Yoga Day 2022: అంతర్జాతీయ యోగా దినోత్సవ విషెస్, కోట్స్, మెసేజెస్..
Yoga Day 2022: ప్రతి ఏడాది జూన్ 21 న ప్రపంచ యోగా దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ సందర్భంగా మీ బంధువులకు యోగా దినోత్సవ మెసేజెస్, కోట్స్, విషెస్ ఇలా తెలియజేయండి.

Yoga Day 2022: ప్రపంచ వ్యాప్తంగా.. ప్రతి ఏడాది జూన్ 21 నాడు International Yoga Day ను సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ యోగా డేను మొదటి సారిగా 2015 లో జరుపుకున్నారు. యోగా ప్రాముఖ్యతను తెలియజేసేందుకు ప్రతి ఏడాది ఈ రోజును నిర్వహిస్తారు.
yoga day
యోగా మన మనస్సునే కాదు.. శరీరాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. క్రమం తప్పకుండా యోగా సాధన చేయడం వల్ల ఒత్తిడి తగ్గిపోయి.. మానసిక ప్రశాంతత లభిస్తుంది. అందుకే ఆరోగ్య నిపుణులు, యోగా నిపుణులు.. ప్రతిరోజు యోగాను చేయాలని చెబుతుంటారు. ఈ రోజు యోగాడే సందర్బంగా.. మీ బంధువులకు, స్నేహితులకు పంపాల్సిన కోట్స్, మెసేజ్ లేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
యోగా అనేది ఒక వెలుగు లాంటిది. ఒక సారి వెలుగు వచ్చాక.. మళ్లీ చీకట్లోకి వెళ్లే అవకాశమే ఉండదు. మీ యోగాభ్యాసం సరిగ్గా ఉండే.. మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటాయి.. International Yoga Day.
సంతోషకరమైన ఆత్మ (Happy sou), తాజా మనస్సు (fresh mind), ఆరోగ్యకరమైన శరీరం.. ఈ మూడింటినీ ఒక్క యోగాతోనే సాధించొచ్చు.. Wishing you a very Happy Yoga Day.
యోగా అంటే ఆత్మ. ఆత్మ ద్వారా చేసే ప్రయాణం.. Happy World Yoga Festival!
మన దైనందిన జీవితంలో శరీరానికి అవసరమైన ఆనందం యోగా ద్వారానే సాధ్యమవుతుంది..Happy yoga day!
యోగా దినోత్సవం సందర్భంగా మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు.. మనలో ప్రతి ఒక్కరూ యోగా చేయడం సాధ్యమే. మంచి జీవితం కోసం యోగాను ప్రతి రోజూ చేద్దాం..
సూర్య నమస్కారాలు మనల్ని ఉత్తేజరుస్తాయి. అలాగే వెచ్చగా ఉంచుతాయి. చల్లగా ఉండే శీతాకాలంలో ఇది మిమ్మల్ని వెచ్చగా ఉంచుతుంది. ఈ యోగా దినోత్సవం సందర్భంగా.. ఇప్పటి నుంచి రోజూ యోగాను చేయండి. శక్తివంతంగా ఉండండి..
మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి.. అలసిన శరీరానికి శక్తిని అందించడానికి యోగా మంచి మార్గం. యోగా దినోత్సవ శుభాకాంక్షలు..
నీరసం, ఒత్తిడి, వ్యాధుల నుంచి బయటపడటానికి రోజూ యోగాను చేయండి. ... అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు.
దీర్ఘాయుష్షుతో జీవించాలన్నా.. ఆరోగ్యంగా బతకాలన్నా.. ప్రతి రోజూ యోగాను చేయండి. యోగా మీకు ఎలాంటి జబ్బులు రాకుండా కాపాడుతుంది. అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు.
ఆరోగ్యకరమైన మనస్సు.. ఆరోగ్యకరమైన శరీరంలోనే ఉంటుంది. ఈ రెండూ యోగాతోనే సాధ్యమవుతాయి.. అంత ర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా ఆరోగ్యకరమైన జీవితం గడిపేందుకు ఈ స్పెషల్ రోజున యోగాను ప్రారంభించండి. ఈ ప్రత్యేకమైన రోజున మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు..
."యోగా మనం వస్తువులను చూసే విధానాన్ని మార్చడమే కాదు, చూసే వ్యక్తినీ మారుస్తుంది." ― బి.కె.ఎస్. అయ్యంగార్
"యోగా అంటే ఆత్మ ద్వారా ఆత్మకు చేసే ప్రయాణం." - భగవద్గీత