కళ్లు సరిగ్గా కనిపించాలంటే వీటికి దూరంగా ఉండండి..
కళ్లు సున్నితమైనవి. వీటిని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే అంత మంచిది. అయితే కొన్ని రకాల ఆహారాలను తింటే కళ్లు సరిగ్గా కనిపించవు. అలాంటి వాటికి ఎంత దూరంగా అంటే అంత మంచిది.

కళ్లు లేకుండా జీవితాన్ని ఊహించుకోవడం చాలా కష్టం.అందుకే కళ్లు చాలా అమూల్యమైనవి అంటుంటారు. అందుకే వీటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మనం తినే ప్రతి ఆహారం మన ఆరోగ్యానికి మంచిదో.. కాదో తెలుసుకోవాలి. లేదంటే ఆరోగ్యం దెబ్బతింటేంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కొన్నిరకాల ఆహారాలు కంటి చూపును తగ్గిస్తాయి. కంటి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. కంటి ఆరోగ్యం మన గుండె, ధమనుల ఆరోగ్యానికి సంబంధం ఉందని నిపుణులు చెబుతున్నారు. అందుకే గుండెకు హాని కలిగించే ఆహారాలకు దూరంగా ఉండాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
శీతల పానీయాలు
సోడా ఆధారిత పానీయాలు, ఎనర్జీ డ్రింక్స్, ఇతర తియ్యని పానీయాలన్నీ శీతల పానీయాల కిందికే వస్తాయి. ఈ పానీయాల్లో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వీటిని ఎక్కువగా తాగడం వల్ల టైప్ 2 డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది. డయాబెటీస్ పేషెంట్లు తరచుగా కంటి చూపుకు సంబంధించిన సమస్యను ఫేస్ చేస్తుంటారు. వీటి వల్ల మధుమేహుల కంటి చూపు తగ్గుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. బరువు కూడా పెరిగే ఛాన్స్ ఉంది.
సోడియం
సోడియం కంటెంట్ ఎక్కువగా ఆహారాలను తింటే.. రక్తపోటు పెరుగుతుంది. హాట్ డాగ్స్, క్యాన్డ్ ఫుడ్స్, బేకన్ వంటి ఆహారాలను రోజూ తినే అలవాటును మానుకోవాలి. ఎందుకంటే వీటిలో సోడియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తింటే బీపీ పెరిగి కంటి ఆరోగ్యం దెబ్బతింటుంది. అలాగ రక్తనాళాలను, రెటీనా కింద ద్రవం ఏర్పడుతుంది. అంతేకాదు రక్తప్రవాహానికి అడ్డంకి కలుగుతుంది. ఇది కంటి చూపును తగ్గిస్తుంది.
టాపింగ్స్, డ్రెస్సింగ్ లు
జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్ ను ఎక్కువగా టాపింగ్స్ లేదా డ్రెస్సింగ్ లతో డెకరేట్ చేస్తుంటారు. సలాడ్ డ్రెస్సింగ్, మయోన్నైస్, జెల్లీస్ లల్లో ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. అంతేకాదు ఇది కంటి ఆరోగ్యాన్ని పాడు చేయడమే కాకుండా కంటి చూపును కూడా తగ్గిస్తుంది.
ఆయిలీ ఫుడ్
ఏరకంగా చూసుకున్నా ఆయిలీ ఫుడ్ వల్ల అన్నీ నష్టాలే ఉంటాయి. అందుకే వీటికి దూరంగా ఉండాలని డాక్టర్లు చెప్తుంటారు. ఆయిలీ ఫుడ్ ను తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఊబకాయం ఎక్కువ అవుతుంది. బరువు బాగా పెరుగుతారు. మధుమేహం, గుండె జబ్బులు ప్రమాదం పెరుగుతుంది. ఈ వ్యాధులన్నీ కంటిని ప్రభావితం చేస్తాయి. ఆ తర్వాత కళ్లు మసక మసకగా కనిపిస్తాయి.
ప్రాసెస్ చేసిన మాంసం
ప్రాసెస్ చేసిన మాంసం మన ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. ఎందుకంటే దీనివల్ల కంటి ఆరోగ్యం దెబ్బతింటుంది. వీటిలో కొవ్వు, ఉప్పు పరిమాణం ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యంగా ఉండే ఒక వ్యక్తి రోజుకు 5 నుంచి 6 గ్రాముల ఉప్పును మాత్రమే తినాలి. డైట్ సాసేజ్ లు, ప్రాసెస్ చేసిన మాంసాలకు దూరంగా ఉంటేనే మీ కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. కళ్లు బాగా కనిపిస్తాయి.