MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Naa Anveshana: నేనొక వెధవ, పోరంబోకుని.. అయినా కోటీశ్వరుడుని ఎలా అయ్యానంటే? అన్వేష్ చెప్పిన సక్సెస్ సీక్రెట్

Naa Anveshana: నేనొక వెధవ, పోరంబోకుని.. అయినా కోటీశ్వరుడుని ఎలా అయ్యానంటే? అన్వేష్ చెప్పిన సక్సెస్ సీక్రెట్

Naa Anveshana: నా అన్వేషణ ఫేమ్, ఫేమస్ ట్రావెల్ వ్లాగర్, ప్రపంచ యాత్రికుడు, వివాదాస్పద యూట్యూబర్.. ఇన్ని ట్యాగ్ లు ఉన్న ఏకైక వ్యక్తి అన్వేష్. రీసెంట్ గా ఆయన మరో సంచలన వీడియో తో సందడి చేశాడు. కోటీశ్వరుడిని ఎలా అయ్యానో తెలుసా అని వీడియో రిలీజ్ చేశాడు.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 25 2026, 11:23 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
సులువుగా కోటీశ్వరులు అవ్వాలంటే..
Image Credit : Prapancha Yatrikudu

సులువుగా కోటీశ్వరులు అవ్వాలంటే..

ప్రస్తుత సమాజంలో సులువుగా కోటీశ్వరులు కావాలని, జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. అయితే, ధనవంతులు కావడానికి కేవలం తెలివితేటలు, అదృష్టం మాత్రమే ఉంటే సరిపోవని, అసలైన సూత్రం ‘క్రమశిక్షణ’ (Discipline) మాత్రమేనని ప్రముఖ ట్రావెల్ వ్లాగర్, ‘నా అన్వేషణ’ ఫేమ్ అన్వేష్ (ప్రపంచ యాత్రికుడు) తేల్చి చెప్పారు తన వ్యక్తిగత అనుభవాలను పంచుకుంటూ, ఒక సామాన్యుడి నుండి కోటీశ్వరుడిగా ఎదిగిన క్రమంలో తనకు క్రమశిక్షణ ఎలా ఉపయోగపడిందో వివరించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
నేనొక వెధవ.. పోరంబోకుని
Image Credit : Prapancha Yatrikudu

నేనొక వెధవ.. పోరంబోకుని

అన్వేష్ మాట్లాడుతూ.. ''చిన్నతనంలో నేనొక వెధవ.. పోరంబోకులా ఉండేవాడిని, ఏమాత్రం క్రమశిక్షణ ఉండేది కాదు. అందుకే నా తల్లిదండ్రులు తన్ను హాస్టల్‌లో చేర్పించారు. ఆ నిర్ణయమే నా జీవితాన్ని మలుపు తిప్పింది. గత ఏడేళ్లుగా ప్రపంచ యాత్ర చేస్తున్న సమయంలో నేను ఎక్కువగా హాస్టళ్లలోనే గడుపుతున్నాను. హాస్టల్‌లో ఆరుగురు లేదా అంతకంటే ఎక్కువ మందితో కలిసి రూమ్‌ను పంచుకోవాల్సి వచ్చినప్పుడు, ఆటోమేటిక్‌గా ఒక పద్ధతి అలవాటవుతుంది'' అని అన్వేష్ అన్నాడు.

హాస్టల్ జీవితం నేర్పిన డిసిప్లిన్

''షూస్ ఎక్కడ పెట్టాలి, చెత్త ఎక్కడ వేయాలి, బట్టలు ఎంత నీట్‌గా ఉంచుకోవాలి అనే విషయాలు తోటి సభ్యుల వల్ల అలవాటవుతాయి.ఇంట్లో అయితే కుటుంబ సభ్యులు పనులు చేసిపెడతారు, కానీ హాస్టల్‌లో వాష్‌రూమ్స్ లేదా కిచెన్ ఉపయోగించిన తర్వాత నీట్‌గా క్లీన్ చేయకపోతే తోటివాళ్ళు ప్రశ్నిస్తారు. వస్తువులను నీట్‌గా లేబుల్ చేసుకోవడం, ప్రతీ పనిలో బాధ్యతగా ఉండడం వంటివి ఇతరులను చూసి నేర్చుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ ఇంట్లో ఉంటే రావు.. హాస్టల్ లో ఉంటేనే అలవాటు అవుతుంది.'' అని అన్వేష్ తన వీడియో ద్వారా సందేశం ఇచ్చాడు.

34
లగ్జరీ లైఫ్ వద్దు.. క్రమశిక్షణే ముద్దు..
Image Credit : Prapancha Yatrikudu

లగ్జరీ లైఫ్ వద్దు.. క్రమశిక్షణే ముద్దు..

తన దగ్గర ఉన్న డబ్బుతో లగ్జరీ ఫైవ్ స్టార్ హోటళ్లలో హాయిగా ఉండగల స్థోమత ఉన్నప్పటికీ, తానలా చేయనని అన్వేష్ చెప్పారు. లగ్జరీ హోటళ్లలో ఉంటే మనిషిలో ఉన్న క్రమశిక్షణ సడలిపోయే ప్రమాదం ఉందని, అందుకే ఇప్పటికీ రోజుకు రూ. 400 చౌకైన బ్యాక్‌ప్యాకింగ్ హాస్టళ్లలోనే ఉంటున్నట్లు వెల్లడించారు. తోటి మనుషులతో కలిసి ఉండడం వల్ల క్రమశిక్షణ తప్పుకుండా, నేలమీద నిలబడే తత్వం అలవడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

44
తల్లిదండ్రులకు, యువతకు పిలుపు
Image Credit : Prapancha Yatrikudu

తల్లిదండ్రులకు, యువతకు పిలుపు

పిల్లలలో క్రమశిక్షణ లోపిస్తే వారిని హాస్టళ్లలో ఉంచాలని అన్వేష్ సూచించారు. అలాగే పెద్దవాళ్ళు కూడా జీవితంలో క్రమశిక్షణను అలవర్చుకోవాలనుకుంటే బ్యాక్‌ప్యాకింగ్ హాస్టల్స్‌లో సమయం గడపాలని చెప్పాడు. జీవితంలో ఏ స్థాయికి ఎదిగినా క్రమశిక్షణ, సామాజిక బాధ్యత లేకపోతే సాధించిన విజయం నిలవదని, అదే అసలైన విజయ రహస్యమని ‘నా అన్వేషణ’ అన్వేష్ ఈ సందేశం ద్వారా స్పష్టం చేశాడు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Balakrishna: ట్రంప్ కు బాలకృష్ణ మాస్ వార్నింగ్, ఇరాన్ ఇంతపని చేసిందేంటి? వైరల్ అవుతున్న వీడియో
Recommended image2
Pawan Kalyan: ముక్క లేకుంటే ముద్ద దిగదు.. పవన్ కళ్యాణ్ కు క్లాస్ పీకిన చిరంజీవి, పవర్ స్టార్ జీవితాన్ని మార్చిన మాట ఏదో తెలుసా?
Recommended image3
Bigg Boss 10: మూడో వారం ఓటింగ్‌, డేంజర్‌ జోన్‌లో సంచలన కంటెస్టెంట్‌.. కావాలనే తొక్కేస్తున్నారా?
Related Stories
Recommended image1
Balakrishna: ట్రంప్ కు బాలకృష్ణ మాస్ వార్నింగ్, ఇరాన్ ఇంతపని చేసిందేంటి? వైరల్ అవుతున్న వీడియో
Recommended image2
Pawan Kalyan: ముక్క లేకుంటే ముద్ద దిగదు.. పవన్ కళ్యాణ్ కు క్లాస్ పీకిన చిరంజీవి, పవర్ స్టార్ జీవితాన్ని మార్చిన మాట ఏదో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved