MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Life
  • Snakes : పాము కనిపించగానే ఏం చేయాలో కాదు... ఏం చేయకూడదో తెలుసా..?

Snakes : పాము కనిపించగానే ఏం చేయాలో కాదు... ఏం చేయకూడదో తెలుసా..?

మీరు పామును చూడగానే ఏం చేస్తారు…?  భయంతో వణికిపోయి తప్పులు చేస్తారు. అవే పాముకాటుకు కారణం అవుతాయి. కాబట్టి పాము కనిపించగానే ఏం చేయాలో కాదు ఏం చేయకూడదో తెలుసుకొండి. 

2 Min read
Author : Arun Kumar P
Published : May 07 2026, 12:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పాము నుండి సురక్షితంగా తప్పించుకునే మార్గాలివే..
Image Credit : Gemini AI

పాము నుండి సురక్షితంగా తప్పించుకునే మార్గాలివే..

Snakes : ఒక్కసారిగా పామును చూడగానే ఎవ్వరైనా భయపడిపోతారు.. ఆ కంగారులో తప్పులు చేస్తారు. మన యాక్షన్ బట్టి పాము రియాక్షన్ ఉంటుంది... మనం దానికి హాని తలపెడితే అదికూడా మనపై దాడికి యత్నిస్తుంది... కాటు వేస్తుంది. పాముకాటుకు గురికాకుండా సురక్షితంగా తప్పించుకునే మార్గాలివే...

సాధారణంగా విషసర్పాలు వాటికవే దాడి చేయవు. వాటిని బెదిరించినప్పుడు లేదా దాడికి ప్రయత్నించినప్పుడు తప్పించుకునే దారి లేనప్పుడే కాటేస్తాయి. అందుకే పాము కనిపిస్తే ఏం చేయాలో తెలుసుకోవడం ఎంత ముఖ్యమో, ఏం చేయకూడదో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పాముని కంగారుపడకండి, చంపడానికి ప్రయత్నించకండి
Image Credit : AI Image

పాముని కంగారుపడకండి, చంపడానికి ప్రయత్నించకండి

చాలామంది చేసే పెద్ద తప్పు పామును చూడగానే కంగారు పడటమే. పామును చూడగానే హడలెత్తిపోయి హఠాత్తుగా కదిలితే పాము భయపడి ఆత్మరక్షణ కోసం దాడి చేస్తుంది. బదులుగా ప్రశాంతంగా ఉండి, నెమ్మదిగా వెనక్కి వెళ్లండి. పాములు మనుషులను చూసి కాదు, ప్రమాదాన్ని గ్రహించి స్పందిస్తాయి.

పామును చంపడానికి ప్రయత్నించడం చాలా ప్రమాదకరం. పాముకాట్లకు ఇది ఒక ప్రధాన కారణం. శిక్షణ పొందిన నిపుణులు కూడా అవసరమైతే తప్ప పాముతో నేరుగా తలపడరు. దాడి చేస్తే అది ఆత్మరక్షణ కోసం కాటేయొచ్చు.

Related Articles

Related image1
Snakes : తాగవని తెలిసినా పాములకు పాలు ఎందుకు పోస్తారు..? ఆ కల్చర్ ఎలా వచ్చింది..?
Related image2
Snakes : మీ ఇంటి దరిదాపుల్లోకి కూడా పాములు రాకూడదంటే.. ఈ సింపుల్ టిప్స్ ఫాలోకండి
35
పామును పట్టుకోడానికి ట్రై చేయొద్దు
Image Credit : Getty

పామును పట్టుకోడానికి ట్రై చేయొద్దు

పాము నెమ్మదిగా పాకుతున్నా, చిన్నదిగా ఉన్నా లేదా హానిచేయనిదిగా కనిపించినా దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించడం పెద్ద తప్పు. చాలా కాట్లు పాములను పట్టుకునే ప్రయత్నంలోనే జరుగుతాయి. ఈ పనిని ఎప్పుడూ శిక్షణ పొందిన రెస్క్యూ టీమ్‌లకు వదిలేయండి.

ఒక పాము తాను చిక్కుకుపోయానని భావిస్తే, దాడి చేసే అవకాశం ఎక్కువ. దాని చుట్టూ చేరడం లేదా అది వెళ్లే దారిని అడ్డుకోవడం చేయొద్దు. అది సహజంగా వెళ్లిపోవడానికి దారి వదలండి. 

పాము చుట్టూ జనం గుమిగూడితే దానికి ఒత్తిడి పెరిగి ప్రమాదం పెరుగుతుంది. పెద్దగా అరవడం, శబ్దాలు చేయడం లేదా దాన్ని భయపెట్టాలని చూడటం వంటివి చేస్తే అది రెచ్చిపోతుంది. పిల్లల్ని, పెంపుడు జంతువుల్ని వెంటనే దూరం తీసుకెళ్లండి.

45
పాము కాటేస్తే ఏం చేయాలి..?
Image Credit : AI Generated

పాము కాటేస్తే ఏం చేయాలి..?

కొంతమంది కిరోసిన్, పెట్రోల్ పోయడం లేదా నిప్పు పెట్టి పామును తరిమేయాలని చూస్తారు. ఇది ప్రమాదకరం కావడమే కాక, పర్యావరణానికి కూడా హానికరం. ఇది సమస్యను పరిష్కరించకపోగా, మరింత తీవ్రం చేస్తుంది.

ఒకవేళ పాము కాటు వేస్తే గాటు పెట్టడం, నోటితో విషం పీల్చడం, లేదా కట్టు కట్టడం వంటి పాత పద్ధతులు పాటించొద్దు. ఇవి మేలు కన్నా ఎక్కువ కీడు చేస్తాయి. బదులుగా వెంటనే వైద్య సహాయం తీసుకోండి.

55
పామును చూడగానే ఈ జాగ్రత్తలు పాటించండి
Image Credit : AI Genertaed

పామును చూడగానే ఈ జాగ్రత్తలు పాటించండి

తప్పులు చేయకుండా ఉండటం ఎంత ముఖ్యమో, సరైన పద్ధతి పాటించడం కూడా అంతే ముఖ్యం. పాము కనిపించగానే సురక్షిత దూరం పాటించండి. హఠాత్తుగా వెనక్కి తిరగకుండా నెమ్మదిగా దూరం జరగండి. స్థానిక అటవీ శాఖ లేదా స్నేక్ రెస్క్యూ సేవలకు కాల్ చేయండి. నిపుణులు వచ్చేవరకు ఆ ప్రాంతాన్ని ఖాళీగా ఉంచండి. కాటు వేస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లండి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
జీవనశైలి
ఆరోగ్యం
ఏషియానెట్ న్యూస్
చిట్కాలు మరియు ఉపాయాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Best Time to Workouts : ఉదయం వర్కౌట్స్ చేయడం మంచిదా? లేక సాయంత్రమా?
Recommended image2
Black Raisins: నానబెట్టిన నల్ల ఎండు ద్రాక్ష తింటే ఎన్ని లాభాలో తెలుసా?
Recommended image3
Chanakya Niti: చాణక్యుడి ప్రకారం ఈ 5 విషయాలు భార్యాభర్తల మధ్య గొడవలకు కారణమవుతాయి!
Related Stories
Recommended image1
Snakes : తాగవని తెలిసినా పాములకు పాలు ఎందుకు పోస్తారు..? ఆ కల్చర్ ఎలా వచ్చింది..?
Recommended image2
Snakes : మీ ఇంటి దరిదాపుల్లోకి కూడా పాములు రాకూడదంటే.. ఈ సింపుల్ టిప్స్ ఫాలోకండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved