2022 లో గూగుల్ లో ఎక్కువ మంది వెతికిన ఆయుర్వేద మూలికలు ఇవే..
ఆయుర్వేద మూలికలు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తాయి. డయాబెటీస్ నుంచి అధిక రక్తపోటును తగ్గించడం వరకు ఎంతో సహాయపడతాయి. అయితే ఈ ఏడాదిలో ఎక్కువ మంది వెతికిన కొన్ని ఆయుర్వేద మూలికల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఆయుర్వేదంలో.. మూలికలు ఎన్నో వ్యాధులకు దివ్యౌషధంగా పరిగణించబడుతున్నాయి. కరోనా తర్వాత ప్రపంచవ్యాప్తంగా దేశీయ మూలికల వాడకం బాగా పెరిగిపోయింది. ఎందుకంటే ఇవి మన ఇమ్యూనిటీని పెంచడంతో పాటుగా ఎన్నో అనారోగ్య సమస్యలను నయం చేస్తాయి. అందుకే కొన్ని మూలికలను గూగుల్ లో ఎక్కువగా వెతికారు. గూగుల్ ఎక్కువగా వెతికిన కొన్ని ఆయుర్వేద మూలికల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
Image: Getty Images
దాల్చినచెక్క
ఈ సంవత్సరం గూగుల్ లో ఎక్కువగా వెతికిన దాంట్లో దాల్చినచెక్క ఒకటి. . దాల్చిన చెక్కను బరువు తగ్గడానికి, చర్మ సమస్యలను తగ్గించడానికి, ఇమ్యూనిటీని పెంచడానికి, జీర్ణ సమస్యలను తొలగించడానికి అంటే ఎన్నో సమస్యలను నయం చేయడానికి ఉపయోగిస్తారు. దాల్చిన చెక్క టీని తాగితే మధుమేహుల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
వేప
వేప ఆకులు, బెరడు అంటూ ప్రతి ఒక్కటీ మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. ఎన్నో సమస్యలకు వేప దివ్యౌషధంగా పనిచేస్తుంది. వేప ఆకుల రసం తాగడం వల్ల కడుపులోని పురుగులు చనిపోతాయి. ఈ ఆకుల వినియోగం వల్ల శరీరంపై దద్దుర్లు తగ్గిపోతాయి. దురదను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. ఈ ఆకులను గ్రైండ్ చేసి మీ ముఖానికి అప్లై చేస్తే మొటిమలు, మచ్చలు తగ్గిపోతాయి.
గ్రీన్ టీ ఆకులు
మ్యాచా గ్రీన్ టీ లేదా గ్రీన్ టీ ఆకులు బరువును తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. నిజానికి మ్యాచా గ్రీన్ టీ తాగడం వల్ల శరీరం నిర్విషీకరణ చెందుతుంది. అలాగే దీనిలో ఉండే యాంటీ బాక్టీరియల్ గుణాలు ఎన్నో చర్మ సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది.
Image: Getty Images
పసుపు
పసుపులో ఎన్నో దివ్య ఔషదగుణాలుంటాయి. పసుపులో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే మన శరీరాన్ని ఎన్నో వ్యాధుల నుంచి రక్షిస్తుంది. జలుబును, దగ్గును తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది. ఎముక సమస్యలను నివారించడానికి కూడా దీనిని ఉపయోగిస్తారు.
సోంపు
సోంపు నోటి ఫ్రెషనర్ గా ఉపయోగిస్తారు. వీటిని నమలడం వల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది. ఎన్నో కడుపునకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. సోంపు వాటర్ ను తాగితే.. సులువుగా బరువు తగ్గుతారు. సోంపు వికారాన్ని కూడా తగ్గిస్తుంది.
తిప్పతీగ
తిప్పతీగను ఎన్నో సమస్యలను తగ్గించడానికి ఉపయోగిస్తారు. దీనిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇది ఎముకలలో నొప్పి, వాపు సమస్యను తగ్గిస్తుంది. అంతేకాకుండా దీనిని జలుబు , ఫ్లూ ను తగ్గించడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగిస్తారు.
చామంతి టీ
చామంతిని కషాయం, టీ వంటి వాటిలో ఎక్కువగా ఉపయోగిస్తారు. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఒత్తిడిని తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. ఆందోళనను కూడా తగ్గిస్తాయి.