MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Bedroom: రాత్రి పడుకునేటప్పుడు బెడ్ రూమ్ డోర్ మూసేస్తే ఏమవుతుందో తెలుసా?

Bedroom: రాత్రి పడుకునేటప్పుడు బెడ్ రూమ్ డోర్ మూసేస్తే ఏమవుతుందో తెలుసా?

చాలామందికి రాత్రి పడుకునేటప్పుడు బెడ్‌రూమ్ డోర్ తెరిచే ఉంచే అలవాటు ఉంటుంది. కానీ దానివల్ల మీ నిద్ర, ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుందో మీకు తెలుసా? డోర్ మూసుకుని పడుకోవడం వల్ల కలిగే లాభాలేంటో, నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం.

1 Min read
Author : Kavitha G
Published : Apr 17 2026, 04:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బెడ్ రూమ్ డోర్ మూసి పడుకోవడం వల్ల కలిగే లాభాలు
Image Credit : Getty

బెడ్ రూమ్ డోర్ మూసి పడుకోవడం వల్ల కలిగే లాభాలు

మనం రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే రాత్రిపూట ప్రశాంతమైన నిద్ర చాలా ముఖ్యం. కానీ పడుకునేటప్పుడు గది వాతావరణం ఎలా ఉండాలనే దానిపై చాలామందికి సందేహాలుంటాయి. ముఖ్యంగా, డోర్ తెరిచి ఉంచాలా లేక మూసేయాలా? అనే ప్రశ్నకు నిపుణులు ఆసక్తికరమైన సమాధానాలు ఇస్తున్నారు. అవేంటో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మంచి నిద్ర కోసం..
Image Credit : Getty

మంచి నిద్ర కోసం..

నిద్రకు అనువైన వాతావరణం లేకపోతే చాలామందికి సరిగ్గా నిద్రపట్టదు. కొందరు పూర్తి చీకటిని ఇష్టపడితే, మరికొందరు నార్మల్ లైట్ వెలుతురులో పడుకుంటారు. కానీ మంచి నిద్ర, ఆరోగ్యం కోసం బెడ్‌రూమ్ డోర్ మూసి ఉంచడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

35
మెలటోనిన్ ఉత్పత్తి
Image Credit : stockPhoto

మెలటోనిన్ ఉత్పత్తి

చీకటిగా ఉన్న గదిలో 'మెలటోనిన్' (Melatonin) అనే హార్మోన్ బాగా విడుదలవుతుంది. ఇది మనం త్వరగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. డోర్ తెరిచి ఉంటే, బయటి వెలుతురు ఈ ప్రక్రియకు అడ్డుపడవచ్చు. 

45
శబ్ధాలు వినబడకుండా..
Image Credit : Getty

శబ్ధాలు వినబడకుండా..

అంతేకాదు హాల్‌లో ఇతరులు మాట్లాడే శబ్దం లేదా టీవీ సౌండ్ బెడ్‌రూమ్‌లోకి రాకుండా ఉండాలంటే డోర్ మూయడం మంచిది. ఇది ప్రశాంతమైన నిద్రకు సహాయపడుతుంది. అలాగే డోర్ మూసి ఉండటం వల్ల ఏసీ లేదా ఫ్యాన్ గాలి పూర్తిగా గదిలోనే ఉంటుంది. గదిలో సుమారు 18°C నుంచి 22°C మధ్యలో ఉష్ణోగ్రత ఉంటే మంచి నిద్ర వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

55
నిద్రకు భంగం కలగకుండా..
Image Credit : stockPhoto

నిద్రకు భంగం కలగకుండా..

సాధారణంగా పిల్లలు చిన్న చిన్న శబ్ధాలకే నిద్ర లేస్తుంటారు. కాబట్టి పిల్లలు పడుకున్నప్పుడు డోర్ మూయడం వల్ల ఇంట్లోని ఇతర శబ్దాలకు వారు పదేపదే మేల్కోకుండా ఉంటారు. అలాగే, పెంపుడు జంతువులు అర్ధరాత్రి గదిలోకి వచ్చి మీ నిద్రకు భంగం కలిగించకుండా నివారించవచ్చు.

ఒకవేళ మీ గదిలో కిటికీలు లేకపోయినా లేదా గాలి సరిగ్గా ప్రసరించని పరిస్థితి ఉన్నా, డోర్‌ను కొద్దిగా తెరిచి ఉంచవచ్చు. కానీ ప్రశాంతత, చీకటి కోసం మాత్రం డోర్ మూసేసి పడుకోవడమే ఆరోగ్యకరమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జీవనశైలి
ఆరోగ్యం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Dinner Mistakes: రాత్రి భోజనం విషయంలో 90 శాతం మంది చేసే 5 తప్పులు ఇవే!
Recommended image2
Maggi Masala: ఇంట్లోనే కేవలం పది నిమిషాల్లో మ్యాగీ మసాలా..ఎలా చేయాలో తెలుసా?
Recommended image3
Gold Necklaces: అరతులంలో అదిరిపోయే బంగారు నెక్లెస్ డిజైన్లు
Related Stories
Recommended image1
Biscuits: టాప్ 5 చెత్త బిస్కెట్లు ఇవే.. తిన్నారంటే ఈ సమస్యలు తప్పవు జాగ్రత్త!
Recommended image2
Parenting Tips: మీ పిల్లలు బూతులు మాట్లాడితే లైట్ తీసుకుంటున్నారా? ఇవి కచ్చితంగా తెలుసుకోండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved