Fruit Stickers: స్టిక్కర్లు అతికించిన పండ్లను కొంటున్నారా? ముందు ఇది తెలుసుకోండి
Fruit Stickers: ఆపిల్, ఆరెంజ్ వంటి పండ్లపై స్టిక్కర్లు అతికించి ఉండటం చూసే ఉంటారు. చాలా మందికి ఈ స్టిక్కర్లను ఎందుకు అతికించారో అర్థం కాదు. అయితే ఈ స్టిక్కర్లు పండ్లను సరఫరా చేసిన కంపెనీ పేరును తెలియజేస్తుంది.

ఫ్రూట్ స్టిక్కర్స్
మార్కెట్ లో రకరకాల పండ్లు ఉంటాయి. మనం పండ్లను కొనేటప్పుడు ఎన్నో జాగ్రత్తలను తీసుకుంటాం. ఫ్రెష్ గా, లావుగా, బాగా పండిన పండ్లను కొంటుంటాం. అయితే కొన్ని రకాల పండ్లపై స్టిక్కర్లు అతికించి ఉండటం గమనించే ఉంటారు. కానీ ఇలా ఎందుకు చేస్తారో తెలియదు. నిజానికి పండ్లపై స్టిక్కర్లను అతికించడానికి ఒక కారణం ఉంది.
పండ్లకు స్టిక్కర్లను ఎందుకు అతికిస్తారు?
పండ్లకు స్టిక్కర్లను అతికించడం వెనుక ఒక ప్రత్యేక కారణం ఉంది. అంటే ఆ పండు ఎక్కడ పండింది? దానిని పండించడానికి ఏ పద్దతిని పాటించారు వంటి విషయాలను తెలియజేయడానికి ఈ స్టిక్కర్లను అతికిస్తారు. అలాగే ఈ స్టిక్కర్ పండు నాణ్యత గురించి, దాని అసలు ధర గురించి కూడా చెప్తుంది.
ఉత్పత్తిదారుని గుర్తింపు
పండుపై ఉన్న స్టిక్కర్ సాధారణంగా బ్రాండ్ పేరును లేదా సంస్థ పేరును చెప్తుంది. మీరు గమనిస్తే వీటిపై Sunkist,Dole,Del Monte వంటి పేర్లు కనిపిస్తాయి. అంటే స్టిక్కర్ ఉన్న పండు ఏ కంపెనీ నుంచి వచ్చిందో తెలియజేస్తుంది. దీనివల్ల ఆ కంపెనీ పేరు పాపులర్ అవుతుంది.
స్టిక్కర్ పై ఉన్న నంబర్ మీనింగ్
PLU కోడ్ (Price Look-Up Code)
పండ్లపై ఉన్న స్టిక్కర్ పై నాలుగు లేదా ఐదు అంకెల కోడ్ కూడా ఉంటుంది. దీన్నే PLU కోడ్ అంటారు. ఈ కోడ్ పండు రకం, దానిని ఎలా పండించారు అనే సమాచారాన్ని తెలియజేస్తుంది. ఈ కోడ్ లు IFPS ద్వారా నియంత్రించబడతాయి.
స్టిక్కర్ మీదున్న నంబర్ ఏంటి?
పండ్లపై అతికించిన స్టిక్కర్ పై నంబర్ కూడా కనిపిస్తుంది. అసలే ఈ సంఖ్యలకు అర్థం ఏంటని డౌట్ వస్తుంటుంది. అయితే ఇక్కడున్న నంబర్లకు వేర్వేరు అర్థాలు వస్తాయి. మీరు కొన్న పండు స్టిక్కర్ పై 3 లేదా 4 వ నంబర్ తో స్టార్ట్ అయ్యే సంఖ్యలు ఉంటే ఆ పండును కొనకుండా ఉండకపోవడమే మంచిది. ఎందుకంటే వీటిని పండించడానికి రసాయనాలు, పురుగు మందులను వాడతారని ఈ నెంబర్ మనకు సూచిస్తుంది. ఇలాంటి పండ్ల స్టిక్కర్ పై 4231 లేదా 4056 వంటి 4 నంబర్ తో ప్రారంభమైన సంఖ్యలు కనిపిస్తాయి.
5 తో మొదలయ్యే సంఖ్య ఉంటే?
4 నంబర్లు మాత్రమే కాదు 5 నంబర్లు ఉన్న స్టిక్కర్లను కూడా పండ్లపై అతికిస్తారు. సాధారణంగా ఈ సంఖ్యలు 8వ నంబర్ తో స్టార్ట్ అవుతాయి. అంటే 85431 లేదా వంటి సంఖ్యలు ఉంటాయి. ఇలాంటి పండ్లు నేచురల్ గా పండలేదని అర్థం. జన్యుపరంగా మార్పు చెందుతాయి. అంటే వీటిని ప్రయోగశాలలో అభివృద్ధి చేస్తారు.
ఏ స్టిక్కర్లు ఉన్న పండ్లు మంచివి?
సేంద్రీయంగా పండించిన పండ్లే ఆరోగ్యానికి చాలా మంచివి. ఇలాంటి పండ్లను తినడం వల్ల మన ఆరోగ్యం బాగుంటుంది. ఇలాంటి పండ్లపై కూడా స్టిక్కర్లను అతికిస్తారు. వీటిపై 93435 లేదా 95365 వంటి 9 వ సంఖ్యతో ప్రారంభమయ్యే అంకెలు ఉంటాయి. ఈ పండ్లను ఎలాంటి రసాయనాలు, పురుగుమందులను ఉపయోగించకుండా పండిస్తారు.
స్టిక్కర్లు డేంజరా?
అయితే పండ్లపై ఉన్న స్టిక్కర్లను తీసేయకుండానే పండ్లను తినే అలవాటు చాలా మందికి ఉంటుంది. కానీ ఇది మంచిది కాదు. ఈ స్టిక్కర్లను ఫుడ్ గ్రేడ్ గమ్ తో అతికిస్తారు. కానీ దీన్ని తినకూడదు. స్టిక్కర్ ను తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. అందుకే తినడానికి ముందు పండ్లను బాగా కడగాలి. స్టిక్కర్ గమ్ ను పూర్తిగా తొలగించాలి. అలాగే పండు తొక్కను ఖచ్చితంగా తీసేయాలి. ఈ పండ్లకున్న స్టిక్కర్ల ద్వారా ఒక పండు సేంద్రియంగా పండిందా? లేదా? అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. కానీ 9 వ నంబర్ తో మొదలయ్యే PLU కోడ్ ఉన్న పండ్లనే కొనడం మంచిది. ఎందుకంటే వీటిపై కెమికల్స్ ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది.