White Hair: ఈ రెండు ఆకులతో తెల్ల జుట్టు పూర్తిగా నల్లగా మారుతుంది..
White Hair: మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా చిన్నవయసులో తెల్లజుట్టు వస్తుంది. అయితే ఈ తెల్ల జుట్టును సహజ పద్దతుల్లో నల్లగా మార్చుకోవచ్చు.

ప్రస్తుత కాలంలో తెల్ల జుట్టు వృద్ధులకే కాదు చిన్నవయసు వారికి కూడా వస్తుంది. మారుతున్న జీవన శైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ఈ సమస్య తలెత్తుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఇక ఈ తెల్లజుట్టును నల్లగా మార్చడానికి చాలా మంది ఖరీదైన హెయిర్ ప్రొడక్స్ట్ ను ఉపయోగిస్తుంటారు. కానీ వీటిలో ఎన్నో హానికరమైన రసాయనాలు ఉంటాయి. ఇవి జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అందుకే వీలైనంత వరకు తెల్లజుట్టును నల్లగా మార్చడానికి సహజ పద్దతులనే ఉపయోగించుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
అయితే తెల్లజుట్టును నల్లగా మార్చడానికి తులసి ఆకులు (Basil leaves), కరివేపాకులు (curry leaves) ఎంతో సహాయపడతాయి. ఇందుకోసం వీటిని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
తులసి ఆకులను ఇలా యూజ్ చేయండి
తులసి ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి ఎంతో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం.. ముందుగా తులసి ఆకులను తీసుకోండి. అలాగే ఉసిరి కాయ లేదా దాన్ని ఆకులను అలాగే గుంటగలగర ఆకులను (Bhangraiya leaf ) తీసుకోండి. ఈ మూడు సమానంగా ఉండేట్టు చూసుకోవాలి. ఆ తర్వాత వీటిని బాగా గ్రైండ్ చేసి పేస్ట్ లా తయారుచేసుకోవాలి. ఈ పేస్ట్ ను జుట్టంతా అప్లై చేయాలి. ఇది జుట్టును నల్లగా మార్చడానికి ఎంతో సహాయపడుతుంది.
కరివేపాకు ఆకులను ఇలా ఉపయోగించండి
కరివేపాకులో బయో-యాక్టివ్ పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టుకు పుష్కలమైన పోషణను అందిస్తాయి. ఇది చిన్నవయసులోనే వచ్చే తెల్లజుట్టు సమస్యను తొలగిస్తుంది. ఇందుకోసం కరివేపాకు పేస్ట్ ను జుట్టుకు అప్లై చేసుకోవచ్చు. అలాగే మీరు జుట్టుకు రాసుకునే నూనెలో కూడా వీటిని కలపొచ్చు.
జుట్టును నల్లగా మార్చడంలో నిమ్మకాయ ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది
నిమ్మకాయలో ఉండే పదార్థాలు తెల్ల జుట్టును నల్లగా మార్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయనిన రుజువు చేయబడింది.
ఆయుర్వేదం ప్రకారం.. 15 మిల్లీలీటర్ల నిమ్మరసం తీసుకుని.. అందులో 20 గ్రాముల ఉసిరి పొడిని కలపాలి. ఈ రెండింటిని బాగా కలిపి పేస్ట్ లా తయారుచేసుకోవాలి. దీనిని జుట్టుకు అప్లై చేయాలి. గంట తర్వాత తలస్నానం చేయాలి. కొన్ని రోజుల పాటి ఈ పద్దతిని ఫాలో అయితే తెల్ల జుట్టు నల్లగా నిగనిగలాడుతుంది.