MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • River: ఒక్కో నది ఒక్కో రంగులో ఎందుకు ఉంటుంది? ఏ రంగు నీరు తాగడం మంచిదో తెలుసా?

River: ఒక్కో నది ఒక్కో రంగులో ఎందుకు ఉంటుంది? ఏ రంగు నీరు తాగడం మంచిదో తెలుసా?

River: మన దేశంలో చాలా నదులు ఉన్నాయి. కానీ, అన్ని నదులు ఒకే రంగులో ఎందుకు ఉండవు? ఏ రంగు నదిలో నీరు తాగడానికి పనికి వస్తాయి? ఏ రంగులో ఉన్న నదుల్లో నీరు తాగకూడదు..?

2 Min read
Author : ramya Sridhar
Published : Oct 16 2026, 04:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
నదులో నీటికి ఆ రంగు ఎలా వస్తుంది?
Image Credit : Asianet News

నదులో నీటికి ఆ రంగు ఎలా వస్తుంది?

నదులు అనగానే మనకు మంచి నీళ్లే గుర్తుకు వస్తాయి. కానీ, అన్ని నదుల్లో నీళ్లు ఒకే రంగులో ఉండవు. కొన్ని ఎరుపు, ఆకుపచ్చ, చివరకు పాల లాగా తెలుపు రంగులో కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. అసలు, అన్ని నదులు ఒకే రంగులో ఎందుకు ఉండవు? నదుల్లో నీటికి ఆ రంగు ఎలా వస్తుంది?

1.ఎర్రటి నదులు...

కొన్ని నదుల్లో నీరు రక్తంలా ఎర్రగా పారుతూ కనిపిస్తుంది. ఆ నీటికి ఆ రంగు రావడానికి ప్రధాన కారణం ఐరన్ ఖనిజాలు. కొన్ని ప్రాంతాల్లో నేలలు, రాళ్లలో ఇనుము ఎక్కువగా ఉంటుంది. వర్షాలు పడినప్పుడు లేదా నీరు ఆ నేలల గుండా ప్రవహించినప్పుడు ఈ పదార్థాలు నీటిలో కలుస్తాయి. ఇవి గాలిలోని ఆక్సీజన్ తో చర్య జరిపి తుప్పు లాంటి సమ్మేళనాలతో నీటిని ఎరుపు, నారింజ లేదా ఎర్రటి రంగులోకి మారుస్తాయి. ముఖ్యంగా వర్షాకాలంలో ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
2.ఆకు పచ్చ రంగు నదులు...
Image Credit : Asianet News

2.ఆకు పచ్చ రంగు నదులు...

నదులు ఆకుపచ్చగా కనిపించడానికి ముఖ్య కారణం ఆల్గే (నీటిలో పెరిగే సూక్ష్మజీవులు). వీటిలో ఉండే 'క్లోరోఫిల్' అనే వర్ణద్రవ్యం వల్ల నీరు ఆకుపచ్చగా మారుతుంది. నీటిలో పోషక పదార్థాలు ఎక్కువగా ఉండి, సూర్యకాంతి సరిగ్గా అందినప్పుడు ఇవి వేగంగా పెరుగుతాయి. ఇలా ఆకుపచ్చ గా ఉన్న నదుల్లోని నీటిని తాగడం సురక్షితం కాదు. ఎందుకంటే.. ఒక్కోసారి కొన్ని రకాల సైనోబ్యాక్టీరియా (నీలి-ఆకుపచ్చ ఆల్గే) కూడా ఆ నీటిలో పెరిగే అవకాశం ఉంది. ఇవి చాలా ప్రమాదం. అందుకే, ఈ నీటిని తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

33
3. పాలలాంటి తెల్లని నదులు
Image Credit : Asianet News

3. పాలలాంటి తెల్లని నదులు

హిమానీనదాల నుంచి వచ్చే నదుల్లోని నీళ్లు కొన్నిసార్లు పాలలాంటి తెల్లని లేదా నీలం-బూడిద రంగులో కనిపిస్తాయి. పర్వతాలపై మంచు కదులుతున్నప్పుడు రాళ్లను అరిగించడం వల్ల అతి సూక్ష్మమైన రాతి కణాలు ఏర్పడతాయి. వీటినే 'గ్లేసియల్ రాక్ ఫ్లోర్' అంటారు. ఈ సూక్ష్మ కణాలు నీటిలో కలిసి సూర్యకాంతిని వివిధ దిశల్లో వెదజల్లడం వల్ల నీరు అలా పాలు కారినట్లు మెరుస్తుంది.

నదులు రంగులు మార్చుకుంటాయా?

అన్ని నదులు ఎప్పుడూ ఒకే రంగులో కినిపంచవు. ఎందుకంటే, అవి కాలాన్ని బట్టి రంగులు మార్చుకుంటూ ఉంటాయి. వర్షాకాలంలో: నేల కోత వల్ల నీరు మట్టి రంగులోకి లేదా ఎర్రటి గోధుమ రంగులోకి మారుతుంది.

వేసవిలో: ప్రవాహం తగ్గిపోవడం, ఆల్గే పెరగడం వల్ల రంగు మారుతుంది.

కాలుష్యం పెరిగితే: మానవ తప్పిదాలు, పారిశ్రామిక వ్యర్థాల వల్ల కూడా నదుల సహజ రంగులు మారిపోతుంటాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Egg Myths : కోడిగుడ్ల గురించి మీరు నమ్ముతున్న 5 అబద్ధాలు ఇవే..
Recommended image2
Anklets: మీ పాదాలకే అందాన్ని తెచ్చే ఆక్సిడైజ్డ్ సిల్వర్ పట్టీలు.. !
Recommended image3
DMart Shopping: డీమార్ట్ లో రూ.5,000 బిల్లు రూ. 3000 కి తగ్గాలంటే ఈ చిన్న పని చేయండి!
Related Stories
Recommended image1
Whisky: విస్కీ అసలైన రుచి తెలియాలంటే ఎలా తాగాలి..? నీళ్లతోనా, ఐస్ తోనా..?
Recommended image2
Coffee Powder: కాఫీ పౌడర్ గడ్డకడుతోందా? ఇలా చేస్తే..కాఫీ పొడి ఎన్నిరోజులైనా ఫ్రెష్ గా ఉంటుంది..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved