MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Movie Reviews
  • Anumana Pakshi Movie Review: అనుమాన పక్షి మూవీ రివ్యూ, రాగ్‌ మయూర్‌ ఇలా చేశాడేంటి?

Anumana Pakshi Movie Review: అనుమాన పక్షి మూవీ రివ్యూ, రాగ్‌ మయూర్‌ ఇలా చేశాడేంటి?

రాగ్‌ మయూర్‌ హీరోగా నటించిన మూవీ `అనుమాన పక్షి`. అనుమానం తెచ్చిన తంటాలు ఎలాంటివి? దీన్నుంచి ఎలాంటి ఫన్‌ జనరేట్‌ అయ్యిందనే కాన్సెప్ట్ తో రూపొందిన ఈ మూవీ ఎలా ఉందంటే?

3 Min read
Author : Aithagoni Raju
Published : Sep 25 2026, 03:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
అనుమాన పక్షి మూవీ రివ్యూ
Image Credit : X/@smayurk

అనుమాన పక్షి మూవీ రివ్యూ

కామెడీ పాత్రలతో ఆకట్టుకున్న రాగ్‌ మయూర్‌ ఇప్పుడు హీరోగా నిలబడుతున్నాడు. `కీడా కోలా`, `పరదా` చిత్రాలతో మెప్పించాడు. ఇప్పుడు ఆయన హీరోగా `అనుమాన పక్షి` మూవీ రూపొందింది. `డీజే టిల్లు` చిత్ర దర్శకుడు విమల్‌ కృష్ణ రూపొందించిన చిత్రమిది. మెరిన్‌ ఫిలిప్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో అజయ్‌, రాశి, ప్రిన్స్, బ్రహ్మాజీ కీలక పాత్రలు పోషించారు. చిలక ప్రొడక్షన్స్ పతాకంపై రాజీవ్‌ చిలక, రాజేష్‌ జగ్తియాని, హిరాచంద్ నిర్మించారు. ఈ మూవీ నేడు శుక్రవారం(సెప్టెంబర్‌ 25న) విడుదలైంది. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
అనుమాన పక్షి మూవీ కథ
Image Credit : X/@smayurk

అనుమాన పక్షి మూవీ కథ

సన్నీ(రాగ్‌ మయూర్‌)ది వైజాగ్‌. అనుమానపక్షి పేరుతో యూట్యూబ్‌ నడిపిస్తుంటాడు. తను ప్రతిదీ అనుమానిస్తుంటాడు. వింతగా చేస్తుంటాడు. అతనికి కాశ్మీర్‌ నుంచి ఒక మెసేజ్‌ వస్తుంది. సన్నీ చేసిన పని వల్ల అతను నష్టపోతాడు. దీంతో కాశ్మీర్‌ రావాలని, లేదంటే తన పేరు రాసి సూసైడ్‌ చేసుకుంటానని బెదిరిస్తాడు. దీంతో వర్మ(ప్రిన్స్) మరో ఫ్రెండ్‌తో కలిసి కాశ్మీర్‌ వెళ్తాడు. అక్కడ కన్య(మెరిన్‌ ఫిలిప్‌) పరిచయం అవుతుంది. ఇద్దరు ప్రేమలో పడతారు. కానీ ఆమెని కూడా అనుమానిస్తుంటాడు. మార్నింగ్‌ నీకు సర్‌ప్రైజ్‌ ఇస్తానని కన్య చెబుతుంది. లేచి చూసేసరికి వర్మ చనిపోయి ఉంటాడు. అది తానే చేశానని గందరగోళానికి గురవుతాడు సన్నీ. ఇంకోవైపు అదే సమయంలో వైజాగ్‌ పోలీస్‌ వాసు(అజయ్‌) తన భార్య సుజాత(రాశి)ని తీసుకొని కాశ్మీర్‌కి వస్తాడు. అక్కడ వీడియోలు చేస్తుంటారు. అనుకోకుండా సన్నీ ఉన్న రిసార్ట్ లోకి వెళ్తారు. అక్కడ వర్మ మరణం వార్త తెలుస్తుంది. మరోవైపు సుజాత ఆత్మల కోసం సెర్చ్ చేస్తుంది. ఇంకోవైపు సన్నీకి ప్రియురాలు హ్యాండిస్తుంది? మరి వర్మ ఎలా చనిపోయాడు? సన్నీ లవర్‌ ఎందుకు హ్యాండిచ్చింది? వైజాగ్‌ వాసు ఈ కేసుని ఏం చేశాడు? వీటి నుంచి సన్నీ ఎలా బయటపడ్డాడు? తాను అనుమానాలు తెచ్చిన తంటాలేంటి? సుజాత ఆత్మలను ఎందుకు సెర్చ్ చేస్తుంది? అనేది మిగిలిన కథ.

