ఈ మసాలా దినుసులు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి
ఆయుర్వేదం ప్రకారం.. మనం ఆహారాల్లో ఉపయోగించే కొన్ని మసాలా దినుసులు ఎన్నో వ్యాధులను నయం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఇవి షుగర్ పేషెంట్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంటాయి.

Diabetes
ప్రతి ఏడాది ప్రపంచ వ్యప్తంగా నవంబర్ 14న నాడు మధుమేహ దినోత్సవాన్ని జరుపుకుంటారు. రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగే పరిస్థితినే డయాబెటిస్ అంటాం. ప్రపంచ వ్యాప్తంగా డయాబెటీస్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. మధుమేహాన్ని నియంత్రించడంలో ఆహారం ఎంతో సహాయపడుతుందని ఎన్నో అధ్యయనాలు వెల్లడించాయి ఆయుర్వేదం ప్రకారం.. ఆహారాల్లో మనం ఉపయోగించే చాలా మసాలా దినుసులకు ఎన్నో వ్యాధులను నయం చేసే సామర్థ్యం ఉంటుంది. అయితే కొన్ని మసాలా దినుసులు రక్తంలో చక్కెరను తగ్గించడానికి కూడా సహాయపడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు తినగలిగే ఆ మసాలా దినుసులేంటో తెలుసుకుందాం..
Image: Getty Images
దాల్చిన చెక్క
దాల్చినచెక్క ఎన్నో ఔషధ గుణాలతో కూడిన మసాలా దినుసుగా పని చేస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే దాల్చినచెక్క రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా సహాయపడుతుంది. ఇవి హృదయ సంబంధ వ్యాధులను నివారించడానికి కూడా సహాయపడతాయి.
fenugreek
మెంతులు
మెంతులు కూడా షుగర్ పేషెంట్లకు ప్రయోజకరంగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉండే మెంతులను మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఉత్తమ ఆహారాలలో ఒకటి. అవి ఆకలిని నియంత్రించడానికి కూడా సహాయపడతాయి. ప్రతిరోజూ ఉదయం పూట మెంతులను మరిగించిన నీటిని తాగడం వల్ల సులువుగా బరువు తగ్గుతారు. బెల్లీ ఫ్యాట్ కూడా కరుగుతుంది.
చియా గింజలు, అవిసె గింజలు
చియా విత్తనాలు, అవిసె గింజల్లో ఎన్నో రకాల విటమిన్లు, ప్రోటీన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఫైబర్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. తక్కువ జీర్ణమయ్యే కార్బోహైడ్రేట్లు సమృద్ధిగా ఉండే చియా విత్తనాలు, అవిసె గింజలు కూడా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.
అల్లం
భారతీయ వంటకాల్లో అల్లం ఖచ్చితంగా ఉంటుంది. నిజానికి అల్లం మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. అల్లంలో జింజెరోల్స్, షోగోల్స్ అని పిలువబడే సమ్మేళనాలు ఉంటాయి. ఈ అల్లం జీవక్రియను వేగవంతం చేస్తుంది. మధుమేహాన్ని నియంత్రిస్తుంది. వేగంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
పసుపు
షుగర్ పేషెంట్లకు పసుపు మెడిసిన్స్ తో సమానం. పసుపుకు కర్కుమిన్ అనే రసాయనం ద్వారా ఆ రంగు వస్తుంది. ఇది ఎన్నో వ్యాధులను వదిలించుకోవడానికి సహాయపడుతుందని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి కూడా సహాయపడతాయని పరిశోధకులు తెలుపుతున్నారు. పసుపు రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.