MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Silver: బంగారం కాకుండా, వెండి జ్యూవెలరీ కొనాలని అనుకుంటున్నారా? దేశంలో బెస్ట్ ప్లేస్ ఇదే..!

Silver: బంగారం కాకుండా, వెండి జ్యూవెలరీ కొనాలని అనుకుంటున్నారా? దేశంలో బెస్ట్ ప్లేస్ ఇదే..!

Silver: సిల్వర్ జ్యూవెలరీ ఈ మధ్య బాగా ట్రెండ్ అయ్యింది..మీకు కూడా సిల్వర్ జ్యూవెలరీ కొనాలని అనుకుంటున్నారా? మన దేశంలో బెస్ట్ ప్లేస్ ఏంటో తెలుసా? ఎక్కడ మీకు మంచి అందమైన డిజైన్లు తక్కువ ధరకు దొరుకుతాయో తెలుసా?

2 Min read
Author : ramya Sridhar
Published : Aug 05 2026, 03:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
వెండి ఆభరణాలు..
Image Credit : gemini

వెండి ఆభరణాలు..

బంగారం ధరలు రోజు రోజుకీ ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇలాంటి సమయంలో లక్ష రూపాయలు తీసుకొని గోల్డ్ షాప్ కి వెళ్తే..చిన్న ఇయర్ రింగ్స్ కూడా రావడం లేదు. అందుకే..బంగారం కొనడానికే భయపడుతున్నారు. అందుకే.. బంగారం ప్లేసులో వెండి కనడానికి ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఈ మధ్యకాలంలో సిల్వర్ జ్యూవెలరికీ చాలా డిమాండ్ కూడా పెరిగింది. చాలా షో రూమ్ లు కూడా స్పెషల్ గా సిల్వర్ జ్యూవెలరీ అమ్మడం మొదలుపెట్టాయి. అయితే, మీకు ఈ సిల్వర్ జ్యూవెలరీ చాలా తక్కువగా లభించాలి అంటే మాత్రం జైపూర్ వెళ్లాల్సిందే. మన దేశంలో తక్కువ ధరకు, క్వాలిటీ వెండి జ్యూవెలరీ జైపూర్ లో లభిస్తాయి.మరి, అక్కడే ఎందుకు తక్కువ ధరకు లభిస్తాయో ఇప్పుడు చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
జైపూర్ లో వెండి జ్యూవెలరీ ఎందుకు తక్కువ..?
Image Credit : Instagram

జైపూర్ లో వెండి జ్యూవెలరీ ఎందుకు తక్కువ..?

జైపూర్ లో వెండి ఆభరణాలు ఎక్కువగా తయారు చేస్తారు. వేల మంది కళాకారులు ఇక్కడ చేతితో కూడా నగలు తయారు చేస్తూ ఉంటారు. తయారీ కేంద్రాలు ఇక్కడే ఉండటం వల్ల.. మధ్యవర్తులు తక్కువగా ఉంటారు. కాబట్టి, ధర కూడా తక్కువగా లభిస్తుంది. అంతేకాదు, జైపూర్ లోని జోహారీ బజార్, ట్రిపోలియా బజార్, బాపు బజార్ వంటి మార్కెట్లలో హోల్ సేల్ వ్యాపారం పెద్ద ఎత్తున జరుగుతుంది. దేశంలోని అనేక నగరాల్లో జ్యూవెలరీ షాపులు ఇక్కడి నుంచే వెండి నగలను కొనుగోలు చేస్తూ ఉంటాయి. అందుకే, అక్కడికి వెళ్లి కొనడం వల్ల మనకు తక్కువ ధరకు లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

జైపూర్ లో సంప్రదాయ రాజస్థానీ డిజైన్ల నుంచి ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న డిజైన్ల వరకు అన్నీ లభిస్తాయి.అందరికీ నచ్చేలా ఈ డిజైన్లు ఉంటాయి. జైపూర్ లో కేవలం వెండి ఆభరణాలు మాత్రమే కాదు, స్టోన్ జ్యూవెలరీ కూడా చాలా ఎక్కువగా లభిస్తూ ఉంటాయి.

Related Articles

Related image1
Alcohol: మద్యం దుకాణాలకు Gen Z షాక్.. నాలుగేళ్లలో రూ.71లక్షల కోట్ల నష్టం తెచ్చారా?
Related image2
Tea: నెల రోజులు టీ తాగడం మానేస్తే శరీరంలో ఏం జరుగుతుంది?
33
నిజంగానే ఇక్కడ సిల్వర్ జ్యూవెలరీ చౌకగా దొరుకుతుందా?
Image Credit : chat gpt

నిజంగానే ఇక్కడ సిల్వర్ జ్యూవెలరీ చౌకగా దొరుకుతుందా?

నిజంగానే ఇక్కడ సిల్వర్ జ్యూవెలరీ చౌకగానే లభిస్తుంది. కానీ, కొన్ని విషయాలను మాత్రం కచ్చితంగా గుర్తుంచుకోవాలి. హోల్ సేల్ మార్కెట్ లో ధరలు తక్కువగా లభించే అవకాశం ఉంది. వెండి స్వచ్ఛత ఆధారంగా ధరలు మారే అవకాశం ఉంది. వెండి మార్కెట్ ధర రోజూ మారుతూ ఉంటుంది. మేకింగ్ ఛార్జీలు కూడా ఒక్కో షాపులో ఒక్కోలా ఉంటాయి. అందువల్ల.. ఇక్కడ నగలు కొనేముందు.. ఒకటికి రెండుసార్లు.. చెక్ చేసుకొని మరీ కొనుగోలు చేయడం మంచిది. ఒకే షాప్ లో కాకుండా, రెండు, మూడు దుకాణాల్లో చెక్ చేసుకొని కొంటే..బెటర్. ఎలా చూసుకున్నా.. మన దగ్గర కంటే.. అక్కడ మాత్రం తక్కువకే లభిస్తాయి.

ఏ మార్కెట్లు బెస్ట్? 

Johari Bazaar

జైపూర్‌లో అత్యంత ప్రసిద్ధ జ్యువెలరీ మార్కెట్. వెండి, బంగారం, రత్నాల ఆభరణాలు విస్తృతంగా లభిస్తాయి.

Tripolia Bazaar

సంప్రదాయ రాజస్థానీ వెండి నగలు, గాజులు, హ్యాండ్‌మేడ్ ఆభరణాలకు ప్రసిద్ధి.

Bapu Bazaar

బడ్జెట్‌లో మంచి డిజైన్లు, ఆక్సిడైజ్డ్ వెండి ఆభరణాలు కొనాలనుకునేవారికి అనువైన మార్కెట్.

కొనుగోలు చేసే ముందు గుర్తుంచుకోవాల్సిన విషయాలు 

925 Sterling Silver Hallmark ఉందో లేదో తప్పనిసరిగా చూడండి. బిల్లు తీసుకోవడం మర్చిపోవద్దు. వెండి బరువు, మేకింగ్ ఛార్జీలు వేర్వేరుగా అడిగి తెలుసుకోండి. హోల్‌సేల్ మార్కెట్లలో కొన్ని షాపుల్లో బేరం చేసే అవకాశం ఉంటుంది.

అయితే, జైపూర్‌లో వెండి నగలు ఎప్పుడూ  తక్కువ ధరకే లభిస్తాయి అని చెప్పలేం,  కానీ హోల్‌సేల్ మార్కెట్లు, తయారీదారుల వద్ద కొనుగోలు చేస్తే, అనేక సందర్భాల్లో ఇతర నగరాల రిటైల్ షోరూమ్‌ల కంటే తక్కువ ధరలో లభించే అవకాశం ఉంటుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
బంగారం
Latest Videos
Recommended Stories
Recommended image1
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Recommended image2
Alcohol: మద్యం దుకాణాలకు Gen Z షాక్.. నాలుగేళ్లలో రూ.71లక్షల కోట్ల నష్టం తెచ్చారా?
Recommended image3
Hair Growth: ఈ ఇంటి చిట్కాలతో జుట్టు వద్దన్నా పెరుగుతుంది!
Related Stories
Recommended image1
Alcohol: మద్యం దుకాణాలకు Gen Z షాక్.. నాలుగేళ్లలో రూ.71లక్షల కోట్ల నష్టం తెచ్చారా?
Recommended image2
Tea: నెల రోజులు టీ తాగడం మానేస్తే శరీరంలో ఏం జరుగుతుంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved