MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • ప్రపంచంలోనే అతి పొడవైన పాము ఇండియాదే.. ఏదో తెలుసా..?

ప్రపంచంలోనే అతి పొడవైన పాము ఇండియాదే.. ఏదో తెలుసా..?

King Cobra : ప్రపంచంలోనే అత్యంత పొడవైన విషసర్పం ఇండియాదే అట. ఇది ఏకంగా 18 నుండి 20 అడుగుల పొడవు ఉంటుందట. ఇంతకూ ఈ పాము ఏది..? దీని గురించి ఆసక్తికర విషయాలేంటి తెలుసుకుందాం. 

2 Min read
Author : Arun Kumar P
| Updated : May 12 2026, 12:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అతి పెద్ద విషసర్పం ఇదే..
Image Credit : Gemini AI

అతి పెద్ద విషసర్పం ఇదే..

World Longest Venomous : సాధారణంగా చిన్నచిన్న పాములు కనిపిస్తేనే భయపడిపోతాం.. అదే ఐదారు అడుగుల పొడవుండే నాగుపాములు వంటివాటిని చూస్తేనే ప్రాణం పోయినంత పని అవుతుంది. అలాంటిది 18 నుండి 20 అడుగుల పొడవుండే పాములను చూస్తే పరిస్థితి ఏంటి.. అక్కడే గుండె ఆగిపోయినంత పని అవుతుంది. మరి ఇంత పొడవైన పాములు ఉంటాయా..? ప్రపంచంలో అతి పొడవైన పాము ఏది..? ఇలాంటి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
20 అడుగుల ఇండియన్ స్నేక్...
Image Credit : stockPhoto

20 అడుగుల ఇండియన్ స్నేక్...

ప్రపంచంలోనే అతి పొడవైన విషసర్పాలు కింగ్ కోబ్రాలు. వీటిని ఇండియాలో రాచనాగు అని అంటారు. ఇది దాదాపు 18 నుండి 20 అడుగులు అంటే 5 నుండి 6 మీటర్ల పొడవు ఉంటాయి. ఇవి ప్రధానంగా ఇండియాలో కనిపిస్తుంటాయి. చైనాలో కూడా కొన్నిప్రాంతాల్లో కింగ్ కోబ్రాలు ఉంటాయి.

కింగ్ కోబ్రాలు దట్టమైన అడవుల్లో జనావాసాలకు దూరంగా ఉంటాయి. అయితే మనుషులు, ఏవైనా జంతువులకు ఎదురుపడితే బెదిరిపోయి ప్రమాదకరంగా మారిపోతాయి. ఏకంగా సగం శరీరాన్ని గాల్లోకి లేపి పడగవిప్పి భయపెడుతుంటాయి. చాలా వేగంగా కదులుతూ హటాత్తుగా దాడికి పాల్పడతాయి.

35
కింగ్ కోబ్రా పాములనే తినేస్తుందా..?
Image Credit : stockPhoto

కింగ్ కోబ్రా పాములనే తినేస్తుందా..?

కింగ్ కోబ్రాలను ''ఓఫియోఫాగస్'' అంటారు... అంటే ఇవి ఇతర పాములను అహారంగా తీసుకుంటాయి. సాధారణంగా కోబ్రాలు నాగుపాములు, కొండచిలువలను అహారంగా తీసుకుంటాయి... కొన్నిసార్లు చిన్నచిన్న కోబ్రాలను కూడా తింటాయి. అందుకే కింగ్ కోబ్రాలు ఉండే ప్రాంతాల్లో ఇతర పాములు కనిపించవు.

45
గూడు కట్టుకునే ఏకైక పాము ఇదే...
Image Credit : stockPhoto

గూడు కట్టుకునే ఏకైక పాము ఇదే...

సాధారణంగా పాములు బొరియల్లో నివాసాన్ని ఏర్పర్చుకుంటాయి... అక్కడే సంతానోత్పత్తి చేస్తుంటాయి. కానీ కింగ్ కోబ్రాలు అలాకాదు... ఇవి సంతానోత్పత్తి కోసం గూడు కట్టుకుంటాయి. ప్రపంచంలో గూడు కట్టుకునే ఏకైన పాము కింగ్ కోబ్రానే.

ఎండిన ఆకులు, కొమ్మలను సేకరించి మెత్తగా ఉండేలా ఆడ కోబ్రా గూడు కట్టుకుటుంది. ఇందులో ఒకేసారి 15 నుండి 50 వరకు గుడ్లు పెడుతుంది... ఇవి పొదిగేవరకు అంటే దాదాపు 75 నుండి 100 రోజుల వరకు కాపలా కాస్తుంది... ఈ సమయంలో ఇది అహారం తీసుకోకుండా ఉంటుంది. అయితే గుడ్ల నుండి పాముపిల్లలు బయటకు వచ్చాక వాటితో కలిసి ఆడ కోబ్రా గూడును వీడుతుంది.

55
కోబ్రా విషం అత్యంత ప్రమాదకరం..
Image Credit : stockPhoto

కోబ్రా విషం అత్యంత ప్రమాదకరం..

కింగ్ కోబ్రా అత్యంత విషపూరితమైనది... ఇది కాటు వేసిన కొద్దిసేపట్లోనే మనిషికి మరణం సంభవిస్తుంది. ఇది కాటువేస్తే విషం శరీరంలోకి చేరి నరాలపై పనిచేస్తుంది (Neurotxins)…అలాగే శ్వాసకోశ వైఫల్యానికి దారితీస్తుంది. కింగ్ కోబ్రా కాటువేశాక వెంటనే చికిత్స అందకుంటే 50 నుండి 60 శాతం చనిపోయే అవకాశాలుంటాయి. దీన్ని బట్టే ఈ పాము విషం ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకోవచ్చు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Kova Sweet: పాలు కాచే పనిలేకుండా మిల్క్ పౌడర్‌తో ఈజీగా కోవాలు చేసేయండిలా
Recommended image2
Diamond Ring: అమ్మాయిల మనసు దోచే లైట్ వెయిట్ డైమండ్ రింగ్స్
Recommended image3
ఈ పండు గుజ్జుతో ఫేస్ ప్యాక్ రోజూ వేశారంటే వారంలో ముఖానికి మెరుపు ఖాయం
Related Stories
Recommended image1
Snakes : మీ ఇంటి దరిదాపుల్లోకి కూడా పాములు రాకూడదంటే.. ఈ సింపుల్ టిప్స్ ఫాలోకండి
Recommended image2
Snakes : పాము కనిపించగానే ఏం చేయాలో కాదు... ఏం చేయకూడదో తెలుసా..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved