Snake Venom: పాము కాటేసిన పండ్లు, కూరగాయలు తింటే చనిపోతారా? వాటిల్లో విషం ఉంటుందా?
Snake Venom: పాము అంటే భయపడనివారు ఎవరూ ఉండరు. పాము కాటేస్తే మనిషి ప్రాణానికి ప్రమాదం అనే విషయం అందరికీ తెలుసు. కానీ, పాము కాటేసిన పండ్లు, కూరగాయలు తింటే కూడా మనుషులు చనిపోతారా?

snake..
పాము ఎంత ప్రమాదకరమైన జంతువో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. పాము కరిస్తే..మనిషి వెంటనే చనిపోతాడనే భయం అందరిలోనూ ఉంటుంది. ముఖ్యంగా పల్లెటూరిలో ఉండేవారికి ఈ పాముల బెడద చాలా ఎక్కువగా ఉంటుంది. పాములు పొలాల్లో , తోటల్లో చాలా ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. అలాంటి సమయంలో అవి.. పండ్లు, కూరగాయలను కాటు వేస్తే..? వాటిని మనుషులు తింటే చనిపోతారా? నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం....
నిపుణులు ఏం చెబుతున్నారు..?
చాలా మంది ఈ విషయంలో పొరపడుతూ ఉంటారు. ఏవైనా పండ్లు లేదా కూరగాయలపై రెండు గాట్లు కనిపిస్తే.. పాము కరిచిందని భయపడతారు. అందులో విషం ఉంటుందని.. తినడానికి సంకోచిస్తారు. కానీ... పాములు శాకాహారులు కావు. అవి ఆకులు, పండ్లు, కూరగాయలు పొరపాటున కూడా తినవు. అందు వల్ల పాములు పండ్లు, కూరగాయలను కాటు వేసి.. అందులో విషం ఎక్కే అవకాశాలు తక్కువ. వాటి కోరలు ఈ పండ్లు, కాయలను కొరికేవిధంగా ఉండవు.
ఒకేవేళ, పాము ఏదైనా పండుకు విషం ఎక్కించినా, ఆ పండును తినడం వల్ల మనిషి చనిపోయే అవకాశాలు కూడా చాలా తక్కువ. పాము విషం రక్తంలో ప్రవేశించినప్పుడు మాత్రమే అది ప్రమాదకరంగా మారుతుంది. మనం ఈ విషాన్ని పండు ద్వారా తిన్నప్పుడు, అది కడుపులోకి చేరుకొని, అక్కడి బలమైన ఆమ్లాలు విషాన్ని విచ్ఛిన్నం చేస్తాయి.
పాయిజన్ కీ, వెనమ్ కీ తేడా ఏంటి?
పాము విషం అనేది పాయిజన్ (విషం), కానీ వెనమ్ (విషం) కాదు. వెనమ్ నేరుగా రక్తప్రవాహంలోకి ప్రవేశించినప్పుడు మాత్రమే ప్రభావం చూపుతుంది. ఒకవేళ అది కడుపులోకి ప్రవేశించి, నోరు లేదా జీర్ణనాళంలో దెబ్బతినకపోతే, కడుపులోని ఆమ్లం (HCL) దానిని ప్రోటీన్ల వలె జీర్ణం చేస్తుంది. అందువల్ల, ఈ వెనమ్ ఎటువంటి ప్రభావం చూపదు.
అంతేకాదు, పాములు సాధారణంగా ఎలుకలు, కప్పలు మనుషులపై మాత్రమే దాడి చేస్తాయి. అవి కూరగాయలను ఎప్పుడూ కాటు వేయవు. ఒకవేళ మీరు కొన్న పండ్లు, కూరగాయలపై పాము గాటు ఉన్నట్లు మీకు అనుమానం కలిగితే.. వాటిని శుభ్రంగా కడిగి, ఉడికించి తినడం వల్ల ఎలాంటి సమస్య ఉండదు.

