ఈ కూరగాయలు మన ఆరోగ్యానికి ఎంత మంచివో..!
మాంసాహారం కంటే శాకాహారమే ఆరోగ్యానికి ఎంతో మంచిది. కూరగాయలు, ఆకు కూరల నుంచి మన శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు అందుతాయి. ఈ కూరగాయలు ఇమ్యూనిటీ పవర్ ను కూడా పెంచుతాయి. దీంతో ఎన్నో రకాల అంటురోగాలు, ఇతర రోగాలు నయమవుతాయి.
ప్రతి ఏడాది అక్టోబర్ 1 నాడు ప్రపంచ శాఖాహార దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజు ముఖ్యోద్ధేశం శాకాహారం ప్రాముఖ్యతను తెలియజేయడం. కూరగాయలతోనే మన ఆరోగ్యం బాగుంటుంది. అందులోనూ మాంసాహారం కంటే శాకాహారమే ఆరోగ్యానికి ఎక్కువ మంచి చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. 1977లో ఉత్తర అమెరికా వెజిటేరియన్ సొసైటీ.. అక్టోబర్ 1ని ప్రపంచ శాఖాహార దినోత్సవాన్ని నిర్వహించి శాకాహారం ప్రాముఖ్యతను అందరికీ తెలియజేసింది.
Vegetables
శాకాహారం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. శాకాహారంతోనే శరీరానికి శక్తి అందుతుంది. చర్మం కూడా నిత్య యవ్వనంగా ఉంటుంది. ఆకుకూరలు, ఇతర కూరగాయల్లో ఉండే విటమిన్ సి, బీటా కెరోటిన్ మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఆకు కూరలను రోజూ తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కూరగాయలలో ఎన్నో రకాల పోషకాలు, విటమిన్లు, ఫైబర్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ గుండె జబ్బులు, డయాబెటీస్, క్యాన్సర్ వంటి వ్యాధులతో పోరాడటానికి సహాయపడతాయి.
బచ్చలికూర
బచ్చలికూర మన ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలుంటాయి. బచ్చలికూరను తినడం వల్ల శ్వాసకోస సమస్యలను నియంత్రణలో ఉంచడానికి సహాయపడతాయి. అలాగే రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. బచ్చలికూరలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కె, పొటాషియం, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. బచ్చలికూరలో ఐరన్ కంటెంట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. దీన్ని తినడం వల్ల రక్తహీనత సమస్య తగ్గిపోతుంది. యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు, ప్రోటీన్, ఫైబర్ కంటెంట్ ఉన్న బచ్చలికూర జీర్ణక్రియకు మంచిది. దీనిలో ఉండే పొటాషియం అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది.
క్యాబేజీ
క్యాబేజీ కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. క్యాబేజీలో విటమిన్ ఎ, విటమిన్ బి2, విటమిన్ సి లతో పాటుగా క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, ఐరన్, సోడియం, పొటాషియం, సల్ఫర్ కూడా పుష్కలంగా ఉంటాయి. క్యాబేజీని తినడం వల్ల జుట్టు రాలిపోవడం తగ్గి ఒత్తుగా, నల్లగా పెరుగుతంది. అలాగే కంటి చూపు కూడా మెరుగుపడుతుంది.
papaya
బొప్పాయి
బొప్పాయిలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. వీటిని తినడం వల్ల ఎన్నో రకాల చర్మ వ్యాధులు, ఇతర అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. బొప్పాయిని కూరగా చేసుకుని లేదా జ్యూస్ గా చేసుకుని కూడా తీసుకోవచ్చు. మధుమేహ వ్యాధిగ్రస్తులు బొప్పాయి జ్యూస్ ను తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
కాలీఫ్లవర్
కాలీఫ్లవర్ కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలో ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఐరన్, సోడియం, పొటాషియం, విటమిన్ ఎ, విటమిన్ సి, థయామిన్, రైబోఫ్లమైన్, కోలిన్, నికోటినిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఒమేగా -3 ఫ్యాటీ ఆమ్లాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి.
బెండకాయ
బెండకాయలో ఎన్నో రకాల పోషకాలుంటాయి. వీటిని తినడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. రెగ్యులర్ గా బెండకాయను తినడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి.
టమాటాలు
టమాటాలు రోగ నిరోధక శక్తిని పెంచడం నుంచి బరువు తగ్గడం వరకు ఎన్నో అనారోగ్య సమస్యలు నయమవుతాయి. వీటిలో ప్రోటీన్, క్యాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ ఎ, థయామిన్, రిబోఫ్లేవిన్, విటమిన్ సి,విటమిన్ కె పుష్కలంగా ఉంటాయి. టమోటాలు తినడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది. నరాలు బలంగా తయారవుతాయి. ఇది రక్తహీనతను నివారించడానికి కూడా సహాయపడుతుంది. టమాటాలు చర్మ సంరక్షణగా కూడా ఉపయోగపడుతుంది. ఇదది ఎన్నో చర్మ వ్యాధులను తగ్గిస్తుంది.
క్యారెట్
క్యారెట్లలో ఎన్నో రకాల ఔషదగుణాలుంటాయి. దీనిలో కళ్లను ఆరోగ్యంగా ఉంచే విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. క్యారెట్లలో విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ బి6, బయోటిన్, పొటాషియం, ఫైబర్ వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. క్యారెట్ జ్యూస్ ను తరచుగా తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు కూడా తగ్గుతాయి. వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది.