MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Life
  • Scary Dreams: ఎత్తైన ప్రదేశం నుంచి కింద పడిపోయినట్లు, పళ్లు ఊడిపోయినట్లు.. పీడకలలు వస్తున్నాయా?

Scary Dreams: ఎత్తైన ప్రదేశం నుంచి కింద పడిపోయినట్లు, పళ్లు ఊడిపోయినట్లు.. పీడకలలు వస్తున్నాయా?

Scary Dreams: మనకు చెడు కలలు లేదా భయంకరమైన కలలు, పీడ కలలు వచ్చినప్పుడు చాలా భయపడిపోతాం. అలాంటి కలలు నిజంగానే మనకు జరగబోయే చెడుకు సంకేతమా? ఆ కలల అర్థమేంటి? 

2 Min read
Author : ramya Sridhar
Published : May 06 2026, 12:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Dream
Image Credit : Chat Gpt

Dream

రాత్రిపూట నిద్రలో కలలు రావడం చాలా సహజం. కానీ, మనకు వచ్చే కలలన్నీ మంచివే అవ్వాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడు కొన్ని పీడకలలు కూడా వస్తూనే ఉంటాయి. చెడు కలలు వచ్చినప్పుడు వెంటనే నిద్రలో ఉలిక్కిపడి లేస్తాం. ఆ కలలు వచ్చిన తర్వాత... మళ్లీ నిద్ర కూడా పట్టదు. అంతలా భయపడిపోతాం. కానీ, ఈ కలలు నిజంగానే మంచివి కావా? వాటి అర్థం ఏంటి స్వప్న శాస్త్రం ఏం చెబుతోంది..?

ఎత్తైన ప్రదేశం నుంచి కింద పడిపోతున్నట్లు కల వస్తే...

మీరు ఎదైనా కొండ లేదా భవనం లాంటి ఎత్తైన ప్రదేశం నుంచి పడిపోతున్నట్లు కలలు వచ్చాయా? ఇలాంటి కలలు చాలా భయపెడతాయి. కానీ... మనం ఏదైనా విషయంలో ఎక్కువగా ఆందోళన చెందుతున్నప్పుడు ఇలాంటి కలలు వస్తాయి. ఇలాంటి కల వచ్చినప్పుడు భయపడకుండా.. మీరు ఏ విషయంలో ఎక్కువగా ఆందోళన పడుతున్నారో ఆలోచించాలి. ఆ ఆందోళనను తగ్గించుకునే ప్రయత్నం చేయాలి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
పళ్లు ఊడిపోయినట్లు కల వస్తే...
Image Credit : others

పళ్లు ఊడిపోయినట్లు కల వస్తే...

వయసు మళ్లినప్పుడు పళ్లు ఊడిపోవడం చాలా సహజం. కానీ, పళ్లు ఊడిపోయినట్లు కలలు రావడం మాత్రం చాలా మందిని భయపెడుతుంది. వీటిని చాలా మంది చెడు కలలుగా పరిగణిస్తారు. ఈ కలలు కూడా ఆందోళన, డెంటిస్ట్ గురించి భయం కారణంగా వస్తూ ఉంటాయి.

పరీక్షలో ఫెయిల్ అయినట్లు కల వస్తే...

ఏమీ చదవకుండా పరీక్షకు కూర్చోవడం, ఎగ్జామ్ హాల్ లోకి వెళ్లలేకపోవడం, ప్రశ్నాపత్రంలో తెలియని ప్రశ్నలు రావడం ఇవన్నీ చాలా భయంకరమైన కలలుగా పరిగణిస్తారు. ఈ కలల వెనక కూడా అర్థం ఉంది. పరీక్షలు రాసే ఏజ్ దాటి వచ్చాం.. ఇప్పుడు ఇలాంటి కలలు రావడం ఏంటి? అని చాలా మంది అనుకుంటారు. కానీ.. ఆఫీసులో, వ్యాపారంలో ఉన్న డెడ్ లైన్స్ కి ఈ కల సంకేతంగా పరిగణిస్తారు.

Related Articles

Related image1
Hair Fall Dream: జుట్టు రాలిపోతున్నట్లు కల వచ్చిందా? దాని అర్థం ఏంటో తెలుసా?
Related image2
Alcohol: మందు బాటిల్ ఒక్కసారి తెరిస్తే...ఎన్ని రోజుల్లో తాగేయాలో తెలుసా?
33
 విచిత్రమైన వ్యక్తి కనిపించడం...
Image Credit : Getty

విచిత్రమైన వ్యక్తి కనిపించడం...

నిద్రపోతున్నప్పుడు గదిలో ఎవరో విచిత్రమైన వ్యక్తి తిరుగుతున్నట్లుగా అనిపించడం, ఛాతిలో బరువు అనిపించడం కూడా చెడు కలలు గా పరిగణిస్తారు. ఇలాంటి కలలు కూడా మనలో ఉన్న భయానికి సంకేతంగా పరిగణిస్తారు.

ఎవరైనా వెంట పడుతున్నట్లు కల వస్తే...

కొన్నిసార్లు కలలో ఎవరైనా మన వెంటపడుతున్నట్లు అనిపిస్తే.. దీనిని కూడా పీడకలగా పరిగణిస్తారు. ఈ కలలు మనలో ఉన్న మానసిక ఒత్తిడిని తప్పించుకోవడానికి ఒక రిహార్సల్ లా పని చేస్తాయి. ఒత్తిడి తగ్గించుకుంటే ఇలాంటి కలలు రాకుండా ఉంటాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Coin Necklace: పట్టుచీరల మీదకు అదిరిపోయే కాసుల నక్లెస్ డిజైన్లు
Recommended image2
Vastu Tips: ఇంట్లో ఈ ఐదు వస్తువులు ఉంటే... లక్ష్మీదేవి నడుచుకుంటూ ఇంటికి వస్తుంది..!
Recommended image3
Sweet Potato: చిలగడదుంప తినడం వల్ల కలిగే 6 అద్భుతమైన ప్రయోజనాలు ఇవే!
Related Stories
Recommended image1
Hair Fall Dream: జుట్టు రాలిపోతున్నట్లు కల వచ్చిందా? దాని అర్థం ఏంటో తెలుసా?
Recommended image2
Alcohol: మందు బాటిల్ ఒక్కసారి తెరిస్తే...ఎన్ని రోజుల్లో తాగేయాలో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved