Clove Water: రోజూ ఉదయాన్నే లవంగం నీరు తాగితే ఏమౌతుంది?
Clove Water: లవంగాలు వంటకు రుచి పెంచడమే కాకుండా.. మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కూడా సహాయపడతాయి. ఈ లవంగాలను నీటి రూపంలో తీసుకుంటే ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి.

Clove water
మనకు చాలా సులభంగా లభించే మసాలా దినుసుల్లో లవంగాలు కూడా ఒకటి. బిర్యానీ, చికెన్ లాంటి వాటిల్లో మాత్రమే కాదు... కొన్ని రకాల స్వీట్లలో కూడా ఈ లవంగాన్ని వాడుతూ ఉంటారు. ఈ లవంగాన్ని వంటలో కలిపి కాకుండా... నీటి రూపంలో తీసుకుంటే ఏమౌతుంది? రాత్రంతా నీటిలో లవంగాలను నానపెట్టి... ఉదయాన్నే ఆ నీటిని తాగితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం...
కడుపు ఉబ్బరం...
ఈరోజుల్లో చాలా మంది కడుపు ఉబ్బరం సమస్యతో బాధపడుతున్నారు. అలాంటివారు కేవలం ఈ లవంగం నీరు తాగడం వల్ల కడుపు ఉబ్బరం సమస్య తగ్గుతుంది. లవంగాలు మీ శరీరం ఆహారాన్ని విచ్చిన్నం చేసే ఎంజైమ్ లను విడుదల చేయడంలో సహాయపడతాయి. ఈ లవంగం నీరు తాగితే... కడుపు ఉబ్బరం సమస్య ఉండదు. అంతేకాదు.. నోటి దుర్వాసన సమస్య కూడా ఉండదు. ఉదయాన్నే ఈ లవంగం నీరు తాగడం వల్ల.. టాక్సిన్స్ బయటకు వెళ్లే అవకాశం ఉంటుంది.
జీవక్రియ (Metabolism) , బరువు తగ్గడం...
లవంగం నీరు.. బరువు తగ్గాలి అనుకునేవారికి చాలా బాగా సహాయపడుతుంది. రోజూ లవంగం నీటిని తాగితే.. శరీరంలో కొవ్వు తొందరగా కరగడానికి సహాయపడుతుంది. అంతేకాదు.. శరీరాన్ని సహజంగా ఉత్తేజంగా మారుస్తుంది. లవంగాల్లో ఉండే యూజెనాల్ (Eugenol) అనే సమ్మేళనం ఆహారాన్ని సమర్థవంతంగా జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. ఇది శరీరానికి ఇంధనం అందించే ఇంజిన్‌లా పనిచేస్తుంది. రోజంతా అలసట లేకుండా శక్తివంతంగా ఉండేందుకు ఇది తోడ్పడుతుంది. క్రమం తప్పకుండా తీసుకుంటే బరువు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంది.
రక్తంలో చక్కెర నియంత్రణ
లవంగాలు రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంటాయి. రోజూ ఉదయాన్నే కాఫీలు, టీలు తాగే బదులు.. లవంగం నీరు తాగితే.. రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంటాయి.
శోథ నిరోధక గుణాలు (Anti-inflammatory Benefits)
లవంగాల్లోని యూజెనాల్ శరీరంలోని చిన్నచిన్న మంటలను తగ్గిస్తుంది. కీళ్ల నొప్పులు, చర్మం మంట, కండరాల గట్టిపడటం వంటి సమస్యలకు ఇది సహజ పరిష్కారంలా పనిచేస్తుంది. మందుల్లా వెంటనే పనిచేయకపోయినా... క్రమం తప్పకుండా లవంగం నీరు తాగడం వల్ల.. ఈ సమస్యలు తగ్గిపోతాయి.
కాలేయ ఆరోగ్యం (Liver Health)
మన శరీరంలో వ్యర్థాలను ఫిల్టర్ చేసే ముఖ్య అవయవం కాలేయం. లవంగాలు కాలేయాన్ని రక్షించి, సజావుగా పనిచేయడానికి సహాయపడతాయి. కాలేయం ఆరోగ్యంగా ఉంటే జీర్ణక్రియ మెరుగవుతుంది, శక్తి పెరుగుతుంది.
శ్వాసకోశ ప్రయోజనాలు
లవంగం నీరు తాగితే శ్వాసకోస సమస్యలు రాకుండా ఉంటాయి. దగ్గు సమస్యలు, ఛాతిలో శ్లేష్మం లాంటివి ఉన్నప్పుడు.. వాటిని తగ్గించడంలో లవంగం చాలా గొప్పగా పని చేస్తుంది.జలుబు లేదా దగ్గు ఉన్న వారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది.
ఎలా తయారు చేసుకోవాలి?
రాత్రిపూట 3-4 లవంగాలను ఒక గ్లాసు నీటిలో వేసి నానబెట్టాలి. ఉదయాన్నే ఆ నీటిని తాగితే సరిపోతుంది. కావాలి అంటే... లవంగాలను నీటిలో మరిగించి... తాగినా మంచి ఫలితాలు వస్తాయి.