womens night routine లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువుండాలా? అయితే పడుకునే ముందు ఇలా చేయండి!
రాత్రి పడుకునే ముందు అమ్మాయిలు కొన్ని పనులు చేస్తే అంతా శుభం కలుగుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఆ సంతోషం, శ్రేయస్సు దక్కాలంటే ఇవి తప్పనిసరిగా పాటించమంటోంది.

ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆశీస్సులు
హిందూ మతంలో లక్ష్మీదేవిని సంపద, శ్రేయస్సులకు దేవతగా భావిస్తారు. ప్రస్తుత కాలంలో డబ్బు ప్రతి వ్యక్తికి చాలా అవసరం. కాబట్టి ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి ఆశీస్సులు పొందాలని కోరుకుంటారు. దీని కోసం చాలా విధాలుగా లక్ష్మీదేవిలా ఉండటానికి ప్రయత్నిస్తారు. లక్ష్మీదేవి ఉండే ఇంట్లో ఎప్పుడూ సానుకూల శక్తి ఉంటుంది. ఆ ఇంట్లో సంపద, శాంతి, సంతోషం ఉంటాయి. జ్యోతిష్యం, వాస్తు శాస్త్రంలో స్త్రీలు రాత్రి పడుకునే ముందు కొన్ని విషయాలు పాటించాలని చెప్పారు. వాటిని ప్రతిరోజూ చేస్తే లక్ష్మీదేవి ఆశీస్సులు ఇంట్లో నిలుస్తాయని నమ్ముతారు.
ఇష్ట దైవాన్ని ప్రార్థించండి:
స్త్రీలు రాత్రి పడుకునే ముందు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కుని కాసేపు తమ ఇష్ట దైవాన్ని ప్రార్థించాలి. అంతా శుభం కలగాలని కోరుకోవాలి. ఆ తర్వాతే నిద్రకు ఉపక్రమించాలి.
పూజ గదిలో దీపం వెలిగించండి:
సనాతన ధర్మం ప్రకారం స్త్రీలను ఇంట్లో లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. కాబట్టి రాత్రి పడుకునే ముందు పూజ గదిలో దీపం వెలిగించాలి. ఏ ఇంట్లో దీపం వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. అంతేకాదు డబ్బుకు లోటు ఉండదు.
ఇది కూడా చదవండి: ఏంటి బెడ్ రూమ్ లో మొక్కలు పెట్టాలా? భార్యాభర్తలు తప్పక చదవండి..!!
కర్పూరం వెలిగించండి:
స్త్రీలు రాత్రి పడుకునే ముందు పడకగదితో సహా ఇల్లంతా కర్పూరం వెలిగించి ఆ పొగను వ్యాపింపజేయాలి. దీనితో రెండు లవంగాలు కూడా కలుపుకోవచ్చు. కర్పూరం పొగ ఇంట్లో ఉండే ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. పడక గదిలో కర్పూరం వెలిగించడం వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి ప్రేమ పెరుగుతుంది. అంతేకాదు శ్రేయస్సు వస్తుంది.
ఇది కూడా చదవండి: ఎప్పుడూ డబ్బు కష్టాలా? మీరు చేసిన చిన్న తప్పే కారణం
ఆవనూనె దీపం:
రాత్రి నిద్రపోయే ముందు ఇంటి ఆడపడుచు దక్షిణ దిక్కులో ఆవనూనె దీపం వెలిగించాలి. దక్షిణ దిక్కును పూర్వీకుల దిక్కుగా భావిస్తారు. ఈ దిక్కులో దీపం వెలిగిస్తే మీ పూర్వీకుల ఆశీస్సులు మీకు లభిస్తాయి. ఇది కాకుండా ఈ దిక్కులో ఒక బల్బును పెట్టవచ్చు. సాయంత్రం దాన్ని వెలిగించాలి. అలాగే ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఈ దీపం వెలిగిస్తే ఇంట్లో సంతోషం, శ్రేయస్సు పెరుగుతాయి.