రాత్రుళ్లు చిన్నారుల దుస్తులు ఆరుబయట ఆరబెట్టకూడదని ఎందుకు చెప్తారు? సైన్స్ కూడా ఇదే..
ఇంట్లో పెద్దలు ఎన్నో విషయాలు చెబుతుంటారు. అయితే వాటిలో కొన్ని చాదస్తంలా అనిపించినా సరిగ్గా ఆలోచిస్తే ప్రతీ విషయం వెనకాల ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుందని మీకు తెలుసా.? అలాంటి ఒక విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
హిందూ మతంలో ఎన్నో విశ్వాసాలు ఉంటాయి. సూర్యాస్తమయం తర్వాత కొన్ని రకాల పనులు చేయకూడదని చెబుతుంటారు. సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంట్లో ఊడ్చకూడదని, అప్పు ఇవ్వకూడదని, కొన్ని రకాల వస్తువులను దానం చేయకూడదని చెబుతుంటారు. రాత్రుళ్లు చిన్న పిల్లల దుస్తులను ఆరుబయట ఆరబెట్టకూడదని చెబుతుంటారు. ఇంతకీ పెద్దలు ఇలా ఎందుకు చెప్తారు.? దీని వెనకాల ఏమైనా సైంటిఫిక్ లాజిక్ ఉందా.? ఇప్పుడు తెలుసుకుందాం..
హిందూ మత ఆచారం, వాస్తు ప్రకారం రాత్రిపూట దుస్తులను ఎట్టి పరిస్థితుల్లో ఉతకకూడదని చెబుతుంటారు. అందులోనూ దుస్తులను అస్సలు ఆరబెట్టకూడదని అంటారు. ముఖ్యంగా నవజాత శిశువుల దుస్తులను ఆరుబయట పెట్టకూడదని చెబుతారు. సాయంత్రం 6 అయ్యిందంటే చాలు వెంటనే దుస్తులను తీసేయమని చెబుతారు. రాత్రిపూట పిల్లల బట్టలను బయట ఆరబెట్టకూడదని చెప్పడం వెనకాల మతపరమైన కారణాలతో పాటు సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి అవేంటంటే..
రాత్రుళ్లు బయటి వాతావరణంలో ప్రతికూల శక్తి ఎక్కువగా ఉంటుందని పండితులు చెబుతుంటారు. రాత్రుళ్లు ఆరుబయట దుస్తులు ఆరబెడితే నెగిటివ్ ఎనర్జీ దుస్తుల్లోకి ప్రవేశిస్తుందని చెబుతుంటారు. ఇది చిన్నారుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని అంటారు. చంద్రకాంతి పడడం వల్ల ప్రతికూల ఎనర్జీ పెరుగుతుందని పండితులు చెబుతుంటారు. రాత్రిపూట ఆరబెట్టిన దుస్తులపై నుంచి పక్షులు వెళ్తే కూడా ఇబ్బందులు కలుగుతాయని అంటున్నారు.
సైన్స్ పరంగా కూడా..
రాత్రిపూట బయట దుస్తులు ఆరబెట్టడం మంచిది కాదని సైన్స్ కూడా చెబుతోంది. సాధారణంగా ఎండ ఉన్నప్పటితో పోల్చితే రాత్రుళ్లు ఉతికిన దుస్తులు సరిగ్గా ఆరిపోవు. దుస్తుల్లో నిలిచిపోయే తేమ కారణంగా బ్యాక్టీరియా, ఫంగస్ పెరుగుతుంది. ఇది చిన్నారుల చర్మంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇది చర్మ ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది. అలాగే ఫంగస్ శ్వాస సంబంధిత సమస్యలకు దారి తీసే అవకాశం ఉంటుందని సైన్స్ చెబుతోంది.
అలాగే రాత్రుళ్లు ఆరుబయట దుస్తులను ఆరబెడితే అనేక రకాల కీటకాలు దుస్తులపై గుడ్లు పెట్టే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి దుస్తులను ధరించడం వల్ల స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది. చర్మంపై దురద, దద్దుర్లకు ఇది కారణమవుతుందని చెబుతున్నారు. వీటన్నింటి కారణాలతోనే రాత్రి పూట చిన్నారుల దుస్తులను బయట ఆరబెట్టకూడదని చెబుతుంటారు.