- Home
- Life
- Yoga Day 2022: ఈఒక్క ఆసనంతో బెల్లీ ఫ్యాట్ తగ్గడమే కాదు.. వెన్ను నొప్పి, ఉదర సమస్యలు తగ్గి.. ముఖం మెరిసిపోతుంది
Yoga Day 2022: ఈఒక్క ఆసనంతో బెల్లీ ఫ్యాట్ తగ్గడమే కాదు.. వెన్ను నొప్పి, ఉదర సమస్యలు తగ్గి.. ముఖం మెరిసిపోతుంది
Yoga Day 2022: యోగాతో శరీరంలోని ప్రతి భాగం సజావుగా పనిచేస్తుంది. ఇది మానసిక సమస్యలను కూడా తొలగిస్తుంది. యోగా మనల్ని ఆరోగ్యం ఉంచుతుంది. అందుకే ఎంత బిజీగా ఉన్నా.. యోగాసనాలను తప్పకుండా వేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

halasana
మన జీవితాన్ని అందంగా మార్చడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుంది. రోజూ యోగా చేయడం వల్ల శారీరక ఆరోగ్యమే కాదు మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది. నిత్యం యోగా చేయడం వల్ల శరీరంలోని వివిధ భాగాలు ఆరోగ్యంగా ఉంటాయి. అయితే యోగాసనాలు చాలా రకాలు ఉంటాయి. అవన్నీ ఒక్కో విధంగా మనకు మేలు చేస్తాయి. ఇక ఇందులో నాగలి భంగిమ(halasan)ఒకటి. దీనిని నిత్యం చేయడం ద్వారా ఒకటి కాదు రెండు కాదు.. ఎన్నోఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఇది ముఖానికి గ్లో తీసుకురావడంతో పాటుగా..కడుపును ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. అలాగే మరెన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ 21 న జరుపుకుంటారు. ప్రతి మనిషి జీవితంలో యోగాను చేర్చడమే దీని ముఖ్య ఉద్దేశ్యం. యోగా అనేక భంగిమలలో.. హలాసనం భంగిమ కూడా ఉంది. దీని వల్ల అనేక ప్రయోజనాలున్నాయి.
glowing skin
ముఖంపై ప్రకాశాన్ని పెంచుతుంది, జుట్టు రాలిపోకుండా నివారిస్తుంది
ప్రతిరోజూ 10 నిమిషాల పాటు హలాసనం చేయడం వల్ల ముఖం కాంతివంతంగా తయారవుతుంది. దీనికి కారణం మంచి రక్త ప్రసరణ. హలాసనం చేయడం ద్వారా రక్తప్రసరణ మెరుగ్గా జరుగుతుంది. అలాగే ఇది చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. దీనివల్ల మొటిమలు (Acne), ముడతలు (Wrinkles) తొలగిపోతాయి. ఇది జుట్టు రాలే సమస్య నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.
వెన్ను నొప్పి తగ్గుతుంది:
హలాసనం వెన్ను, వెన్నెముక కండరాలను (Spinal muscles)బలోపేతం చేస్తుంది. ఇది వెన్నునొప్పి (Back pain)నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మీరు వెన్నునొప్పితో బాధపడుతున్నట్లయితే రెగ్యులర్ గా కొన్ని నిమిషాల పాటు హలాసనం వేయండి.
weight control
పొట్టను తగ్గించడంలో సహాయపడుతుంది
హలాసనం చేయడం ద్వారా బరువు నియంత్రణలోకి (Weight control) వస్తుంది. దీనితో పాటుగా కడుపులోని కొవ్వు కూడా రోజు రోజుకు కొద్ది కొద్దిగా కరిగిపోతుంది. అందుకే దీనిని క్రమం తప్పకుండా చేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
acidity
ఉదర రుగ్మతలను తొలగిస్తుంది
హలాసనం ఉదర సంబంధిత రుగ్మతలను తొలగించడంలో సహాయపడుతుంది. ఈ యోగ భంగిమ చేయడం వల్ల పొట్టలోని కండరాలు ఉత్తేజితమవుతాయి. దీని వల్ల పొట్ట, పేగులు సహా అనేక అవయవాలు ఉత్తేజితమవుతాయి. ఇది జీర్ణ ప్రక్రియను సరిగ్గా చేస్తుంది. గ్యాస్ (Gas), ఎసిడిటీ (Acidity), మలబద్ధకం (Constipation)సమస్యల నుంచి బయటపడేస్తుంది.