World bee day: తేనే టీగలు లేకపోతే మనం ఏమయ్యే వాళ్లమో తెలుసా.?
2025 ప్రపంచ తేనెటీగల దినోత్సవం భూమిపై జీవనానికి తేనెటీగల ప్రాముఖ్యతను గుర్తుచేస్తుంది. పరాగసంపర్కం మొదలు జీవవైవిధ్యాన్ని కాపాడటం వరకు తేనెటీగలు ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేశాయో ఇప్పుడు తెలుసుకుందాం.

పరాగసంపర్క శక్తి
మనం తినే 75% పంటలను తేనెటీగలు పరాగసంపర్కం చేయడం వల్లే పండుతున్నాయి. పండ్లు, కూరగాయలు, గింజలు మన టేబుల్‌లకు చేరేలా చూస్తాయి. తేనెటీగలు లేకపోతే ప్రపంచ ఆహార భద్రత ప్రమాదంలో పడుతుంది.
జీవవైవిధ్యం పెంపు
అడవి మొక్కలను పరాగసంపర్కం చేయడం ద్వారా, తేనెటీగలు విభిన్న పర్యావరణ వ్యవస్థలను కాపాడటానికి సహాయపడతాయి. ఇది లెక్కలేనన్ని ఇతర జాతుల ఆవాసాలకు మద్దతు ఇస్తుంది, ప్రకృతిని సమతుల్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
జీవనోపాధికి మద్దతు
మిలియన్ల మంది ఆదాయం కోసం తేనెటీగలపై ఆధారపడి ఉన్నారు - తేనెటీగల పెంపకందారులు, రైతులు, సౌందర్య ఉత్పత్తుల ఉత్పత్తిదారులు, తేనె విక్రయించే వారు ఇలా ఎంతో మందికి తేనే టీగలు జీవనోపాధిని అందిస్తాయి.
పంట దిగుబడి పెంపు
తేనెటీగల పరాగసంపర్కం ఉన్న పంటలు తరచుగా ఎక్కువ, మెరుగైన నాణ్యత గల ఉత్పత్తులను ఇస్తాయి. ఇది రైతులు లాభాలను పెంచుకోవడానికి, స్థానిక సమాజాలకు పోషకాహారాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
సహజ ఆవాసాల రక్షణ
తేనెటీగలు ఆరోగ్యకరమైన వాతావరణంలో వృద్ధి చెందుతుంటాయి. వాటి ఉనికి కారణంగా అడవులు, గడ్డి భూములు, పర్యావరణ వ్యవస్థలకు కీలకమైన అడవి పూల పరిరక్షణను ఎంతగానో తోడ్పడుతాయి.
సహజ నివారణలు
తేనెటీగలు తేనె, ప్రొపోలిస్, రాయల్ జెల్లీని సృష్టిస్తాయి. వీటిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. దీంతో వీటిని వైద్యం కోసం కూడా ఉపయోగిస్తుంటారు.
పర్యావరణ సూచికలుగా
తేనెటీగల ఆరోగ్యం పర్యావరణ నాణ్యతను ప్రతిబింబిస్తుంది. తేనెటీగల క్షీణత కాలుష్యం, ఆవాస నష్టం లేదా పురుగుమందుల అతిగా ఉపయోగించడాన్ని సూచిస్తుంది. కాబట్టి మనిషి మనుగడ ఉండాలంటే తేనే టీగలు ఉనికి కచ్చితంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.