White Hair: వీటిని తింటే ఎలాంటి కలర్స్ వేసుకోకుండానే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది..
White Hair: తెల్ల జుట్టు ఒక సాధారణ సమస్యగా మారుతోంది. స్కూళ్లకు వెళ్ళే పిల్లల నుంచి మొదలు పెడితే.. యువత వరకూ ప్రతి ఒక్కరూ ఈ సమస్యతో బాధపడుతున్నారు. తెల్ల జుట్టును నల్లగా చేయడానికి మీరు ఎన్నో ప్రయత్నాలు చేసి ఉండొచ్చు. అయినా జుట్టు నల్ల బడని వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారికి ఈ చిట్కాలు ఎంతో మేలు చేస్తాయి.

వాస్తవానికి శరీరంలో కొన్ని పోషకాలు లేకపోవడం వల్ల జుట్టు తెల్లబడుతుంది. కాబట్టి మీ జుట్టును మళ్లీ నల్లగా మార్చడానికి ఏమేం తినాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
తెల్లజుట్టు సమస్యతో బాధపడేవారు తమ ఆహారంలో కొన్ని పోషకాలను చేర్చుకోవడం చాలా ముఖ్యం. తద్వారా మీ జుట్టు నల్లగా ఉంటుంది. చాలాసార్లు మీ శరీరానికి అవసరమైన పోషకాలు లభించవు, దీనివల్లే జుట్టు తెల్లగా మారడం ప్రారంభిస్తుంది. కాబట్టి పోషకాలు సమృద్ధిగా ఉండే ఆహారాన్ని తీసుకుంటే ఆటోమెటిక్ గా మీ తెల్ల జుట్టు నల్లగా మారుతుంది.
గుడ్డు (Egg): గుడ్డు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అంతేకాదు ఇది తెల్లజుట్టును నల్లగా మార్చుతుంది కూడా. ఎలా అంటే.. గుడ్లలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టును మెరుగుపరచడానికి మరియు తెల్ల జుట్టును వదిలించుకోవడానికి సహాయపడుతుంది. అందుకే మీ రోజు వారి ఆహారంలో గుడ్లను చేర్చుకోండి. ఆరోగ్యం కూడా బాగుంటుంది.
పెరుగు (Yogurt): పెరుగు తినడం వల్ల జుట్టు తెల్లబడదు. పెరుగులో అధిక మొత్తంలో విటమిన్ బి 12 ఉంటుంది. ఇది జుట్టును నల్లగా ఉంచడంలో సహాయపడుతుంది. కావాలనుకుంటే వేసవిలో లస్సీ తయారు చేసుకుని తీసుకోవడం వల్ల ఎక్కువ పోషణ అందుతుంది.
మెంతులు: మెంతులను ఆహారంలో చేర్చుకోవడం వల్ల తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. మెంతుల్లో ఐరన్ మరియు ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి జుట్టులో మెలనిన్ ఉత్పత్తి మొత్తాన్నిపెంచుతాయి. మెలనిన్ లోపించడం వల్లే వెంట్రుకలు త్వరగా తెల్లబడతాయి. కాబట్టి మీరు మెలనిన్ కలిగి ఉన్న పదార్థాలను తీసుకోవాలి.
ఆకుపచ్చ కూరగాయలు: ఆకుపచ్చ కూరగాయలు తినడం వల్ల కూడా తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. గ్రీన్ వెజిటేబుల్స్ లో విటమిన్ బి6, విటమిన్ బి 12 మరియు ఇతర పోషకాలు ఉంటాయి. ఇవి జుట్టును నల్లగా మార్చడంలో సహాయపడతాయి.