Wall Art: ఈ ఒక్క వాల్ హ్యాంగింగ్‌తో ఇంటి లుక్ నెక్స్ట్ లెవెల్
life Jun 07 2026
Author: Nandini Arava Image Credits:Pinterest
Telugu
ప్రీమియం, స్టైలిష్ లుక్
మీ ఇంటి డెకరేషన్ కోసం వేలకు వేలు ఖర్చు చేయాల్సిన పని లేదు. జస్ట్ రూ.500 ఉంటే చాలు. మీ లివింగ్ రూమ్, బెడ్‌రూంకు ప్రీమియం, స్టైలిష్ లుక్ ఇవ్వొచ్చు.
Image credits: pinterest
Telugu
మాక్రేమ్ వాల్ హ్యాంగింగ్
మోడరన్ ఇంటీరియర్ ఇష్టపడేవారికి మాక్రేమ్ వాల్ హ్యాంగింగ్ బెస్ట్ ఆప్షన్. కాటన్ దారాలతో చేతితో అల్లిన ఈ డెకరేషన్ పీస్ గోడలకు సాఫ్ట్, ఎలిగెంట్ లుక్ ఇస్తుంది.
Image credits: pinterest
Telugu
మండల వాల్ టేపస్ట్రీ
తక్కువ బడ్జెట్‌లో గోడల్ని అందంగా మార్చడానికి ఈ మండల డిజైన్ టేపస్ట్రీ.. ఒక అద్భుతం. ఖాళీగా ఉన్న పెద్ద గోడను కూడా అందంగా మార్చేస్తుంది. క్రియేటివ్ వాతావరణాన్ని తలపిస్తుంది.
Image credits: pinterest
Telugu
డ్రీమ్ క్యాచర్ వాల్ డెకార్
మీ బెడ్‌రూమ్‌కు కాస్త క్రియేటివ్, ఎస్తెటిక్ లుక్ ఇవ్వాలనుకుంటే డ్రీమ్ క్యాచర్ చాలా బాగుంటుంది. రంగురంగుల దారాలు, పూసలు, ఈకలతో అలంకరించిన ఈ హ్యాంగింగ్ ఐటమ్ చాలా అందంగా కనిపిస్తుంది.
Image credits: AI
Telugu
ఆర్టిఫిషియల్ ఫ్లోరల్ వాల్ హ్యాంగింగ్
ఈ పూల వాల్ హ్యాంగింగ్స్ ఇంటికి ఫ్రెష్ నెస్ ఇస్తుంది. ఆర్టిఫిషియల్ పూలతో చేసిన ఈ డెకరేషన్ ఐటమ్స్ ఎక్కువ కాలం పాడవకుండా ఉంటాయి. తక్కువ మెయింటెనెన్స్‌తో కూడా అద్భుతంగా కనిపిస్తాయి.
Image credits: Gemini AI
Telugu
మిర్రర్ వాల్ హ్యాంగింగ్
చిన్న చిన్న అద్దాలతో చేసిన వాల్ హ్యాంగింగ్స్ గదిని ప్రకాశవంతంగా ఉంచేలా చేస్తుంది. గుండ్రని లేదా పువ్వుల ఆకారంలో ఉండే మిర్రర్ హ్యాంగింగ్స్ తక్కువ ధరలోనే అద్భుతమైన లుక్ ఇస్తాయి.
Image credits: Pinterest
Telugu
మెటల్ లీఫ్ వాల్ ఆర్ట్
ఆకుల ఆకారంలో ఉండే మెటల్ వాల్ ఆర్ట్ ఇప్పుడు చాలా ట్రెండ్‌లో ఉంది. గోల్డెన్, బ్లాక్ లేదా కాపర్ ఫినిషింగ్‌లో ఉండే ఈ ఐటమ్స్ ఏ ఖాళీ గోడనైనా అందంగా మార్చేస్తాయి.