36
అనుమాన పక్షి మూవీ విశ్లేషణ
Image Credit : X/@smayurk

అనుమాన పక్షి మూవీ విశ్లేషణ

అనుమానంతో ఎలాంటి చిక్కులు వచ్చాయనేది, హీరో ఎలాంటి గందరగోళం క్రియేట్‌ చేశాడు, దీని వల్ల ఫన్ క్రియేట్‌ చేయడమనే కథాంశంతో రూపొందిన చిత్రమిది. సింపుల్‌గా కథ ఇదే. కానీ సందర్భానుసారంగా క్రియేట్‌ అయ్యే ఫన్‌తో ఈ మూవీని రూపొందించారు. ప్రారంభమే ఫన్‌తో స్టార్ట్ అవుతుంది. హీరో పాత్రని, ఆయన అనుమానాలు ఏ స్థాయిలో ఉన్నాయనేది ఆవిష్కరించారు. అనుమానాలతో తన ఇంటిని ఎలా సెక్యూర్డ్ గా తయారు చేసుకున్నారనే అంశాలతో ఆసక్తికరంగా స్టార్ట్ అవుతుంది. దీంతో సినిమా మొత్తం ఫన్‌తోనే రన్‌ అవుతుందని భావిస్తాం. కానీ కాసేపటికే ఇందులో కామెడీ లేదని అర్థమవుతుంది. రాగ్‌ మయూర్‌ చేసిన రచ్చనే ఉంటుంది తప్ప, ఒక్క సీన్‌లోనూ కామెడీ వర్కౌట్‌ కాలేదు. నటుడిగా రాగ్‌ మయూర్‌ బాగానే కష్టపడ్డా, ఆయన చేసే చేష్టల్లో కామెడీ జనరేట్‌ కాలేదు. ఇంకా చెప్పాలంటే దర్శకుడు కామెడీని రాబట్టడంలో ఫెయిల్‌ అయ్యాడు. వైజాగ్‌ నేపథ్యంలో సినిమా స్టార్ట్ చేసి, కాశ్మీర్‌కి షిఫ్ట్ చేస్తారు. అక్కడ వెళ్లినా కూడా అదే తరహాలో ఉంటుంది. ప్రిన్స్ మరణం తర్వాత క్రైమ్‌ థ్రిల్లర్‌ వైపు టర్న్ తీసుకుంటుంది. కానీ ఆ థ్రిల్లింగ్‌ ఎలిమెంట్లు కూడా తేలిపోయాయి. అజయ్‌ పాత్ర ఎంట్రీతో అయినా ఫన్‌ జనరేట్‌ అవుతుందనుకుంటే అక్కడ కూడా నిరాశనే ఎదురైంది. అలాగే బ్రహ్మాజీ పాత్ర సైతం ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. దీనికితోడు ఇందులో టెర్రరిస్ట్ ల ఎపిసోడ్‌ని కూడా జోడించారు. ఏదీ కూడా నవ్వించలేకపోయాయి. పైగా గందరగోళం క్రియేట్‌ చేశాయి. మరింత విసిగించాయని చెప్పొచ్చు. అనుమానాలు ఎలాంటి గందరగోళం క్రియేట్‌ చేస్తుందనే పాయింట్‌ బాగుంది, కానీ దానికోసం సినిమా తీయాల్సిన అవసరం లేదని ఈ మూవీ చూస్తే అర్థమవుతుంది. ప్రారంభం నుంచి ఎండింగ్‌ వరకు ఇది పూర్తిగా నిరాశపరిచింది.

46
అనుమాన పక్షిలో ఆర్టిస్ట్ లు ఎలా చేశారంటే?
Image Credit : X/@smayurk

అనుమాన పక్షిలో ఆర్టిస్ట్ లు ఎలా చేశారంటే?

సన్నీగా రాగ్‌ మయూర్‌ నటుడిగా మెప్పించాడు. విభిన్నమైన హవాభావాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. కానీ తాను చేసింది కామెడీగా టర్న్ కాకపోవడంతో ఓ దశ తర్వాత చిరాకుగా మారుతుంది. వైజాగ్‌ వాసుగా అజయ్ ఆకట్టుకున్నాడు. ఫర్వాలేదనిపించారు. రాశి పాత్ర పెద్దగా ఇంపాక్ట్ లేదు. బ్రహ్మాజీ కాసేపు మెరిశాడు. కానీ నవ్వించలేకపోయాడు. ప్రిన్స్ పాత్ర అయోమయంగా ఉంటుంది. ఆయన ఓకే అనిపించారు. హీరోయిన్‌ పాత్రని ఎందుకు పెట్టారో అర్థం కాదు. మిగిలిన పాత్రలు ఓకే అనిపించాయి.

56
అనుమాన పక్షి టెక్నీకల్‌గా ఎలా ఉందంటే?
Image Credit : X/@smayurk

అనుమాన పక్షి టెక్నీకల్‌గా ఎలా ఉందంటే?

సినిమా విజువల్‌గా బాగుంది. సునీల్‌ కుమార్‌ బాగా చిత్రీకరించారు. ఛోటా కే ప్రసాద్‌ ఎడిటింగ్‌ ఫర్వాలేదు. షార్ట్ గానే చేశారు. శ్రీచరణ్‌ పాకాల మ్యూజిక్‌ ఏమాత్రం ఇంపాక్ట్ లేదు. సౌండింగ్‌ కూడా ఆకట్టుకోలేకపోయింది. దర్శకుడు విమల్‌ కృష్ణ చిన్నపాయింట్‌ని మూవీగా తీయాలనుకున్నారు. కానీ కామెడీని వర్కౌట్‌ చేయడంలో ఫెయిల్‌ అయ్యారు. ఈ మూవీ విషయంలో ఆయన ఎన్నో ప్రయత్నాలు చేసినా అన్నీ బెడిసికొట్టాయి. కాకపోతే పాయింట్‌ ఒక్కటే బాగుంది. నిర్మాతలు రాజీలేకుండా నిర్మించారు. ప్రొడక్షన్‌ వ్యాల్యూస్‌ బాగున్నాయి. సినిమాలో ప్లస్‌ ఏదైనా ఉందంటే అది నిడివి, రెండో ప్రొడక్షన్‌ వ్యాల్యూస్‌.

66
ఫైనల్‌గా
Image Credit : X/@smayurk

ఫైనల్‌గా

ఏమాత్రం నవ్వించలేకపోయిన అనుమాన పక్షి. సినిమాలో చివర్లో ఒక డైలాగ్‌ ఉంటుంది. ఈ అనుమాన పక్షికి దూరంగా ఉండాలని. అది కరెక్ట్ గా ఈ సినిమాకి వర్తిస్తుంది. ఈ మూవీకి ఎంత దూరంగా ఉంటే అంత బెటర్.

రేటింగ్‌ : 1

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
సినిమా సమీక్షలు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Paradise Movie Review: ప్యారడైజ్‌ మూవీ రివ్యూ.. నాని విశ్వరూపం ఓకే.. కానీ అసలు సినిమా ఎలా ఉందంటే?
Recommended image2
Paradise Review: ది ప్యారడైజ్ మూవీ ఫస్ట్ రివ్యూ.. నాని సినిమాలో హైలెట్స్ ఇవే, మైనస్ ఏంటంటే?
Recommended image3
Hitler Movie Review: మోహన్ బాబు వల్ల డిజాస్టర్స్ నుంచి బయటపడ్డ చిరంజీవి, డైరెక్టర్ ను భయపెట్టిన మెగా ఫ్యాన్స్.. హిట్లర్ మూవీ రివ్యూ
Related Stories
Recommended image1
Paradise Movie Review: ప్యారడైజ్‌ మూవీ రివ్యూ.. నాని విశ్వరూపం ఓకే.. కానీ అసలు సినిమా ఎలా ఉందంటే?
Recommended image2
Paradise Day 1 Collections: బాక్సాఫీసుపై నాని దండయాత్ర.. ప్యారడైజ్‌ సినిమాకి ఫస్ట్ డే రికార్డ్ కలెక్షన్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved