చక్కెర తినకపోయినా.. మీ పాణానికి మంచిది కాదు తెలుసా..!
షుగర్ మన ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అలా అని షుగర్ ను మొత్తమే తినకూడదని చెప్పరు. అయితే కొంతమంది షుగర్ మంచిది కాదని.. దీన్ని మొత్తమే తీసుకోవడం మానేస్తుంటారు. ఇలా చేస్తే మీ ఆరోగ్యం దెబ్బతినడం ఖాయమంటున్నారు నిపుణులు.

కొంతమందైతే అర్థరాత్రుళ్లు నిద్ర లేచి మరీ స్వీట్లను లాగిస్తుంటారు. ఇంకొంతమంది భోజనం తర్వాత స్వీట్లను తింటారు. కానీ కొంతమందికి మాత్రం స్వీట్లంటే అస్సలు ఇష్టముండదు. ఇలాంటి వారికి తీపిని తీసుకోవడమే ఇష్టముండదు. తీపి నచ్చని వారు టీ, కాఫీలను కూడా ముట్టుకోరు. ఎందుకంటే చక్కెర తినడం ఆరోగ్యానికి మంచిది కాదని. కానీ వీళ్లకు తెలియని ముచ్చట్లు చాలానే ఉన్నాయి. చక్కెర తినడం ఆరోగ్యానికి ఎంత మంచిదో, చక్కెర తినకపోవడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదని ఒక అధ్యయనం చెబుతోంది.
sugar
చక్కెర వినియోగం ఆరోగ్యానికి ఎందుకు మంచిది: చక్కెర తీసుకోవడం వల్ల శరీరం రిఫ్రెష్ అవుతుంది. మనస్సును మంచి మూడ్ లో ఉంచుతుంది. అలాగే ఏ సమయంలో నైనా ఇది మీకు కంఫర్ట్ ఫుడ్ గా మారుతుంది. దీనిని తీసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. అయితే షుగర్ ను తినడం మానుకోవడం.. ధూమపానం (Smoking) మానేసినంత కష్టం అని చెబుతారు. చాలా మంది స్వీట్లు తినడం మానేయాలని కోరుకున్నప్పటికీ అది అస్సలు సాధ్యం కాదు.
చక్కెర ఆరోగ్యానికి ఎందుకు మంచిది కాదు: బరువు పెరగడం, అధిక రక్తపోటు, మధుమేహం, ఫ్యాటీ లివర్, స్ట్రోక్ పెరిగే అవకాశాలు వంటి కొన్ని ఆరోగ్య సమస్యలు.. క్రమం తప్పకుండా చక్కెర తీసుకోవడం వల్ల కలుగుతాయి. అంతే కాదు చక్కెర మొటిమలకు కారణమవుతుంది. చర్మాన్ని కూడా దెబ్బతీస్తుంది.
మీరు చక్కెర తినడం మానేస్తే ఏమి జరుగుతుంది: చక్కెర తినడం ఆపేసినప్పుడు శరీరంలో అనేక రకాల మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా మనస్సు ఒత్తిడికి లోనవుతుంది. మూడ్ స్వింగ్స్ ఎప్పటికప్పుడు మారవచ్చు. చక్కెరను తినే అలవాటును మానుకున్నప్పుడు మీరు ఆకస్మికంగా బరువు తగ్గుతారు. వేయించిన ఆహారాలు, చక్కెర బరువు పెరగడానికి రెండు ముఖ్యమైన కారకాలు. అందువల్ల, మీరు చక్కెరను పూర్తిగా వదిలివేస్తే మీరు త్వరగా బరువు తగ్గుతారు. అలాగే ఆరోగ్యకరమైన ఆహారాలను తింటూ వ్యాయామం చేస్తే వారానికి 1 కిలో వరకు మీరు బరువు తగ్గొచ్చు.
Sugar
చక్కెర ప్రత్యామ్నాయాలను తినండి: చక్కెరను మానేయం కష్టంగా అనిపిస్తే దానికి బదులుగా బెల్లం, తేనె, కొబ్బరి చక్కెర వంటి కొన్ని ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలను తినండి. ఈ ప్రత్యామ్నాయాలు అన్నీ చక్కెరతో పోలిస్తే దాదాపు ఒకే మొత్తంలో కేలరీలను కలిగి ఉంటాయి. కాని అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. మీరు తక్కువ కేలరీల స్వీటెనర్లకు మారాలనుకుంటే, ఆరోగ్యకరమైన సహజ స్వీటెనర్లలో ఒకదాన్ని తినండి.