Health Tips: మూత్రం ఆపితే ఇన్ని సమస్యలొస్తాయా..?
Health Tips: మూత్రాన్ని ఎక్కువ సార్లు ఆపడం వల్ల మూత్రపిండాల (Kidney) సంబంధిత సమస్యలు పెరిగే ప్రమాదం ఉంది. అలాగే ఇది కడుపులో ఇన్ఫెక్షను కు దారితీస్తుంది.

మూత్రపిండాలు రక్తం నుంచి వ్యర్థాలను (Waste), అదనపు నీటిని ఫిల్టర్ చేయడం ద్వారా మూత్రాన్ని (Urin) తయారు చేస్తాయి. మూత్రంలో శరీరంలోని వ్యర్థ బ్యాక్టీరియాలు ఉంటాయి. అందుకే మూత్ర విసర్జన (Urination)చేయాలనే భావన కలుగుతుంది. దానిని ఆపకూడదు. ఇది శరీరం యొక్క అవాంఛిత చర్యల (Unwanted actions)లో ఒకటి. మీరు దానిని నియంత్రించడానికి ప్రయత్నిస్తే, అది శరీరం యొక్క సహజ ప్రక్రియలో ఒక అడ్డంకిని సృష్టిస్తుంది. ఫలితంగా శరీరంలో అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి.
ఆయుర్వేదం (Ayurveda) 13 సహజ ప్రక్రియలను అణచివేయకూడదని వివరిస్తోంది. వాటిలో మూత్రవిసర్జనను నివారించడం కూడా ఒకటి. ముఖ్యంగా మహిళలు అనేక కారణాల వల్ల మూత్ర విసర్జన చేయాలనే కోరికను అణచివేస్తారు. ఇలా చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి.
మూత్రాన్ని ఆపడం వల్ల కలిగే దుష్ప్రభావాలు
మూత్రాశయ సామర్థ్యం వయస్సుపై ఆధారపడి ఉంటుంది: మూత్ర విసర్జనను ఆపే సామర్థ్యం వ్యక్తి వయస్సుపై ఆధారపడి ఉంటుంది. వయోజన మూత్రపిండాలు 2 కప్పుల మూత్రాన్ని నిలిపి ఉంచగలవు. కానీ పిల్లలలో మూత్రాన్ని నిల్వ చేసే సామర్థ్యం దానిలో సగమే ఉంటుంది. అందుకే పిల్లలు (Children)తరచుగా మూత్ర విసర్జన చేస్తారు.
మూత్రవిసర్జన ఆగిపోయినప్పుడు ఏమి జరుగుతుంది: ఆయుర్వేద నిపుణులు మూత్రవిసర్జనను సహజ పిలుపుగా సూచిస్తున్నారు. మీరు దానిని ఆపడానికి ప్రయత్నించినప్పుడు.. మీరు అనేక రకాల సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఒకటి లేదా రెండుసార్లు మూత్రవిసర్జనను ఆపివేయడం వల్ల ఎలాంటి సమస్య ఉండదు. కానీ క్రమం తప్పకుండా ఇలాగే చేస్తే మాత్రం ఫ్యూచర్ లో ఇబ్బందులు ఎదుర్కోకతప్పదు.
మూత్రాశయ సామర్థ్యం కంటే మూత్రం ఎక్కువగా నిరోధించబడితే యుటిఐ (UTI) సంక్రమణ (infection) కు దారితీస్తుంది. వాస్తవానికి మూత్రంలో శరీరంలోని అనేక పనికిరాని బ్యాక్టీరియాలు ఉంటాయి. సకాలంలో దానిని తొలగించనప్పుడు దాని పరిమాణం పెరుగుతుంది. దీంతో Infection సంభవిస్తుంది. దీనివల్ల మూత్ర విసర్జన సమయంలో వివరీతమైన మంట కలుగుతుంది. ఇది ఎక్కువగా మహిళల్లో కనిపిస్తుంది.
మూత్ర పిండాల్లో రాళ్లు: తరచుగా మూత్రవిసర్జనను నిరోధించడం వల్ల మూత్రపిండాల్లో రాళ్ళు (Kidney stones)ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది. అంతేకాక ఆహారం, అధిక శరీర బరువు, వైద్య పరిస్థితి, మెడిసిన్స్ మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడటానికి దారితీస్తాయి.
మూత్రాన్ని పట్టి ఉంచడం వల్ల మూత్ర గోడలు బలహీనపడటం ప్రారంభిస్తాయి. ఈ పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగితే మూత్రాశయం (Bladder)దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇది మూత్ర లీకేజీ (Urine leakage)కి కూడా దారితీస్తుంది. అంతేకాదు.. మూత్రాన్ని ఆపి ఉంచడం దీర్ఘకాలంగా జరిగితే మూత్రాశయం మరియు ప్రైవేట్ భాగాలలో నొప్పికి దారితీస్తుంది.