MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Washing Machine : వాషింగ్ మెషిన్ ఎక్కువ రోజులు పనిచేయాలంటే ఏం చేయాలి?

Washing Machine : వాషింగ్ మెషిన్ ఎక్కువ రోజులు పనిచేయాలంటే ఏం చేయాలి?

ఈ రోజుల్లో చాలా మంది వాషింగ్ మెషిన్లనే వాడుతున్నారు. చేతులతో బట్టలను ఉతికే కాలం పోయింది. అయితే వాషింగ్ మెషిన్ ఎక్కువ కాలం రావాలంటే మాత్రం ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే తొందరగా పాడైపోతుంది.

2 Min read
Author : Shivaleela Rajamoni
| Updated : Aug 14 2025, 12:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
 Washing Machine
Image Credit : our own

Washing Machine

ఈ బిజీలైఫ్ స్టైల్ లో చాలా మంది త్వరత్వరగా పనులను ముగించుకోవడానికి ఎన్నో ట్రిక్స్ ను గాడ్జెట్లను వాడుతున్నారు. నిజానికి ఇవి మన ఎన్నో పనులను సులభతరం చేస్తాయి. అలాగే మనకు శ్రమను తగ్గిస్తాయి. ఇలాంటి వాటిలో వాషింగ్ మెషిన్లు ఒకటి. చాలా మంది వాషింగ్ బట్టలు ఉతకడానికి వాషింగ్ మెషిన్లనే వాడుతున్నారు. వాషింగ్ మెషిన్లు ఉన్నవారు వారానికి ఒకటి రెండు సార్లు మాత్రమే దుస్తులను ఉతుకుతుంటారు. గంటలోనే ఎన్ని బట్టలైనా చాలా త్వరగా ఉతికేస్తుంది ఈ మెషిన్. అందుకే ఇది కూడా మన జీవితంలో ఒక ముఖ్యమైన వస్తువుగా మారిపోయింది. అయితే ఈ మెషిన్ ఎక్కువ కాలం పనిచేయాలంటే మాత్రం మీరు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలి. లేదంటే త్వరగా పాడైపోతుంది.

25
వాషింగ్ మెషిన్ దెబ్బతినకూడదంటే ఏం చేయాలి?
Image Credit : freepik

వాషింగ్ మెషిన్ దెబ్బతినకూడదంటే ఏం చేయాలి?

అది ఏ మెషిన్ అయినా సరే దెబ్బతినకుండా ఉండాలంటే మాత్రం దాని సామర్థ్యాన్ని బట్టే వాడాలి. చాలా మంది ఎన్ని దుస్తులు ఉంటే అన్నింటినీ వాషింగ్ మెషిన్ లో వేసేస్తుంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. వాషింగ్ మెషిన్ సామర్థ్యాన్ని బట్టి మాత్రమే దాన్ని ఉపయోగించాలి. మీకు వాషింగ్ మెషిన్ లో బట్టలు ఎక్కువగా వేస్తే మోటర్ ఎక్కువ శక్తిని ఉపయోగించాల్సి వస్తుంది. దీనివల్ల మోటర్ త్వరగా వేడెక్కుతుంది. దీనివల్ల అది తర్వగా పాడయ్యే అవకాశం ఉంది. అలాగే ఓవర్ లోడ్ అయ్యి యంత్రం డ్రమ్, బేరింగ్ దెబ్బతింటుంది. అలాగే మెషిన్ నుంచి వింత వింత సౌండ్స్ కూడా వస్తాయి.

35
 Washing Machine
Image Credit : google

Washing Machine

మనమందరం బట్టలను వాష్ చేయడానికి లిక్విడ్ లేదా డిటర్జెంట్లను వాడుతుంటాం. అయితే దీన్ని వాడినప్పుడల్లా కొలత విషయంలో కేర్ ఫుల్ గా ఉండాలి. మీరు గనుక డిటర్జెంట్ ను ఎక్కువగా వేస్తే మెషిన్ దెబ్బతింటుంది. డిటర్జెంట్ ను ఎక్కువగా వేయడం వల్ల మెషిన్ లోపలి భాగంలో డ్రమ్ములు, పైపులు సబ్బుతో పేరుకుపోతాయి. ఈ నిక్షేపాలు ఫ్యూచర్ లో యంత్ర భాగాలను దెబ్బతీస్తాయి.

45
 Washing Machine
Image Credit : Pixabay

Washing Machine

అలాగే చాలా సార్లు ఉతికిన బట్టలను తీయకుండా అలాగే మెషిన్ లోనే వదిలేస్తుంటారు. లేదా మర్చిపోతుంటారు. ఈ చిన్న పొరపాటు వల్ల వాషింగ్ మెషిన్ లైఫ్ టైం తగ్గుతుంది తెలుసా? దీనివల్ల మెషిన్ డోర్ మీద ఉన్న రబ్బర్ గ్యాస్కెట్ తేమ, అచ్చు వల్ల నల్లగా అవుతుంది. అందుకే బట్టలు ఉతికిన వెంటనే మెషిన్ లోనుంచి బయటకు తీయంది.

55
 Washing Machine
Image Credit : Pixabay

Washing Machine

అలాగే దుస్తులను వాషింగ్ మెషిన్ లో వేసే ముందు వాటిలో ఏదైనా నాణెం లేదా పిన్నీసులు లాంటివి ఉన్నాయేమో చెక్ చేయండి. దీనివల్ల వాష్ సైకిల్ టైంలో మెషిన్ డ్రమ్ ను తాకుతుంది. దీనివల్ల దానిపై గీతలు ఏర్పడతాయి. అలాగే అది దెబ్బతినొచ్చు. అలాగే ఈ వస్తువులు డ్రెయిన్ పంపులో ఇరుక్కుపోయి చెడిపోతాయి కూడా.

వాషింగ్ మెషిన్ శుభ్రంగా ఉండాలంటే ఏం చేయాలి?

వాషింగ్ మెషిన్ ను శుభ్రంగా ఉంచడం చాలా ముఖ్యం. ఇది శుభ్రంగా లేకపోవడం వల్ల అది తొందరగా పనిచేయకుండా పోతుంది. అందుకే నెలకోసారైనా మెషీన్ లో రెండు కప్పుల వెనిగర్, వేడినీళ్లు పోసి ఒక రౌండ్ ను తిప్పాలి. ఆ తర్వాత మెషిన్ ను మధ్యలోకి మరోసారి రన్ చేయండి. చివరగా ఒక కప్పు బేకింగ్ సోడా వేసి మరో 5 నిమిషాలు తిప్పండి. ఆ తర్వాత శుభ్రమైన నీళ్లను పోసి డ్రెయిన్ మోడ్లో పెట్టండి.

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
జీవనశైలి
మహిళలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Mint Plant: చిన్న కుండీలో గుత్తులుగుత్తులుగా పుదీనా పెంచండిలా
Recommended image2
Dandruff: తలలో చండ్రు ఎక్కువగా ఉందా? వీటితో వదిలించండి
Recommended image3
Rashmika Diet: రష్మికకు ఈ కూరలంటే అస్సలు నచ్చవు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved