MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Life
  • Food
  • Mango Recipe: శ్రీకాకుళం స్టైల్ మామిడి ముక్కలు, ఇలా చేస్తే ఏళ్ల పాటు పాడవు, రుచి కూడా డబుల్

Mango Recipe: శ్రీకాకుళం స్టైల్ మామిడి ముక్కలు, ఇలా చేస్తే ఏళ్ల పాటు పాడవు, రుచి కూడా డబుల్

Mango Recipe: వేసవి వచ్చిందంటే మామిడి సీజన్ మొదలైనట్టే. కానీ ఈ సీజన్ ముగిసిన తర్వాత మామిడి రుచి మిస్ అవుతుంటాం. శ్రీకాకుళం స్టైల్ మామిడి ముక్కలు తయారు చేసుకుంటే ఏళ్ల పాటు ఆస్వాదించవచ్చు.  

2 Min read
Author : Nandini Arava
Published : Apr 04 2026, 05:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
సంప్రదాయ వంటకం అంబులా
Image Credit : gemini

సంప్రదాయ వంటకం అంబులా

ఆంద్రా-ఒడిశా సరిహద్దు వంటకాలలో ప్రత్యేక స్థానం ఉన్న సంప్రదాయ వంటకం అంబులా(ఉప్పులో నానబెట్టి ఎండబెట్టిన మామిడి ముక్కలు). పచ్చి మామిడిని ఎండలో ఆరబెట్టి తయారు చేసే ఒకరకమైన ప్రిజర్వ్ ఐటమ్. వేసవిలో లభించే మామిడి కాయలను సీజన్ ముగిసిన తర్వాత కూడా వాడుకోవడానికి ఇది అద్భుతమైన పద్ధతి. ముఖ్యంగా పులుపు రుచికి అంబులాను పప్పులు, చార్లు, కూరల్లో విరివిగా వాడుతుంటారు. చేపల పులుసుకు అయితే అదిరిపోద్ది. సరైన విధంగా తయారు చేస్తే ఇది నెలలు కాదు, ఏళ్ల పాటు కూడా నిల్వ ఉంటుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి
Image Credit : gemini ai

ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి

అంబులా తయారీలో మొదటి స్టెప్ మంచి పచ్చి, గట్టిగా ఉన్న మామిడి కాయలను తీసుకోవాలి. వీటిని బాగా కడిగి, తడి పూర్తిగా ఆరిపోయే వరకు ఉంచాలి. తడి ఉండటం వల్ల ఆరబెట్టేటప్పుడు బూజు పట్టే ప్రమాదం ప్రమాదం ఉంటుంది. ఆ తర్వాత మామిడిని చిన్న ముక్కలుగా కోసుకోవాలి. గింజ దగ్గర గట్టి భాగం ఉన్న ముక్కలు తీసుకుంటే అవి బాగా ఎండుతాయి. ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. 

36
మూతపెట్టి ఒకరోజు ఊరనివ్వాలి
Image Credit : gemini ai

మూతపెట్టి ఒకరోజు ఊరనివ్వాలి

ఇప్పుడు ఈ మామిడి ముక్కలను ఒక గిన్నెలో వేసి, అందులో సరిపడా ఉప్పు కలపాలి. 4–5 మామిడి కాయలకు 2 టేబుల్ స్పూన్ల ఉప్పు చాలు. కొద్దిగా పసుపు కూడా కలిపితే మంచి రంగు కూడా వస్తుంది. మామిడి కాయలకు ఉప్పు కలిపి మూతపెట్టి ఒకరోజు ఊరనివ్వాలి. ఈ సమయంలో మామిడి ముక్కల నుంచి తేమ బయటకు వస్తుంది. ఇది ఆరబెట్టే ప్రక్రియను సులభం చేస్తుంది. 

46
మండుటెండలో ఎండబెట్టాలి
Image Credit : gemini ai

మండుటెండలో ఎండబెట్టాలి

తర్వాత ఈ ముక్కలను మంచి మండుటెండలో ఎండబెట్టాలి. కనీసం 4 నుంచి 5 రోజుల పాటు బాగా ఆరబెట్టాలి. ముక్కలు పూర్తిగా డ్రై అయ్యి, గట్టిగా, కరకరలాడేలా అవ్వాలి. మధ్య మధ్యలో తిప్పుతూ ఉంటే అన్ని వైపులా సమానంగా ఆరుతాయి. తడి ఏ మాత్రం మిగిలి ఉండకూడదు, లేకపోతే నిల్వ సమయంలో పాడవుతుంది. 

56
పొడి స్పూన్ మాత్రమే ఉపయోగించాలి
Image Credit : gemini ai

పొడి స్పూన్ మాత్రమే ఉపయోగించాలి

పూర్తిగా ఎండిన తర్వాత మామిడిముక్కలను గాజు సీసాలో లేదా ఎయిర్‌టైట్ కంటైనర్‌లో నిల్వ చేయాలి. తడి పడకుండా జాగ్రత్తగా ఉంచితే ఇవి చాలా కాలం పాటు చెడిపోకుండా ఉంటాయి. వాడేటప్పుడు కూడా ఎప్పుడూ పొడి స్పూన్ మాత్రమే ఉపయోగించాలి. 

66
మామిడి ముక్కల ప్రత్యేకత ఏమిటంటే..
Image Credit : gemini ai

మామిడి ముక్కల ప్రత్యేకత ఏమిటంటే..

ఈ మామిడి ముక్కల ప్రత్యేకత ఏమిటంటే, ఇది సాధారణ మామిడి పులుపుతో పోలిస్తే కొంచెం ఘాటైన, డీప్ టాంగీ ఫ్లేవర్ ఉంటుంది. పప్పులో ఒకటి రెండు ముక్కలు వేస్తే చాలు… కూర రుచే మారిపోతుంది. ముఖ్యంగా ఫిష్ కర్రీలు, పప్పు, చారు లాంటివాటిలో ఈ మామిడిముక్కలు వేసుకుంటే అసలైన టేస్ట్ వస్తుంది.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
ఆహారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Vinayaka Chavithi Prasadam Recipes: బొజ్జ గణపయ్యకు ఇష్టమైన 5 ప్రసాదాలు..హడావిడి లేకుండా గంటలో రెడీ
Recommended image2
Chepala Ulli Karam: ఆదివారం అదిరిపోయే చేపల ఉల్లికారం..లొట్టలేస్తారు అంతే..
Recommended image3
Asafoetida: రోజూ చిటికెడు ఇంగువ తీసుకుంటే ఏమౌతుందో తెలుసా?
Related Stories
Recommended image1
Mango: గర్భిణీలు మామిడి పండు తింటే ఏమౌతుంది?
Recommended image2
Raw mango: పచ్చి మామిడికాయ తో ఇన్ని లాభాలున్నాయా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved