MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Life
  • Sofa Cleaning: సోఫాను 10 నిమిషాల్లో మురికి పోగొట్టి కొత్తదానిలా మార్చేయచ్చు.. ఇదిగో వైరల్ చిట్కా

Sofa Cleaning: సోఫాను 10 నిమిషాల్లో మురికి పోగొట్టి కొత్తదానిలా మార్చేయచ్చు.. ఇదిగో వైరల్ చిట్కా

Sofa Cleaning:  ప్రతి ఇంట్లోని సోఫా ఉంటుంది. దానిపై కొన్ని నెలలకు మురికి పేరుకుపోతుంది. దీన్ని కేవలం 10 నిమిషాల్లోనే కొత్తదానిలా మెరిపించవచ్చు. దీన్ని కొత్తగా మార్చేందుకు ఇంట్లోనే చిన్న చిన్ని చిట్కాలు పాటించాలి.

2 Min read
Author : Haritha Chappa
Published : Jul 14 2026, 01:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
సోఫా క్లీనింగ్
Image Credit : AI

సోఫా క్లీనింగ్

ప్రతి ఇంట్లో హాల్‌కి సోఫానే అందం. దాన్ని రోజూ వాడటం వల్ల సోఫాపై దుమ్ము, చెమట, తిన్న ఫుడ్, పిల్లల గీతలతో త్వరగా మురికిగా మారిపోతుంది. అలాగే వదిలేస్తే సోఫా లుక్ పాడవ్వడమే కాదు, చెడు వాసన వచ్చి అలర్జీలకు కూడా కారణం అవుతుంది. కొన్ని సింపుల్ టిప్స్‌తో మీ సోఫాను మళ్లీ కొత్తదానిలా మార్చుకోవచ్చు.

సోఫాను శుభ్రం చేసే ముందు దాని ఫ్యాబ్రిక్‌ను బట్టి  క్లీనింగ్ చేయాలి. దీనికోసం సోఫా కుషన్ల కింద ఉండే 'క్లీనింగ్ కోడ్' లేబుల్ చూడండి. 'W' అని ఉంటే నీటి ఆధారిత క్లీనర్లు, 'S' అని ఉంటే నీళ్లు లేని సాల్వెంట్ (Solvent) క్లీనర్లు వాడాలి. 'X' అని ఉంటే, కేవలం వాక్యూమ్ క్లీనర్ లేదా బ్రష్‌తోనే శుభ్రం చేయాలి. మీరు ఏ క్లీనింగ్ సొల్యూషన్ వాడినా, ముందుగా సోఫాలో కనిపించని చిన్న ప్రదేశంలో టెస్ట్ చేయాలి. ఓ 10 నిమిషాల తర్వాత, ఫ్యాబ్రిక్ రంగు మారలేదని నిర్ధారించుకున్నాకే మొత్తం సోఫాను క్లీన్ చేయడం మంచిది. అలాగే క్లీనింగ్ ముందు వాక్యూమ్ క్లీనర్‌తో సోఫా మూలల్లోని దుమ్మును పూర్తిగా తీసేయండి. తడి గుడ్డతో తుడవండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
సోఫా క్లీనింగ్ వైరల్ టిప్
Image Credit : getty

సోఫా క్లీనింగ్ వైరల్ టిప్

సోఫాను క్లీన్ చేసేందుకు  ఒక గిన్నెలో గోరువెచ్చని నీళ్లు, కొన్ని చుక్కల గిన్నెలు కడిగే లిక్విడ్, ఒక టీస్పూన్ బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి.  ఒక మైక్రోఫైబర్ క్లాత్‌ను ఈ మిశ్రమంలో ముంచి, నీళ్లు కారకుండా గట్టిగా పిండాలి.  ఒక ఫ్లాట్ గిన్నె మూతపై పెట్టి రబ్బర్ బ్యాండ్‌తో టైట్‌గా కట్టండి. ఈ మూతతో సోఫా మెల్లగా రుద్దితే, చేతులతో శుభ్రం చేయలేని మురికి కూడా సులభంగా వచ్చేస్తుంది. ఈ పద్ధతి వల్ల మురికి పోవడమే కాక, ఎక్కువ నీళ్లు సోఫాలోకి వెళ్లకుండా కూడా ఉంటాయి.

33
మరకలు, వాసన పోవాలంటే
Image Credit : pinterest

మరకలు, వాసన పోవాలంటే

సోఫాపై కాఫీ, టీ మరకలు పడతాయి.  పైన చెప్పిన సబ్బు నీళ్లను అద్ది, మెల్లగా ఒత్తి తుడవాలి. గట్టిగా రుద్దకూడదు. పెన్ ఇంక్ లాంటి మరకలు పోయేందుకు దూదిలో కొద్దిగా రబ్బింగ్ ఆల్కహాల్ తీసుకుని నెమ్మదిగా తుడవాలి. సోఫా నుంచి వచ్చే చెడు వాసన పోవాలంటే దానిపై బేకింగ్ సోడా చల్లి, ఓ 20 నిమిషాల తర్వాత వాక్యూమ్ క్లీనర్‌తో క్లీన్ చేయండి. ఆ వాసన పోతుంది. ఫ్యాన్ వేసి సోఫాను గాలికి పూర్తిగా ఆరబెట్టాలి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sarees: స్టైల్, కంఫర్ట్ కోసం ఈ శారీస్ కచ్చితంగా ట్రై చేయాల్సిందే!
Recommended image2
Mangalsutra Designs: కాటన్ చీరలకు సూటయ్యే మంగళసూత్రం డిజైన్లు
Recommended image3
Motivational Story: మనసులోని ఆలోచనలే శత్రువులు.. అద్దం కూడా భయపెడుతుంది.. మీ ఆలోచన మార్చే కథ ఇది
Related Stories
Recommended image1
Heavy Gold Necklace: మెడ నిండుగా హెవీ బంగారు నెక్లెస్ డిజైన్లు
Recommended image2
Cheapest SUV: ఆరు లక్షల రూపాయలలో వచ్చే 3 బెస్ట్ బడ్జెట్ ఎస్‌యూవీ కార్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved