ఎగ్జిట్ ‌పోల్ ఫలితాల ఎఫెక్ట్: గోడమీది పిల్లులు ప్రాంతీయ పార్టీలు

First Published 21, May 2019, 3:36 PM

 మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కేంద్రంలో  మరోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశం ఉందని ప్రకటించాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల తర్వాత ప్రాంతీయ పార్టీలు వేచి చూసే ధోరణిలో ఉన్నాయి

కేంద్రంలో బీజేపీయేతర పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు టీడీపీ చీఫ్, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రయత్నాలు  చేస్తున్నారు. ఏపీ రాష్ట్రంలో మొదటి విడత ఎన్నికలు జరిగాయి. మొదటి విడత ఎన్నికలు పూర్తైన తర్వాత ఇతర రాష్ట్రాల్లో  జరిగే  ఎన్నికల ప్రచారాల్లో కూడ చంద్రబాబునాయుడు  పాల్గొన్నారు.

దేశంలో ఏడు విడతల పాటు ఎన్నికలు జరిగాయి. ఈ నెల 19వ తేదీన ఎగ్జిట్ పోల్స్ కూడ విడుదలయ్యాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ తర్వాత కొన్ని ప్రాంతీయ పార్టీల వైఖరిలో మార్పు వచ్చినట్టు కన్పిస్తోంది.  కొన్ని పార్టీలు తటస్థ వైఖరితో ఉండాలని భావిస్తున్నట్టుగా కన్పిస్తున్నాయి.

దేశంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ కూడ ప్రయత్నాలు చేశారు. కొన్ని పార్టీల ప్రాంతీయ పార్టీల అధినేతలతో కేసీఆర్  చర్చలు జరిపారు. కానీ, ఈ ఫ్రంట్ ప్రయత్నాలు ఆశించినంతగా సక్సెస్ కాలేదు.

అయితే ఎగ్జిట్ పోల్స్ కారణంగా కాంగ్రెస్ నేతృత్వంలోని ఫ్రంట్‌ వైపు సానుకూల ధోరణితో ఉన్న ప్రాంతీయ పార్టీల నేతలు  మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నారు.ఎగ్జిట్ పోల్స్‌ ఫలితాలు వెలువడిన మరునాడే డీఎంకె చీఫ్ స్టాలిన్ ఈ నెల 23వ తేదీన ప్రాంతీయ పార్టీల సమావేశం లేదని తేల్చిచెప్పారు. ఈ సమావేశం అవసరం లేదని స్టాలిన్ తేల్చి చెప్పారు.

స్టాలిన్ ఈ ప్రకటన చేసిన తర్వాత కూడ బెంగాల్ సీఎం మమత బెనర్జీతో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఈ నెల 20వ తేదీ రాత్రి భేటీ అయ్యారు. ఈ నెల 20వ తేదీ మధ్యాహ్నం బీఎస్పీ చీఫ్ మాయావతి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియ గాంధీతో సమావేశం రద్దైంది. ఈ నెల 19వ తేదీన తేదీన మాయావతితో  బాబు భేటీ అయ్యారు.

బాబు భేటీ తర్వాత సోనియాతో భేటీ అయ్యేందుకు మాయావతి అంగీకరించారు. కానీ ఎగ్జిట్ పోల్స్‌ తర్వాత  మాయావతి మనసు మార్చుకొన్నారు. మంగళవారం నాడు విపక్ష పార్టీల సమావేశానికి కర్ణాటక సీఎం కుమారస్వామి దూరమయ్యారు.

బీజేపీ, కాంగ్రెస్ పార్టీల కూటమిలో చేరకుండా తటస్థంగా ఉండాలనే అభిప్రాయంతో కొన్ని పార్టీలు ఉన్నాయి. బీజేపీ,  కాంగ్రెస్ పార్టీలతో సంబంధం లేని కూటమిలో చేరకుండా ఉన్న పార్టీలను తమ వైపుకు తిప్పుకొంటే ప్రయోజనం ఉంటుందని కేసీఆర్ ఆలోచనగా కూడ ఉన్నట్టుగా కన్పిస్తోంది. తమతో కలిసివచ్చేపార్టీలను కూడగడితే కనీసం వంద ఎంపీ సీట్లు తమ చేతిలో ఉంటే బీజేపీని కూడ శాసించే అవకాశం ఉంటుందని కేసీఆర్ ప్లాన్‌గా కన్పిస్తోంది.

loader