుగుతుందట. షూటింగ్‌లకు కూడా బైక్‌పైనే వెళ్తుందట. అంతేకాదు తనకి సంబంధించిన క్రేజీ ఫిలాసఫీ చెప్పింది.

3 Min read
Author : Aithagoni Raju
Published : Aug 13 2026, 03:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
అగధ  చిత్రంతో రాబోతున్న కామాక్షి భాస్కర్ల
Image Credit : Asianet News

అగధ చిత్రంతో రాబోతున్న కామాక్షి భాస్కర్ల

కామాక్షి భాస్కర్ల.. మంచి ప్రతిభ ఉన్న నటి. గ్లామర్‌ రోల్స్, కమర్షియల్‌ సినిమాల వెంట పరిగెత్తకుండా కథా బలమున్న సినిమాలు, ప్రయారిటీ ఉన్న పాత్రలు చేస్తూ రాణిస్తోంది. `పొలిమెర` చిత్రాలతో ఆకట్టుకుంది. పాపులర్ అయ్యింది. ఇప్పుడు ఆమె `అగధ` చిత్రంతో వస్తోంది. ఈ మూవీ రేపు శుక్రవారం(ఆగస్ట్ 14)న విడుదల కానుంది. ఈ రాత్రి నుంచే ప్రీమియర్స్ పడుతున్నాయి. ఎంఎస్‌ రాజు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా కామాక్షి భాస్కర్ల మీడియాతో ముచ్చటించింది. ఇటీవల ఈవెంట్‌లో నిర్మాత శ్యామ్‌ ప్రసాద్‌ రెడ్డి.. అనుష్కతో పోల్చుతూ ప్రశంచిన నేపథ్యంలో దీనిపై మాట్లాడుతూ, ఆనందం వ్యక్తం చేసింది. అంత పెద్ద నిర్మాత తనని అలా పోల్చడం ఆనందంగా అనిపించిందని, మరింత బాధ్యతని పెంచిందన్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
కారు లేదు, బైక్‌ పైనే తిరుగుతాను
Image Credit : Asianet News

కారు లేదు, బైక్‌ పైనే తిరుగుతాను

సినిమా గురించి, దర్శకుడు ఎంఎస్‌ రాజు గురించి ఆమె మాట్లాడుతూ, `నాకు ఎం.ఎస్. రాజు గారి సినిమాలు అంటే చాలా ఇష్టం. ఆయన తీసిన వాటిల్లో ‘మనసంతా నువ్వే’ నాకు ఆల్ టైం ఫేవరేట్. ఆయన ‘అగధ’ కోసం ఫోన్ చేయడంతో చాలా సంతోషంగా అనిపించింది. నా ‘పొలిమేర’ చూశానని ఆయన అన్నారు. ఆయన ప్రతీ సినిమాలోని ప్రతీ ఆర్టిస్ట్ పవర్ ఫుల్‌గానే కనిపిస్తారు. రాజు గారు నన్ను పిలిచారంటే కచ్చితంగా ఏదో ఒక కొత్త పాయింట్, ముఖ్యమైన పాత్రే అయి ఉంటుందని అర్థమైంది. పైగా రాజు గారు కావడంతో నేను కూడా వెంటనే ఓకే చెప్పాను. ‘అగధ’ కథ, నా పాత్ర చెప్పిన తర్వాత మరింతగా నచ్చేసింది. మేల్ చేసినప్పుడు మేల్ సెంట్రిక్ సినిమాలు అనరు. కానీ ఫీమేల్ చేస్తే మాత్రం ఫీమేల్ సెంట్రిక్ సినిమా అంటారు. ఇంట్లో మహిళలు మల్టీపుల్ టాస్కులు చేస్తుంటారు. స్క్రీన్ మీద ఫీమేల్ కారెక్టర్స్ ఇండిపెండెంట్‌గా ఎందుకు ఉండకూడదు అని అనుకునేదాన్ని. 2019 నుంచి సరైన అవకాశం కోసం ఎదురుచూస్తూనే ఉన్నాను. చిన్న చిన్న పాత్రల కోసం ఎన్నో ఆడిషన్స్ ఇచ్చాను. నేను సినిమాల కోసం ఎంతో కష్టపడ్డాను. ఇప్పటికీ నాకు కారు లేదు. బైక్ మీదే వస్తాను. ఇప్పుడు అందరూ రోడ్ల మీద గుర్తు పట్టి నన్ను ఫాలో అవుతున్నారు (నవ్వుతూ). ప్రొడక్షన్ వాళ్లు ఇచ్చే వెహికల్ కూడా నాకు కొత్తగా అనిపిస్తుంది. ఇది కాదు కదా మనం అనిపిస్తుంది. మాది మిడిల్ క్లాస్ కావడంతో మాకు కారు పెద్ద విషయంగా అనిపిస్తుంటుంది` అని చెప్పింది కామాక్షి.

34
అగధ ఎలా ఉంటుందంటే?
Image Credit : Asianet News

అగధ ఎలా ఉంటుందంటే?

`మహాదేవి పాత్ర కోసం మారేందుకు నాకు టైం పట్టింది. కామాక్షిగా నన్ను నేను పక్కనపెట్టి, నా ప్రిన్సిపల్స్ పక్కన పెట్టి ఆ పాత్ర కోసం మారడానికి ఇబ్బంది అనిపించింది. దేవుడి అనుగ్రహంతో పుట్టే పాత్ర అది. బుద్ధిజం పుస్తకాల్ని చదివాను. బ్లాక్ మ్యాజిక్ గురించి తెలుసుకున్నాను. ప్రతీ ముద్ర గురించి, ఆ పాత్ర నడవడిక గురించి అర్థం చేసుకుని నటించాను. సినిమాలో ఎక్కడా కూడా కామాక్షి కనిపించకూడదని జాగ్రత్తలు తీసుకున్నాను. `అగధ`లోని యాక్షన్ సీక్వెన్స్ కోసం మేం ముందుగానే వర్క్ షాప్స్ చేశాం. టీం అంతా కలిసి శ్రమించడం వల్ల అవుట్ పుట్ బాగా వచ్చింది. ‘అగధ’లో మరీ ఎక్కువ హారర్ మూమెంట్స్ ఉండవు. చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. డివైన్ మూమెంట్స్ చాలా ఉంటాయి. చివరికు అందరికీ ఓ డివైన్ ఫీలింగ్ వస్తుంది. నేను చేసే సినిమాల్లో జానర్స్ రిపీట్ అవుతున్నా పాత్రలు మాత్రం కొత్తగానే ఉంటున్నాయి. ఓ సినిమాని కామాక్షి భుజానికి ఎత్తుకుని ముందుకు తీసుకు వెళ్లగలదు అనే నమ్మకాన్ని ఏర్పర్చాలి. కొన్ని సినిమాల్ని డబ్బుల కోసం చేస్తాం. ఇంకొన్ని మనల్ని మనం సంతృప్తి పర్చుకునేందుకు చేస్తుంటాం. నెక్ట్స్ నేను ఓ లవ్ స్టోరీకి సైన్ చేశాను. ‘పొలిమేర’, ‘అగధ’ వంటి చిత్రాలకే సూట్ అవుతాను అని అనుకునే విషయాన్ని నేను బ్రేక్ చేస్తాను.

44
సత్యం రాజేష్‌ తో చేసినందుకు వద్దు అన్నారు
Image Credit : Asianet News

సత్యం రాజేష్‌ తో చేసినందుకు వద్దు అన్నారు

`ఇండస్ట్రీకి వచ్చిన ప్రారంభంలో చాలా అవమానాలు ఫేస్‌ చేశాను. ఓ దశలో తిరస్కరణకు గురయ్యాను. సత్యం రాజేష్ పక్కన చేసిందా? అయితే వద్దు అని నా ముందే చాలా మంది అన్నారు. ఎవరి పక్కన చేస్తున్నామో కూడా ఇక్కడ చూస్తున్నారు. అది చాలా తప్పు. అదే సమయంలో మెడికల్ టీమ్‌ని ఏర్పాటు చేయాలి. ఔట్‌ డోర్‌లో షూటింగ్‌ జరుగుతున్నప్పుడు టీమ్‌కి ఏమైనా అయితే ఎవరు చూస్తారు, మెడికల్‌ ఎమెర్జెన్సీ అయితే బాధ్యులు ఎవరు? కాబట్టి ప్రతి సినిమా షూటింగ్‌లో మెడికల్‌ టీమ్‌ ఉండేలా చూసుకోవాలి. ఇది ప్రతి ఒక్కరు పాటించాలని తాను కోరుకుంటాను. ప్రస్తుతం రైటర్‌గా, అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాను. భవిష్యత్‌లో డైరెక్షన్‌ చేసే అవకాశం కూడా ఉంది` అని చెప్పింది కామాక్షి భాస్కర్ల.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Aishwarya Lekshmi: ఆ చెత్త పనుల వల్లే ఇన్‌స్టాగ్రామ్‌కు గుడ్‌బై చెప్పా.. నిజాలు బయటపెట్టిన హీరోయిన్
Recommended image2
Gangster Stories: గ్యాంగ్‌స్టర్ కథలకు అడ్డా.. ఆ ఏరియా బ్యాక్‌డ్రాప్‌లో సినిమా తీస్తే హిట్టే!
Recommended image3
Posani: ఇండస్ట్రీ హిట్ విషయంలో త్రివిక్రమ్ ని తిట్టేసిన పోసాని.. 4 రోజుల పాత్రతో క్రెడిట్ మొత్తం అతడికే
Related Stories
Recommended image1
Korean Kanakaraju Day 6 Collections: కొరియన్‌ కనకరాజుకి ఊహించని వసూళ్లు.. 6వ రోజు ఎంత వచ్చాయంటే?
Recommended image2
Bigg Boss Agnipariksha: లేడీ కంటెస్టెంట్‌ షూస్‌ క్లీన్‌ చేసిన అభిజీత్‌.. దెబ్బకి పొగరు మొత్తం దిగింది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved