క్రికెటర్లు ముఖానికి వైట్ క్రీమ్ ను ఎందుకు వేసుకుంటారో తెలుసా?
మీరు క్రికెట్ అభిమానా? అయితే మీరు క్రికెట్ల ముఖానికి వైట్ క్రీం ను గమనించే ఉంటారే.. ఎన్నో రోజులుగా క్రికెట్ చూస్తున్న మీకు అసలు క్రికెట్లు ముఖానికి వైట్ క్రీంను ఎందుకు వేసుకుంటారు. దాని వల్ల వారికి యూజ్ ఏంటి? అన్ని డౌట్లు ఎప్పుడైనా వచ్చాయా? తెలియదా? అయితే పదండి ఈ ఆర్టికల్ తో ఆ సీక్రేట్ ఏంటో తెలుసుకుందాం..
ఈ రోజు మ్యాచ్ అంటే దానికోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తుంటాం. మా వాళ్లే గెలవాలని, గెలుస్తారని పూజలు కూడా చేస్తుంటాం. ఇక మనలో చాలా మంది క్రికెట్ అయిపోయేవరకు టీవీ ముందును నుంచి అస్సలు పక్కకు జరగరు. ఇదంతా పక్కన పెడితే.. క్రికెట్ల ముఖానికి ఉన్న వైట్ క్రీం ను మీరెప్పుడైనా గమనించారా? గమనించే ఉంటారులే.. కానీ అదెందుకు వేసుకుంటారు? దానివల్ల ఏం ఉపయోగం? అన్న అనుమానాలు వచ్చాయా? చాలా మందికి వైట్ క్రీం గురించి డౌట్ వచ్చినా.. దాని గురించి మాత్రం పెద్దగా పట్టించుకోరు. ఈ ఆర్టికల్ తో క్రికెటర్లు ముఖానికి వేసుకునే వైట్ క్రీం గురించి రహస్యాన్ని తెలుసుకుందాం పదండి.
England Cricket Team
క్రికెటర్లు తమ ముఖానికి అప్లై చేసే వైట్ క్రీం జింక్ ఆక్సైడ్ తో తయారైన స్పెషల్ సన్ స్క్రీన్. ఇది సూర్యుని హానికరమైన యూవీఏ, యూవీబీ కిరణాల నుంచి ఆటగాళ్లను రక్షిస్తుంది. ఎందుకంటే క్రికెటర్లు గంటల తరబడి సూర్యరశ్మిలోనే ఉంటారు. దీనివల్ల వారి చర్మం దెబ్బతింటుంది. చర్మం దెబ్బతినకూడదనే ఆటగాళ్లు ఈ క్రీమ్ ను సున్నితమైన భాగాలకు ఉపయోగిస్తారు
జింక్ ఆక్సైడ్ తో తయారు చేసిన ఫిజికల్ సన్స్క్రీన్ చర్మ రక్షణ కోసం క్రికెటర్లు ఉపయోగించేదే వైట్ క్రీమ్. క్రికెటర్లు ఉపయోగించే శారీరక సన్ స్క్రీన్ లో జింక్ ఆక్సైడ్ ఉంటుంది. ఇది తెల్లని పొడి ఖనిజం. ఇది హానికరమైన సూర్య కిరణాల ప్రభావాన్ని తగ్గిస్తుంది. అందుకే దీన్ని ఎన్నో ఏండ్ల నుంచి ఉపయోగిస్తున్నారు.
జింక్ ఆక్సైడ్ వైట్ క్రీమ్ క్రికెటర్లు ముఖానికి అప్లై చేసే సాధారణ సన్ స్క్రీన్ అయితే కాదు. ఇది సాధారణ సన్ స్క్రీన్ కంటే అదనపు రక్షణను అందిస్తుంది. మనం రోజూ ఉపయోగించే సన్ స్క్రీన్ లు "కెమికల్ సన్ స్క్రీన్ లు". ఈ సన్ స్క్రీన్ లు శరీరంలోకి వెళతాయి. ఇవి మన చర్మాన్ని ఎక్కువ సేపు రక్షించలేవు. అందుకే ఇలాంటి క్రీములను క్రికెటర్లు వాడరు. అలాగే క్రికెటర్లు లేదా ఎండలో ఎక్కువసేపు ఉండేవారు వీటిని ఉపయోగించినా ఎలాంటి యూజ్ ఉండదు.
క్రికెటర్లు తమ ముఖానికి వైట్ క్రీం.. అదే సన్ స్క్రీన్ ను వేసుకోవడం ఫ్యాషనో, స్టైలో కాదన్న ముచ్చట మీకు ఇప్పటికే అర్థమైంది. ఇలాంటి వైట్ క్రీమ్ అప్లికేషన్ ముఖ్య ఉద్దేశ్యం సూర్యరశ్మి నుంచి చర్మాన్ని రక్షించడమే. మీకు తెలుసా సూర్యుని అతినీలలోహిత కిరణాలు చర్మ కణాలలోని డీఎన్ఎను దెబ్బతీస్తాయి. ఇలా కాకూడదనే క్రికెటర్లు ఈ వైట్ క్రీం ను పెట్టుకుంటారు.
యూవీఏ కిరణాలు మన చర్మం లోతైన పొరలోకి చొచ్చుకుపోతాయి. ఇది అకాల వృద్ధాప్యానికి కారణమవుతాయి. దీని ప్రభావం స్టార్టింగ్ లో కనిపించదు. అందుకే ఇది ఎంతో ప్రమాదకరమంటారు. ఇక యూవీబీ కిరణాలు మన చర్మం బయటి పొరను దెబ్బతీస్తాయి. దీంతో చర్మంపై మంట, ఎర్రని దద్దుర్లు ఏర్పడతాయి. కాగా క్రికెటర్లు గంటల తరబడి సూర్యరశ్మికి గురికావడం వల్ల వారికి యూవీ కిరణాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీని నుంచి వారు తమ చర్మాన్ని రక్షించడం చాలా అవసరం. ఇది చర్మాన్ని దెబ్బతీస్తుంది. ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో చర్మ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అందుకే క్రికెటర్లు ఇలాంటి ప్రమాదాలు జరగకూడదనే వైట్ క్రీం ను వేసుకుంటారు.