MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Cloves: దిండు కింద లవంగాలు పెట్టుకొని పడుకుంటే ఏమౌతుంది?

Cloves: దిండు కింద లవంగాలు పెట్టుకొని పడుకుంటే ఏమౌతుంది?

Cloves: లవంగాలను మనం వంటలో రెగ్యులర్ గా వాడుతూనే ఉంటాం. మరి, ఈ లవంగాలను ఒక చిన్న మూటలో కట్టి దిండు కింద పెట్టుకొని పడుకుంటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా?

2 Min read
Author : ramya Sridhar
Published : Oct 12 2026, 05:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
లవంగాలతో మ్యాజిక్..
Image Credit : Gemini ai

లవంగాలతో మ్యాజిక్..

మన వంటిల్లో కచ్చితంగా ఉండే మసాలా దినుసుల్లో లవంగాలు ఒకటి. మనం చాలా రకాల కూరల్లోనూ, బిర్యానీల్లోనూ లవంగాలు వాడుతూ ఉంటాం. ఈ లవంగాలు కేవలం వంటలో రుచి పెంచడానికి మాత్రమే కాదు.. చాలా రకాల ఆరోగ్య సమస్యలను తగ్గించడంలోనూ దివ్య ఔషధంగా పనిచేస్తుంది. మరి, అలాంటి లవంగాలను ఒక చిన్న మూటగా కట్టి.. దిండు కింద పెట్టుకొని నిద్రపోతే ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయో ఇప్పుడు చూద్దాం....

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
1.జలుబు నుంచి ఉపశమనం...
Image Credit : Asianet News

1.జలుబు నుంచి ఉపశమనం...

వర్షాకాలం, చలికాలం వచ్చింది అంటే చాలు... చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు జలుబు, దగ్గు వంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. వాటికి మందులు వాడాల్సిన అవసరం లేకుండా.. ఈ లవంగాలతో చెక్ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. లవంగాలను చిన్న మూటలో కట్టి... దిండు కింద పెట్టుకొని నిద్రపోతే.. జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. ఉదయానికి ఆ జలుబు తీవ్రత తగ్గుతుంది.

2.గాఢమైన నిద్ర, మానసిక ప్రశాంతత...

లవంగాలలో 'యూజినాల్' (Eugenol) అనే ప్రత్యేకమైన సువాసన ఉంటుంది. దీని బలమైన సువాసన మన నరాలను రిలాక్స్ చేయడానికి ఎంతో బాగా సహాయపడుతుంది. రాత్రి సమయంలో ఈ సువాసనను పీల్చడం ద్వారా రోజంతా పడిన టెన్షన్, ఒత్తిడి తగ్గి మనసు ప్రశాంతంగా మారుతుంది. ఫలితంగా ఎలాంటి ఆందోళనలు లేకుండా గాఢమైన నిద్ర పట్టేందుకు సహాయపడుతుంది.

33
3. దోమలు, కీటకాలు దూరంగా ఉంటాయి:
Image Credit : Gemini ai

3. దోమలు, కీటకాలు దూరంగా ఉంటాయి:

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా రాత్రి పూట దోమలు కుట్టడం వల్ల నిద్రకు భంగం కలుగుతుంటుంది. అయితే లవంగాల ఘాటైన వాసన దోమలకు, చిన్న పురుగులకు అస్సలు పడదు. దిండు కింద లవంగాలు ఉంచడం వల్ల అవి సహజమైన రిపెల్లెంట్‌లా పనిచేస్తాయి. దీనివల్ల దోమలు దరిచేరకుండా రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోవచ్చు.

4.పాజిటివ్ ఎనర్జీ..

కేవలం ఆరోగ్యపరంగానే కాకుండా, మన సాంప్రదాయ నమ్మకాలు, వాస్తు శాస్త్రం ప్రకారం కూడా లవంగాలకు విశేషమైన స్థానం ఉంది. దిండు కింద లవంగాలు పెట్టుకోవడం వల్ల చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి, చెడు కలలు రాకుండా ఉంటాయని చాలా మంది నమ్ముతారు. ఇది మనసుకు పాజిటివ్ ఆలోచనలు తీసుకురావడంలోనూ సహాయపడుతుంది.

ఆరోగ్యపరంగా మంచి సువాసనను, ప్రశాంతమైన నిద్రను అందించడంలో ఈ చిన్న చిట్కా ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి రాత్రి పడుకునే ముందు ఒక చిన్న క్లాత్ లో కొన్ని లవంగాలను మూట కట్టి మీ దిండు కింద ఉంచండి... మార్పు మీరే చూస్తారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Apple: కట్ చేసిన యాపిల్ రంగు మారకుండా ఉండాలంటే ఈ చిన్న పని చేస్తే చాలు!
Recommended image2
Bangles Set: ఎంత చూసినా తనివితీరని యాంటిక్ గాజుల కలెక్షన్
Recommended image3
Dosa Batter: దోశ పిండి మిగిలిపోతే ఈ వంటకాలన్నీ చేసేయండి, పిల్లలు ఇష్టంగా తింటారు
Related Stories
Recommended image1
Sabudana: సగ్గుబియ్యం దేనితో తయారు చేస్తారు..? ఆరోగ్యానికి మంచిదేనా? ఉపవాసం తర్వాత ఎందుకు తినాలి?
Recommended image2
Curd: కేవలం గంటలో పాలను గడ్డ పెరుగులా మార్చేయచ్చు..ఈ సింపుల్ చిట్కా తెలిస్తే చాలు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved