- Home
- Life
- Migraine: మైగ్రేన్ ను తేలిగ్గా తీసిపారేయడానికి చిన్న సమస్య కాదు.. జాగ్రత్తగా ఉండకపోతే తిప్పలు తప్పవు జాగ్రత్త
Migraine: మైగ్రేన్ ను తేలిగ్గా తీసిపారేయడానికి చిన్న సమస్య కాదు.. జాగ్రత్తగా ఉండకపోతే తిప్పలు తప్పవు జాగ్రత్త
Migraine: మైగ్రేన్ నొప్పి ఎంత దారుణంగా ఉంటుందో దాన్ని అనుభవించేవారికి తెలుస్తుంది. ఈ నొప్పి పురుషులతో పోల్చితే మహిళలకే ఎక్కువగా వస్తుంది.

తలనొప్పి ఒక సాధారణ సమస్య అయినప్పటికీ కొన్నిసార్లు ఈ నొప్పిని భరించడం కష్టమవుతుంది. తలనొప్పి సాధారణం అయినప్పటికీ సగం తలనొప్పే భరించలేని నొప్పిని కలిగిస్తుంది. దీన్నే మైగ్రేన్ అంటారు. మైగ్రేన్ తలనొప్పికి అనేక కారణాలు ఉన్నాయి. ఒత్తిడి, వాతావరణంలో మార్పులు, ఆందోళన, గాయం, ఆందోళన, నిద్రలేమి మైగ్రేన్లకు కారణమవుతాయి. ఈ రోజుల్లో మైగ్రేన్ సమస్య పెరిగింది. మహిళలలే దీని బారినన ఎక్కువగా పడుతున్నారని సర్వేలు చెబుతున్నాయి.
మైగ్రేన్ సమస్యను తేలిగ్గా తీసిపారేస్తారు.. దాదాపుగా 20 శాతం మంది మహిళలు దీని బాధితులుగా మారారని పలు సర్వేలు వ్యక్తం చేస్తున్నాయి. 2015 డేటా ప్రకారం 19 శాతం మంది మహిళలు, 9 శాతం మంది పురుషులు ఈ సమస్యతో బాధపడుతున్నారు. సమస్య పెరిగినా మహిళలు మాత్రం మైగ్రేన్ సమస్యను సీరియస్ గా తీసుకోవడం లేదట.
migraine
మైగ్రేన్ వ్యాధికి కారణమేమిటి?: చెడు ఆహారపు అలవాట్లు, లైఫ్ స్టైల్, ఒత్తిడి, వాతావరణంలో మార్పులు, హార్మోన్ల మార్పులు, అతిగా నిద్రపోవడం, తక్కువ నిద్ర వంటివి మైగ్రేన్ కు ప్రధాన కారణాలు. నిరాశ, ఆందోళన, ఒత్తిడి వంటి మానసిక అనారోగ్యాలు మైగ్రేన్లకు కారణాలు. భారతదేశంలో మహిళల్లో మైగ్రేన్ రోగుల సంఖ్య పురుషుల కంటే మూడు రెట్లు ఎక్కువ అని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
మైగ్రేన్ లో కనిపించే లక్షణాలు:
మైగ్రేన్ సమస్యతో బాధపడే వ్యక్తులు నిరంతరం తలనొప్పితో బాధపడతారు. వీరికి తల పగిలిపోయినట్లుగా అనిపిస్తుంది.
మీరు ఉదయం నిద్రలేచిన వెంటనే తలలో బరువుగా పెద్ద బరువు ఉన్నట్టుగా ఉంటుంది. తీవ్రమైన నొప్పిని కలుగుతుంది.
తల ఒక భాగంలోనే నిరంతరం నొప్పి ఉంటుంది.
మైగ్రేన్ సమస్య ఉన్నవారికి వాంతులు కూడా అవుతాయి.
కళ్లలో నొప్పి కలుగుతుంది. కన్నుబరువుగా అనిపిస్తుంది. కళ్లు తెరవడానికి కూడా ఇబ్బంది పడతారు.
ప్రకాశవంతమైన కాంతిని చూడటం సాధ్యం కాదు. పెద్ద పెద్ద సౌండ్ ను కూడా వినడానికి ఇష్టపడరు.
ఈ నొప్పితో వీరికి నిద్రకూడా సరిగ్గా ఉండదు.
తరచుగా మూత్రం వస్తున్నట్టుగా అనిపిస్తుంది.
రుతుస్రావం సమయంలో హార్మోన్ల మార్పుల కారణంగా మహిళల్లో మైగ్రేన్ల ప్రమాదం కూడా పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాక ఒత్తిడి, నిరాశ, ఆందోళన పరిస్థితులు మైగ్రేన్ కు దారితీస్తాయి. మహిళలు మైగ్రేన్ ను ఒక సాధారణ వ్యాధిగా భావిస్తారు. ఈ కారణంగానే వారు నొప్పి మాత్రలు వేసుకుంటారు. నొప్పి మాత్ర తాత్కాలికంగానే నొప్పిని తగ్గిస్తుంది. అయితే, చాలా కాలం వరకు దాని నుండి ఉపశమనం ఉండదు. ఎంత నిర్లక్ష్యం చేస్తే సమస్య అంత ఎక్కువగా ఉంటుంది.
మైగ్రేన్ నొప్పికి చికిత్స:
యోగా, ఆక్యుప్రెషర్, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మైగ్రేన్ నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది.
ప్రకాశవంతమైన కాంతి మరియు లౌడ్ స్పీకర్ల వాడకాన్ని పూర్తిగా తగ్గించాలి. సమతుల్య దినచర్యను పాటించాలి.
సరైన టైం కు నిద్రపోయి.. టైంకి నిద్రలేవాలి.
ఎక్కువ సేపు ఆకలితో ఉండకూడదు. మీరు మైగ్రేన్ నొప్పిని ఎదుర్కొంటున్నప్పుడు ఫోన్ లేదా ల్యాప్ టాప్ ఉపయోగించవద్దు. ఇది సమస్యను మరింత పెంచుతుంది.