- Home
- Life
- Worlds Slowest Cities ప్రపంచంలోనే నెమ్మదైన నగరాలు: ట్రాఫిక్ జామ్ లతో నిత్యం నరకం చూస్తున్న నగరాలేవంటే..
Worlds Slowest Cities ప్రపంచంలోనే నెమ్మదైన నగరాలు: ట్రాఫిక్ జామ్ లతో నిత్యం నరకం చూస్తున్న నగరాలేవంటే..
ఎవరైనా చాలా నెమ్మదిగా నడుస్తుంటే నత్త నడక అంటూ పోల్చుతుంటాం. విపరీతంగా ట్రాఫిక్ జామ్ అయితే కూడా ట్రాఫిక్ నత్తనడకన సాగుతోంది అంటుంటాం. ప్రస్తుతం అలాంటి అతి నెమ్మదైన నగరాల జాబితా రూపొందించింది ఒక సంస్థ. ప్రపంచంలో నెమ్మదైన నగరమేది? అనే చర్చ వచ్చింది. ఔను.. మీరు ఊహించినట్లుగానే, భారతదేశంలోని కొన్ని నగరాలు అందులో ఉన్నాయి. పూర్తి వివరాల విషయానికొస్తే..

ఆ నగరమే అతి నెమ్మది
ట్రాఫిక్ జామ్ ల కారణంగా చాలా నగరాలు స్లో సిటీలుగా పేరు తెచ్చుకున్నాయి. భారత్‌లో ట్రాఫిక్‌తో ఎక్కువగా వార్తల్లో నిలిచే నగరం బెంగళూరు. కానీ అది ప్రపంచంలోనే నెమ్మదైన నగరం మాత్రం కాదు. టామ్‌టామ్ ఇండెక్స్ ట్రాఫిక్ విడుదల చేసిన జాబితాలో బ్రాంక్విలా నగరం ప్రపంచంలోనే నెమ్మదైన నగరంగా పేరు తెచ్చుకుంది.
కోల్‌కతా సెకండ్ ప్లేస్
ఆశ్చర్యకరంగా ప్రపంచంలో ట్రాఫిక్‌తో సతమతమయ్యే సిటీల్లో కోల్‌కతా రెండో స్థానంలో ఉంది. భారత నగరాల్లో కోల్‌కతా మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ నిత్యం ట్రాఫిక్ జామ్ లతో జనం నరకం చవిచూస్తున్నారట. దాంతోపాటు అక్కడి జనానికి సివిక్ సెన్స్ తక్కువని సర్వే చెబుతోంది.
మనం ఊహించినట్టుగానే ట్రాఫిక్ విషయంలో బెంగళూరు కూడా ఈ జాబితాలో స్థానం సంపాదించుకుంది. కానీ బెంగళూరు ప్రపంచ స్లో సిటీల్లో 3వ స్థానంలో ఉంది. గడిచిన ఐదేళ్లలో ఈ నగరం విపరీతంగా విస్తరించడం, లక్షలకొద్దీ వాహనాలు రోడ్లపైకి రావడంతో ఈ పరిస్థతి ఏర్పడింది. అయితే దానికి తగ్గట్టుగా రోడ్ల విస్తరణ జరగకపోవడంతో ట్రాఫిక్ కారణంగా జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు. పూణే ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 4వ స్థానంలో ఉంది. పూణే భారత్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా ఉంది.